ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి వారి నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా శనివారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 14 వరకు జరగనున్న ఈ ఉత్సవాల్లో ప్రధాన ఉత్సవాలు

సహస్ర కలశాభిషేకం, చందనోత్సవం ఉత్సవం, వసంతోత్సవం, 14 వ జయంతి . ఉత్సవాలు ఘనంగా జరగనున్నాయి. పుణ్య వచనము, కరణము, కలశస్థాపన, అభిషేకము, వేదోక్తముగా, సహస్ర కలశ స్థాపన, నవగ్రహ యోగిని, వాస్తు క్షేత్రపాలక స్థాపన, అర్చనాది కార్యక్రమాలు నిత్య హోమాలు, జరుగుతున్నాయి. ప్రతి నిత్యము లక్ష్మి సూక్త సంపుటీకరణ, లలిత, విష్ణు, సహస్రనామ పారాయణ లు జరుగుతున్నాయి.

నవరాత్రుల్లో ప్రధాన ఉత్సవాలు !
11-05-2022 బుధవారం సహస్ర కలశాభిషేకం,
12-05-2022 గురువారం చందనోత్సవం !
13-05-2022 శుక్రవారం పల్లవ ఉత్సవం వసంతోత్సవం,
14-05-2022 శనివారం శ్రీ నరసింహ జయంతి ప్రధాన
విస్తృత ఏర్పాట్లు !

తొమ్మిది రోజుల పాటు భారీగా తరలి వచ్చే భక్తజనం సౌకర్యార్థం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కార్య నిర్వహణాధికారి సిబ్బంది. విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు తాగునీటి వసతి చలువ పందిళ్ళు భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు అభివృద్ధి కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, గందె పద్మ, అక్కన్న పెళ్లి సురేందర్, వీర వేణి కొమురయ్య, చుక్కా రవి, స్తంభం కాడి మహేష్, ఇనుగంటి రమాదేవి, గుని శెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, గుంపుల రమేష్, వేముల నరేష్, జైన రాజమౌళి, సంగం సురేష్,. కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ సిబ్బంది ఈ ఆలయ ప్రాంగణంలోనే మకాం వేసి భక్తుల సౌకర్యాల కల్పన కోసం చర్యలు చేపడుతున్నారు.
నరసింహ స్వామి భక్తులకు ‘ సిరా’ ప్రసాదం !

నేటి నుంచి స్వామివారి భక్తజనంకు సిరా ప్రసాదం అందుబాటులో . స్వామివారి లడ్డు పులిహోర ప్రసాద్ అన్న తో పాటు చీర ప్రసాదం కూడా ఆలయం పక్షాన అమ్మకాలు చేపట్టనున్నారు. కమిషనర్ ఆదేశాల మేరకు సిరా ప్రసాదం భక్తజనంకు అమ్మకాలు జరుపుతున్నట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు.
