కన్నులపండువగా సహస్ర కలశభిషకం!

మంగళ వాయిద్యాలు వేద మంత్రాల ఘోషలో అంగరంగ వైభవంగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి సహస్ర కలశాభిషేకం బుధవారం ఉదయం కన్నుల పండువగా జరిగింది స్వామివారి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా 5వ రోజు ఉదయం,

వేదపండితులు, అర్చకులు ,పురుషసూక్త , శ్రీసూక్తం,  కల్పోక్త ,  న్యాసపూర్వక ,  షౌడశోపచార పూజ , సహస్రనామార్చన,  పంచోపనిషత్తులతో, రుద్రాభిషేకం , మరియు వాస్తు , యోగిని,  క్షేత్ర పాలక , నవగ్రహ, సర్వతోభద్రమండలి ,  స్థాపిత దేవతాపూజల  అనంతరం  పూర్ణాహుతి , శ్రీస్వామి వారికి  సహస్ర కలషాభిషేకం కార్యక్రమం నిర్వహించారు. 

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం కార్యనిర్వహణాధికారి, రెనవేషన్ కమిటి సభ్యులు , వేదపండితులు, అర్చకులు , సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.


అంజన్న దర్శించుకున్న కలెక్టర్ దంపతులు!


కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి వారి నీ జగిత్యాల్ కలెక్టర్ రవి నాయక్  దంపతులు, జెడ్పి చైర్ పర్సన్  దావా వసంత దంపతులు, దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.. ముందుగా  కొండగట్టు అంజన్న సేవా సమితి వారి అఖండ హనుమాన్ చాలిసా పారాయణం లో పాల్గొని ,అనంతరం ఆంజనేయ స్వామిని దర్శించుకున్నారు.

విశ్వకర్మ ఆరాధన!


ధర్మపురి పట్టణ కేంద్రంలో గల స్థానిక పవిత్ర గోదావరి నది తీరనా  శ్రీ శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి 329 వ ఆరాధన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి మండల విశ్వ బ్రాహ్మణ సంఘం మాజీ మండల అధ్యక్షుడు ప్రస్తుత జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరికొండ అశోక్ చారి ఆధ్వర్యంలో బుధవారం  ఆరాధన ఉత్సవాలను ఘనంగా. జరిగాయి. ఆలయ వేద పండితులు, అర్చకులు ,అడ్లూరి ప్రశాంత్, ఓరుగంటి నరేష్, ఆధ్వర్యంలో స్వామివారికీ ప్రతేక పూజ కార్యక్రామలు నిర్వహించడం జరిగింది, ఆలయ వేద పండితులు, ప్రశాంత్ మాట్లాడుతూ విశ్వకర్మ ఆరాధన ఉత్సవాలు అనగా నేడు స్వామివారు సజీవ సమాధి అయినా సందర్భాన్ని పురస్కరించుకోని ఆరాధన ఉత్సవాలను నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు ఆరాధన ఉత్సవాలలో భాగంగా ఆలయ గర్భ గుడిలో ఉన్న స్వామివారి మూల విరాట్ కు నూతనంగా మండల మాజీ అధ్యక్షుడు ప్రస్తుత జిల్లా కార్యవర్గ సభ్యుడు డాక్టర్ సిరికొండ అశోక్ చారి బహుకరించిన మకర తోరణం,నాగ పడిగేను, స్వామివారి మూల విరాట్ కు అలంకరించారు ఇట్టి కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ దేవరకొండ గంగాధర్, మండల అధ్యక్షుడు కనుకుల స్వామి, పట్టణ అధ్యక్షుడు శ్రీనివాస్, మురళీ,  జ్ఞానచారి, సత్యం, రవి, వీరేశం, రాజేశం, రమణ, ఆలయ సిద్ధాంతి లక్ష్మీ నారాయణ లతో పాటు, సంఘ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.


గోదావరిఖని లో  మంత్రి ఈశ్వర్ గత 9 సంవత్సరాల క్రితం సొంత డబ్బులతో నిర్మించిన శ్రీ విజయ దుర్గా దేవి 9 వ వార్షికోత్సవం బుధవారం అంగరంగ వైభవంగా జరిగింది. ధర్మపురి ఆలయ వేదపండితుడు బొజ్జరమేష్ శర్మ, . ప్రముఖ  పండితుడు కాసర్ల వంశీ శర్మ,  వార్షికోత్సవ పూజా కార్యక్రమాలను నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు.

బుగ్గారం జడ్పిటిసి సభ్యుడు బాదినేని రాజేందర్ దంపతులు , ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రామయ్య, సురేందర్ , ధర్మపురి పట్టణ మున్నూరు కాపు సంఘ అధ్యక్షుడు సంఘీ శేఖర్  నియోజకవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు, టిఆర్ఎస్ శ్రేణులు వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.