శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న – మంత్రి ఈశ్వర్!


లక్ష్మీ నరసింహ స్వామి నవరాత్రి ఉత్సవాల లో. సోమవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

మంత్రితో పాటు జగిత్యాల జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావా వసంత, స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, కార్యనిర్వహణాధికారి ,సంకటాల శ్రీనివాస్, మంత్రికి సాంప్రదాయబద్ధంగా మేళతాళాలతో ఘనంగా స్వాగతించారు. దర్శనం అనంతరం మంత్రి జెడ్పి చైర్ పర్సన్ లకు ఆశీర్వాద మండపంలో స్వామివారి శేష వస్తానన్ని ప్రసాదాన్ని అందజేశారు. మంత్రి వెంట మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జెడ్పిటిసి సభ్యురాలు బత్తిన అరుణ తదితరులు పాల్గొన్నారు.


అభివృద్ధి పనులకు శంకుస్థాపన !


ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, మరియు పట్టణం పలు అభివృద్ధి కార్యక్రమంలో, రాయపట్నం, చౌరస్తా, నర్సయ్య పల్లె రోడ్డు ఫై జాతీయ రహదారి 63 పై  కోటి రూపాయల తో నిర్మించబోయే స్వాగత తోరణాల నిర్మాణానికి, మంత్రి ఈశ్వర్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంత, సోమవారం శంకుస్థాపన  చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.





మృత్యువు లోనూ వీడని అన్నదమ్ముల అనుబంధం

లక్షేట్టిపేట పట్టణం కి చెందిన గాజుల భాస్కర్ గౌడ్, సోమవారం, ధర్మపురి లో మృతి చెందారు. భాస్కర్ మృతదేహాన్ని  లక్షేటిపేట లోని స్వగృహం కు తరలించారు. జగిత్యాల లో ఉంటున్న సోదరుడు, గాజుల శ్రీనివాస్ గౌడ్, లక్షెట్ట్టిపేట కు  వెళ్లి చివరిసారిగా సోదరుని మృతదేహం చూసి నీ సోదరుని మృతదేహాన్ని చూసి, గుండెపోటు తో హటాస్మరణం చెందాడు.  అన్నదమ్ముల మృతి తో ధర్మపురి , లక్షేట్టిపేట్ పట్టణాలతోపాటు, బంధు వర్గం లో ఇరువురి కుటుంబాల్లో  విషాదం నెలకొంది.