దేశానికి ఆదర్శం తెలంగాణ గ్రామాలు – మంత్రి ఈశ్వర్!

జగిత్యాల మే 10:- దేశానికి ఆదర్శంగా తెలంగాణ గ్రామాలు నిలుస్తున్నాయని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. మంగళవారం జగిత్యాల జిల్లాలోని జాతీయ అవార్డు సాధించిన కొడిమ్యాల మండలం ప్రజాప్రతినిధులకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో మంత్రి జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పాల్గొన్నారు.
ఆజాదీ కా అమృత మహోత్సవంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం  జగిత్యాల జిల్లాలోని కొడిమ్యాల మండలం ప్రజా పరిషత్ కు దీన్ దయాల్ ఉపాధ్యాయ పంచాయతీ స్వశక్తి కరణ్  అవార్డు అందించిందని మంత్రి తెలిపారు. 


కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అవార్డుల అందించడానికి 10 గ్రామాలను ఎంపిక చేస్తే, 10 గ్రామాలు తెలంగాణలో ఉండటం సీఎం కేసీఆర్ నాయకత్వానికి ప్రతీకని మంత్రి తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో 11 గ్రామాలకు, 4 మండల ప్రజా పరిషత్ లకు,1 జిల్లా ప్రజా పరిషత్ అవార్డులు లభించాయి అని మంత్రి తెలిపారు. 
గ్రామాల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ తీసుకున్న పల్లె ప్రగతి కార్యక్రమం, నూతన పంచాయతీ రాజ్ చట్టం, గ్రామ సర్పంచులు ప్రజాప్రతినిధులు అధికారులు చేసిన కృషి ఫలితంగా మంచి ఫలితాలు సాధిస్తున్నాం అని మంత్రి అన్నారు. కొడిమ్యాల మండలం ప్రజా పరిషత్ స్ఫూర్తితో జిల్లాలోని ప్రతి గ్రామం మండలంలో అభివృద్ధి పనులు పారిశుద్ధ్య కార్యక్రమాలు పకడ్బందీగా చేపట్టాలని మంత్రి సూచించారు.
దేశంలో 18 రాష్ట్రాల్లో బిజెపి అధికారంలో ఉందని, తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఒక్క సంక్షేమ పథకం సైతం ఆ రాష్ట్రాలలో  అమలు కావడం లేదని మంత్రి ధ్వజమెత్తారు. ప్రధానమంత్రి సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం 600 వృద్ధాప్య పెన్షన్ అందిస్తారని, మన రాష్ట్రంలో 2016 ఆసరా పింఛన్లు అందిస్తున్నామని మంత్రి తెలిపారు.
దేశంలో రైతాంగానికి నిజమైన రైతు భరోసా సీఎం కేసీఆర్ మాత్రమేనని మంత్రి స్పష్టం చేశారు.రైతుల కోసం సీఎం కేసీఆర్ రైతుబంధు, రైతు బీమా, పంటల కొనుగోలు,24 గంటల ఉచిత  నాణ్యమైన విద్యుత్ సరఫరా, సకాలంలో ఎరువులు విత్తనాలు సరఫరా, ఉద్యానవన పంటలు ప్రోత్సాహకం ,వ్యవసాయ యాంత్రీకరణ వంటి పథకాలను అమలు చేస్తున్నారని, దేశంలో మరే రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ ల చర్యలు తీసుకోవడం లేదని మంత్రి స్పష్టం చేశారు.
రైతుల భూ సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి ధరణి వెబ్ పుటలను సీఎం కేసీఆర్ రూపొందించారని, వాటి వల్ల పైరవీలు లేకుండా రిజిస్ట్రేషన్ ప్రక్రియ సాఫీగా సాగుతుందని మంత్రి తెలిపారు.  రైతులకు ఉపయోగకరంగా ఉన్న ధరణి వెబ్ సైట్ ను రద్దు చేస్తామని ప్రకటించడం దళారీ వ్యవస్థను ప్రోత్సహించడమేనని, దళారీల తో కొమ్ముకాసిన కాంగ్రెస్ నాయకుల పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి రవి మాట్లాడుతూ రాష్ట్రంలో నాలుగు మండల ప్రజా పరిషత్ అవార్డులు సాధించాయి, అందులో కొడిమ్యాల మండలం ఒకటి కావడం గర్వకారణమని ఆయన అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ మాట్లాడుతూ


చొప్పదండి పోలీస్ స్టేషన్ కు 2 సార్లు జాతీయ అవార్డులు, పురపాలక సంఘానికి 3 సార్లు జాతీయ అవార్డులు, ప్రస్తుతం కొడిమ్యాల మండల ప్రజా పరిషత్ జాతీయ అవార్డు లభించడం గర్వకారణమని ఎమ్మెల్యే తెలిపారు.
అనంతరం కొడిమ్యాల మండల ప్రజా పరిషత్ ఎంపీపీ శ్రీమతి స్వర్ణలత రాజ నరసింగ రావులను , వివిధ గ్రామాల సర్పంచులను, అధికారులు, సిబ్బందిని తదితరులు ను ఘనంగా సన్మానించారు.
శాసనమండలి సభ్యులు ఎల్. రమణ, జెడ్పిటిసిలు, ఎం.పి.టి.సి.లు, సర్పంచ్లు  ,ప్రజా ప్రతినిధులు సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

దళిత బంధు ప్రొసీడింగ్స్ !


