ఈ నెల 6 వ తేదీన రాహుల్ గాంధీ తలపెట్టిన రైతు సంఘర్షణ సభకు, నియోజకవర్గ రైతంగం పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్డు లక్ష్మణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ధర్మపురి పట్టణంలో హరిత ఫోటోలో ఆయన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారం లో ఉన్నప్పుడు రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేదన్నారు మద్దతు ధర, హమాలి ఖర్చు, మేమె ఇచ్చి ధాన్యాన్ని కొనుగోలు చేశామని వివరించారు.
ధర్మపురి నియోజకవర్గ రైతులను, ధాన్యం కొనుగోలు విషయంలో, మిల్లర్లు దోపిడీ చేస్తున్న స్థానిక మంత్రి ఈశ్వర్ పట్టించుకోలేదు అని ఆరోపించారు.
ఒక్కోరోజుకుడా కొనుగోలు కేంద్రాల వద్దకు అధికారులు, నాయకులు, వెళ్లలేదని, మిల్లర్లు రైతులను దోపిడీ చేస్తున్నారని, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, స్వయానా ముఖ్యమంత్రి కి ,స్థానిక కలెక్టర్ కు లేఖలు ఇచ్చినప్పటికీ ఎటువంటి స్పందన లేదన్నారు
స్థానిక మంత్రి ఈశ్వర్ గారు 2014 నుండి ఇప్పటి వారికీ అధికారం లో ఉండి ధర్మపురి కి చేసింది ఏమిటి ? అంటూ ప్రశ్నించారు,సాంఘిక సంక్షేమ శాఖ ఎల్ .ఎం కొప్పుల ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ తరగతులు ఏంటి?
సాంఘీక సంక్షేమ శాఖ కు, ఎల్. ఎం కొప్పుల ట్రస్ట్ అనుబంధ సంస్థన. అని ఆరోపించారు.
ఇదే ఆలోచన 2014 నుండి ఇప్పటి వరకు ఎందుకు రాలేదు..ఎంతమంది ధర్మపురి నిరుద్యోగ యువతకు ఉద్యోగలు ఇప్పించారు? ఇప్పుటి వరకు ధర్మపురి లో ఐటి కళాశాల లేదు, పాలిటెక్నిక్ కళాశాల లేదు, డిగ్రీ కళాశాల లేదు, బస్ డిపో లేదు, ఎండాకాలం వస్తే ధర్మపురి ప్రజలు నీళ్లకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.. అంటూ పలు ఆరోపణలు చేశారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సంగనభట్ల దినేష్, వేముల రాజేష్, సింహారాజు ప్రసాద్, కస్తూరి శ్రీనివాస్, సిపతి సత్యనారాయణ, .md రఫియోద్దీన్, ముత్తినేని మల్లేష్, బలాగౌడ్, అశెట్టి శ్రీనివాస్, సుముఖ్, జజల రమేష్,.అయ్యోరి మహేష్, చిత్తనోజు రమేష్, మల్లేష్, మోగిలి, తిరుపతి, బుచ్చిరెడ్డి, రాజయ్య, గణేష్,పోచయ్య, పురుషోత్తం, తదితరులు పాల్గొన్నారు.
జిల్లా న్యాయమూర్తి ఘనంగా వీడ్కోలు !

సెకండ్ అడిషనల్ జగిత్యాల జిల్లా, కోర్టు న్యాయమూర్తి గన్నారపు సుదర్శన్ , సంగారెడ్డికి బదిలీ పై వెళుతున్న సందర్భంగా జగిత్యాల జిల్లా బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వీడ్కోలు కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో, ధర్మపురి బార్ అసోసియేషన్ అధ్యక్షులు తిరమందాసు సత్యనారాయణ, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బెత్తపు లక్ష్మణ్,, న్యాయవాదులు దుమ్మెన శ్రీనివాస్, మామిడాల శ్రీకాంత్ కుమార్,జాజాల రమేష్ లు జడ్జి సుదర్శన్ ను శాలువతో సన్మానించి వీడ్కోలు తెలిపారు, ధర్మపురి కోర్టు ప్రారంభోత్సవం కోసం, జిల్లా న్యాయమూర్తి చేసిన కృషి మరువలేనిది అని న్యాయవాదులు గుర్తు చేశారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి సుదర్శన్ మాట్లాడుతూ ధర్మపురి కోర్టు భవనం మంచి ఆహ్లాదకరమైన వాతావరణం లో ప్రశాంతంగా ఉంది అన్నారు.
రంజాన్ కానుకగా దుస్తుల పంపిణి
ధర్మపురి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో, సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్, ఆదేశానుసారం ఎంపీపీ ఎడ్ల చిట్టిబాబు, అధ్యక్షతన ముస్లిం సోదరులకు రంజాన్ కానుక తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా దుస్తుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపిపి గడ్డం మహిపాల్ రెడ్డి , అయ్యోరి రాజేష్ కుమార్, మండల కో అప్షన్ కైసర్ అహ్మద్, అరేపెళ్లి ఎంపిటిసి సభ్యురాలు కుంబాల రజితరమేష్, నెరేళ్ల ఎంపిటిసి రెడ్డవెని సత్యం,TRS నాయకులు, మరియు ముస్లిం సోదరులు తదితరులు పాల్గొన్నారు.

