J. Surender Kumar
చదువుల్లో తేజస్సును ప్రదర్శిస్తూ తల్లిదండ్రులు పెట్టిన ఆదిత్య అన్న పేరును సార్థకం చేసుకుంటున్నాడూ ఆ సరస్వతీపుత్రుడు. కన్నవాళ్లు గర్వపడేలా ఇంతింతై అన్నట్టుగా ఎదుగుతున్నాడు జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన కాకెరి ఆదిత్య. గేట్ ఎగ్డామ్ రాసిన ఆదిత్య ఆల్ ఇండియా లెవల్లో 24వ ర్యాంక్ సాధించి.. దేశంలోని ఆరు ఐఐటీల్లోనూ మొదటివిడతలోనే సీటు సంపాదించాడు. తన తల్లిదండ్రులు కాకెరి లలిత, సనత్ కుమార్ గర్వపడేలా చేశాడు. చిన్ననాట్నుంచీ పుస్తకాల పురుగై చదివిన ఆదిత్య కరీంనగర్ లోని గౌతమ్ మాడల్ స్కూల్ లో ఎస్సెస్సీ టాపర్ గా నిల్చాడు. ఆతర్వాత ట్రినిటీ కళాశాలలో ఇంటర్ లో టాప్ ర్యాంకర్ గా హైయెస్ట్ మార్కులతో తన ప్రతిభను చాటాడు. హన్మకొండలోని కాకతీయ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశాడు. గేట్ రాసి కర్నాటకలోని సూరత్ కల్ లో మొట్టమొదటిసారి ఎన్ఐటీలో ఎంటెక్ లో సీటు సంపాదించిన కొద్దిరోజులకే… ఆదిత్య టీసీఎస్ కు సెలెక్టవ్వడం… అక్కడ కొద్దిరోజుల ఉద్యోగం తర్వాత వెనువెంటనే బీఎస్ఎన్ఎల్ ఉద్యోగం రావడంతో… ప్రస్తుతం కేరళలో జూనియర్ టెలికాం ఆఫీసర్ హోదాలో పనిచేస్తున్నాడు. ఆఫీస్ పనిలో ఎంత ఒత్తడున్నా… సాయంత్రానికి ఇంటికి వచ్చి తన చదువు మాత్రం కొనసాగిస్తున్న ఆదిత్య.. మళ్లీ గేట్ ఎగ్జామ్ అటెండ్ చేయగా… ఆదిత్యకు దేశంలోని ఢిల్లీ, ముంబై, రూర్కీ, మద్రాస్, గుహావాటి, ఖరగ్ పూర్ ఆరు ఐఐటీల్లో ఏకకాలంలో మొదటి విడతలోనే సీటు రాగా.. ఢిల్లీ ఐఐటీలో కంట్రోల్ అండ్ ఆటోమేషన్ తో పాటు… టెలికమ్యూనికేషన్ టెక్నాలజీ మేనేజ్ మెంట్.. రెండు విభాగాల్లోనూ సీటు వచ్చింది. దీనిపై తల్లిదండ్రులతో పాటు… వారి బంధువులు, శ్రేయోభిలాషులు, స్నేహితులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వీటితో పాటే దేశంలోనే ఒక్క ఒక్క ప్రతిష్ఠాత్మకమైన ఇనిస్టిట్యూటైన బెంగళూర్ లోని ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ లోనూ ఇంటర్వ్యూ పూర్తి కాగా… ఆ ఫలితాలు ఇంకా వెల్లడి కావల్సి ఉంది. ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ తన లక్ష్యంగా పెట్టుకున్న ఆదిత్య ఇప్పటికే ఆ ఎగ్జామ్ రెండుసార్లు అటెండ్ కాగా… రెండుసార్లూ ప్రిలిమ్స్ పూర్తి చేసుకుని మెయిన్స్ కు సెలక్టయ్యాడు. త్వరలో మెయిన్స్ ఎగ్జామ్స్ రాయనున్న ఆదిత్య… ఓవైపు కన్నవాళ్లకు దూరంగా ఉంటూ… ఇంకోవైపు ఉద్యోగం చేస్తూనే… తననుకున్న లక్ష్యం వైపు దూసుకెళ్తున్నాడు. మరి ఈ చదువరికి మనవంతూ బెస్టాఫ్లక్ చెబుదాం.