బుధవారం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలతో సైబర్ నేరాల పట్ల తీసుకోవాల్సిన చర్యల గురించి మరియు IT ఇండస్ట్రీ, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్‌లు మరియు విద్యా సంస్థలు మరియు ఇతర సంస్థలతో కలిసి సైబర్, సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ,కోసం CoE (సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్) కాన్సెప్ట్ ప్రెజెంటేషన్ పై డీజీపీ మహేందర్ రెడ్డి ,వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా డీజీపీ మాట్లాడుతూ….. పెరిగిపోతున్న సాంకేతికతకు తగ్గట్టుగానే దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్న, నేపథ్యంలో సైబర్ క్రైమ్ యూనిట్ల యొక్క ఆవశ్యకత చాలా ఉన్నదని తెలిపారు. ఇందుకోసమే పోలీస్ శాఖ ప్రత్యేకంగా కార్యాచరణ రూపొందించి ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒకరిని , సైబర్ వారియర్ గా నియమించడం జరిగిందని అన్నారు. సైబర్ నేరాలను అదుపు చేయడంతో పాటు, ప్రజలు సైబర్ నేరగాళ్ల వలలో పడకుండా అవగాహన కల్పించడం, అన్ని స్థాయిల పోలీస్ అధికారులకు సైతం మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా, సైబర్ క్రైమ్స్ పట్ల మరింత అవగాహన కల్పించడం లక్ష్యంగా రూపొందించిన, ఇన్వెస్టిగేటర్స్ డైరెక్టరీ ఫర్ సైబర్ వారియర్స్ సిరీస్ 3.0 పుస్తకాన్ని డీజీపీ ఆవిష్కరించారు. ఈ పుస్తకంలో అనుభవజ్ఞులైన సైబర్ నిపుణుల, ద్వారా ఎన్నో విషయాలను పొందుపరచడం జరిగిందని డిజిపి తెలిపారు. అనతరం పోలీస్ కమిషనర్లు, జిల్లాల ఎస్పీలు, మరియు ఇతర సీనియర్ పోలీసు అధికారుల ,నుండి సైబర్ నేరాల నియంత్రణ ఫై తీసుకోవలసిన చర్యల పై పలు సూచనలు ఆయన చేశారు.
వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ ,అదనపు ఎస్పీ రూపేష్ , DCRB డీఎస్పీ, రవీంద్ర కుమార్, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, ఐటీ కోర్ సిఐడి పాల్గొన్నారు.

వేధింపులు మరణం ?
మంచిర్యాల పట్టణంలోని గోపాల్ వాడ లో దారుణం.,
గోపాల్ వాడ కి చెందిన బోల్లు కళ్యాణి అనే మహిళ లోన్ ఆప్ రుణం వారి వేధింపులు భరించలేక ఆత్మహత్య కు చేసుకున్నట్టు సమాచారం పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జాతీయ రహదారిపై ప్రమాదం ఒకరు మృతి !
ధరం పూరి జగిత్యాల్ జాతీయ రహదారి 63 రోడ్డు ప్రమాదం జరిగింది. సంఘటన స్థలంలో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ధర్మారం మండలం రాజారాం పల్లె లో మెకానిక్ గా పనిచేస్తున్న రమేష్ , జగిత్యాల వైపు నుంచి రాత్రి ద్విచక్ర వాహనం పై వస్తుండగా, ధర్మపురి పోలీస్ స్టేషన్ పరిధి బుద్ధి పల్లె స్టేజి సమీపంలో. ధరం పూరి వైపు నుంచి వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రమేష్ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందాడు. మంచిర్యాల జిల్లా లక్షేట్టిపేట్ సత్యసాయి నగర్ ప్రాంతానికి చెందిన పసుపులేటి మహేందర్ పసుపులేటి అంజి లకు ఓ యువతి గాయపడినట్టు సమాచారం. తీవ్ర రక్త గాయాలు అయిన వారిని పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను జగిత్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరిగిన తీరుతెన్నులను పోలీసులు పరిశీలిస్తున్నారు.