కేసు నమోదు !

జగిత్యాల జిల్లా బుగ్గారం పోలీస్ స్టేషన్ గేటు ముందే సీనియర్ జర్నలిస్ట్ చుక్క గంగారెడ్డి పై బుగ్గారం మండల వైస్ ఎంపిపి, సర్పంచ్ భర్త తో పాటు పలువురు దాడి కి పాల్పడిన సంఘటనలో బాధితుని పిర్యాదు మేరకు బుగ్గారం ఎస్సై సందీప్, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. .బుగ్గారం మండల వైస్ ఎంపిపి జోగినిపెళ్లి సుచెందర్ రావు, సర్పంచ్ భర్త మూల శ్రీనివాస్ గౌడ్, మూల శంకరయ్య, నగునూరి శ్రీనివాస్ (గౌడ్) అలియాస్ స్వామి, కండ్లే అనిల్ లపై, ఐ పిసి సెక్షన్, 341, 323, 506, .ఆర్ డబ్లు 34 ల ప్రకారం కేసు నమోదు చేశారు.
బాధితుని పిర్యాదు కథనం ప్రకారం బుగ్గారం గ్రామపంచాయతీ లో జరిగిన నిధుల దుర్వినియోగాన్ని , సమాచార హక్కు చట్టం కార్యకర్తగా వివరాలు కోరుతూ పై అధికారులకు ఫిర్యాదు చేసిన తనపై దాడికి పాల్పడ్డారని గంగారెడ్డి ఆరోపిస్తున్నారు. పోలీస్ స్టేషన్ లోని సిసి కెమెరా రికార్డుల ప్రకారం దాడిలో పాల్గొన్న వారందరిపై కేసు నమోదు చేయాలని,నిందితులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని బాధితుడు ,చుక్క గంగారెడ్డి పోలీస్ అధికారులను కోరారు.
రాయికల్ లో ఇఫ్తార్ విందు !

రాయికల్ పట్టణ ,షాది ఖానా లో రంజాన్ పండుగ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ,ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పాల్గొన్నారు. తురక కాశీ కాలనీ లో, మంజూరైన వాటర్ ట్యాంక్ స్తల పరిశీలన చేసి మజీద్ లో మైనార్టీ సోదరులకు రంజాన్ కానుకలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ, రంజాన్ మాసం ముస్లిం సోదరులు పవిత్రంగా,ఉపవాస దీక్ష తో కొనసాగిస్తారని,తెరాస ప్రభుత్వం ముస్లిం ల సంక్షేమం కోసం కృషి చేస్తున్నదని, జగిత్యాల నియోజకవర్గం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సహకారం తో మస్జీద్, శదీఖాన, అశురఖాన, ఖబరస్తాన్ ల అభివృద్ధి కోసం నిధులు మంజూరు అయినవని తెలిపారు.

మైనారిటీ లకు తెరాస ప్రభుత్వ హయాంలో మైనారిటీ ఓవర్సీస్ విద్య కోసం 20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. .తెలంగాణ లో హిందూ ముస్లిం సోదర భావం తో ఉంటారని, ,శాంతి భద్రతల పరిరక్షణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ,అందువల్లనే రాష్ట్రానికి వేల కోట్లలో విదేశీ కంపెనీలు, హైదరాబాద్ లో పెట్టుబడులు పెడుతున్నారని, రంజాన్ మాసం చివరి రోజున ఇఫ్తార్ లో పాల్గొనడం చాలా ఆనందం గా ఉందని, హిందూ ముస్లిం అనే తేడా లేకుండా అందరూ సంక్షేమం,అభివృద్ధి ధ్యేయంగా ముఖ్యమంత్రి గారు పని చేస్తున్నారని ఎమ్మెల్యే వివరించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమాండ్లు,టీఆరెఎస్ పట్టణ అధ్యక్షుడు ఇంతియాజ్,
PACS ఛైర్మెన్ ఏనుగు మల్లారెడ్డి,RTA జిల్లా మెంబర్ సుధాకర్ రావు, కౌన్సిలర్ లు,నాయకులు,మైనార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.