గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు ఎల్.ఎం.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ద్వార స్టడీ మెటీరియల్ ను మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు మంగళవారం అందించారు.

గ్రూప్ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న నిరుద్యోగ యువతకు, ధర్మపురిలో అందిస్తున్న ఉచిత శిక్షణ కార్యక్రమంలో, పాల్గొని పోటీ పరీక్షలకు శిక్షణ పొందిన వారికి ఉచితంగా ఎల్.ఎం.కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ స్టడీ మెటీరియల్ కొప్పుల దంపతులు అందించారు.
అభివృద్ధి పనుల పరిశీలన!

ధర్మపురి పట్టణ కేంద్రంలో పలు అభివృద్ధి కార్యక్రమాలలో
భాగంగా ₹ 2కోట్ల 65 లక్షల నిధుల తో స్టేడియం
నిర్మాణానికీ స్థలాన్ని మంత్రి ఈశ్వర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, జడ్పీటీసీ బత్తిని అరుణ,. డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, యంపిపి చిట్టి బాబు,, మాజీ మార్కెట్ చైర్మన్ అయ్యోరి రాజేష్, తదితరులు పాల్గొన్నారు.