రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోంది – మాజీ ఎంపీ డాక్టర్ వివేక్!


తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ రాక్షస పాలన కొనసాగిస్తున్నారని బీజేపీ నేత మాజీ ఎంపీ డాక్టర్ వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. ఆదివారం నారాయణ్ పేట్ మండలం కొంపెల్లి, లింగంపల్లి గేట్, ధన్వాడ, మణిపూర్ తండ , వరకు పాదయాత్ర కొనసాగించారు. బండి సంజయ్ పాదయాత్రకు సంఘీభావంగా ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యేలు బొడిగె శోభ ,ఏనుగు రవీందర్ రెడ్డి , పలువురు బీజేపీ నాయకులు పాదయాత్రలో పాల్గొన్నారు..

ఈ సందర్భంగా డాక్టర్ వివేక్ మాట్లాడుతూ.
అవినీతి సీఎం కు ప్రజలు తగిన విధంగా బుద్ది చెప్పాలి,
రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేస్తానన్న కేసీఆర్ … తన కుటుంబాన్ని బంగారు కుటుంబంగా మార్చుకున్నాడు అని ఆరోపించారు. కేంద్రం అభివృద్ది కోసం నిధులిస్తే ప్రాజెక్టుల రీ డిజైన్లు చేసి వేల కోట్లు దోచుకొంటున్నారు మిషన్ భగీరథలో 40 వేల కోట్ల కుంభకోణం జరిగింది అన్నారు.
కమీషన్ల కోసం స్కీంలు తప్ప, ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకోవటం లేదని, కేసీఆర్ గ్రాఫ్ పడిపోయి మోడీపై లేనిపోని విమర్శలు చేసేతున్నాడు. అన్నారు
వరి వెయ్యోద్దనణందుకు 30 లక్షల మంది రైతులు నష్టపోయారు , రాష్ట్రంలో కేసీఆర్ సర్కారు మంచిగ పనిచేస్తే ప్రశాంత్ కిశోర్ అవసరమేముంది, ప్లీనరీలో ప్రకటించిన టీఆర్ఎస్ ఆదాయం ,800 కోట్లు ప్రజా సొమ్ము.
తక్షణమే ప్రజలకు డిపాజిట్ చేయాలి.. అంటూ డిమాండ్ చేశారు. కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి లో కమీషన్ల కోసమే మెగా క్రిష్ణారెడ్డికి కట్టబెట్టిండు ,అవినీతి సొమ్ముతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నాడు ,సీఎం ఇచ్చిన హామీలు మర్చిపోయాడు అని, ప్రజలు తగినవిధంగా బుద్ది చెప్పడం ఖాయం అంటూ వివేక్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అవినీతిని ప్రజలకు వివరించి టీఆర్ఎస్ సర్కారును గద్దెదించేందుకే బండి సంజయ్ పాదయాత్ర. అంటూ అనేక ఆరోపణలు చేశారు.

ఉచిత రేషన్ బియ్యం బంద్ !


కరోనా నేపథ్యంలో గత సంవత్సర కాలం పైగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పంపిణీ చేస్తున్న ఉచిత రేషన్ బియ్యం ను ప్రభుత్వం బందు చేసింది . కిలో బియ్యం కు ఒక రూపాయి చెల్లించి రేషన్ బియ్యం కొనుగోలు చేయాల్సిందే అని ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొంది. జగిత్యాల జిల్లాలో 587 రేషన్ షాప్ ల తో పాటు మరో ఐదు నూతన షాపులను ప్రభుత్వం మంజూరు చేసింది.

. ధర్మపురి మండలంలో మగ్గిడి, దుబ్బల గూడెం, ఆక్ససాయి పల్లె, నక్కల చెరువు గూడెం, కోరుట్ల పట్టణంలో మరో షాప్ కు ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ నెల 15 వరకు రేషన్ షాపులు తెరిచి ఉంటాయని, పాత విధానంలో ఓటిపి కొనసాగుతుందని ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్నపూర్ణ కార్డులకు,ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్నట్టు ప్రకటించారు. జిల్లాలో 309148 కార్డులు ఉండగా .5663.543 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని జిల్లాకు కేటాయించారు.