దళిత బందు పథకాన్ని వినియోగించుకుంటూ  దళితులు ఆర్థికంగా ఎదగాలని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పిలుపునిచ్చారు.  మంగళవారం గొల్లపల్లి మండలం లో 100 మంది దళిత బంధు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను, చెక్కులను, దివ్యాంగులకు ,బ్యాటరీ ట్రై సైకిల్, వాహనాల పంపిణీ   కార్యక్రమంలో  మంత్రి జిల్లా కలెక్టర్ తో కలిసి పాల్గొన్నారు.


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ  దళితులు ఆర్థికంగా ఎదగాలనే ఉద్దేశంతో  సీఎం కేసీఆర్ దళిత బంధు పథకాన్ని రూపొందించారని మంత్రి అన్నారు. 
రాష్ట్రంలోని నిపుణులతో అనేకసార్లు చర్చలు జరిపి , ప్రభుత్వం అందించే సహాయం జీవితాలలో మార్పు తీసుకురావడానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో 100%  సబ్సిడీతో ప్రతి దళిత కుటుంబానికి రూ.10 లక్షల అందించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని మంత్రి తెలిపారు.  గతంలో ఎస్సీ కార్పొరేషన్ రుణాలలో 60% ఉందని, బ్యాంకు లింకేజీ రుణాలు లభించక చాలా యూనిట్ గ్రౌండ్  కాలేదని మంత్రి గుర్తుచేశారు. ఈ పథకం కింద  ఎలాంటి బ్యాంకు లింకేజీ, ఎలాంటి ఆంక్షలు దళితులపై లేవని మంత్రి తెలిపారు.


రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పైలెట్ ప్రాజెక్టు కింద 100 లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందని మంత్రి పేర్కొన్నారు. దళిత బంధు పథకం
విజయం సాధించడం లబ్ధిదారుల చేతుల్లో ఉందని, సీఎం కేసీఆర్ మనపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలని మంత్రి కోరారు.  దళిత బంధు లబ్ధిదారులుగా ఎంపిక చేసుకున్న యూనిట్లలో కష్టపడి పనిచేసే వ్యాపారాన్ని వృద్ధి లోకి తీసుకొని రావాలని, నిధులను సమర్థవంతంగా మార్కెట్ డిమాండ్ ప్రకారం వినియోగించుకోవాలని మంత్రి సూచించారు.  దళిత బంధు పథకం విజయవంతం అయ్యే విధంగా లబ్ధిదారులు సైతం ప్రభుత్వానికి సహకరించాలని , దళిత బంధు పథకం ద్వారా రాష్ట్ర ఆర్థిక స్తోమత, ఆదాయం పెరుగుతుందని మంత్రి  తెలిపారు.
దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పకడ్బందీ చర్యలు చేపట్టిందని, దేశంలో ఎక్కడా లేని విధంగా 3 వేల రూపాయల పెన్షన్ అందజేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు.


  కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జి.రవి మాట్లాడుతూ  జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో  యూనిట్ల సబ్సిడీ, చెక్కులు,  వివాహ ప్రోత్సాహక చెక్కులు, ధర్మపురి  దళిత బందు లబ్ధిదారుల, మంజూరు పత్రాలు పంపిణీ చేస్తున్న మంత్రి గారికి కృతజ్ఞతలు తెలిపారు.  జగిత్యాల జిల్లాలో 346 లబ్ధిదారులకు ఎంపిక చేసి, నూతన బ్యాంకు ఖాతాలు ప్రారంభించామని, ప్రభుత్వం జిల్లాకు విడుదల చేసిన రూ.28 కోట్ల నిధులను లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.  జిల్లాలో వాహనాలు ట్రాక్టర్ కొనుగోలుకు సంబంధించి యూనిట్లు ఎంపిక చేసుకున్న లబ్ధిదారుల ఖాతాలలో పూర్తిస్థాయిలో నిధులు జమ చేసి, వాహనాల కొనుగోలుకు ఆర్డర్ చేశామని కలెక్టర్ తెలిపారు.  దళిత బంధు యూనిట్ల ద్వారా ఆర్థికంగా స్థిరపడి దిశగా కృషి చేయాలని , మరోమారు పేదరికంలోకి వెళ్లకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.


కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ దావ వసంత మాట్లాడుతూ ప్రపంచంలో బడుగు బలహీనవర్గాల  కోసం ఎక్కడా లేని విధంగా ఆలోచించి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం రూపొందించారని అన్నారు.
కార్యక్రమంలో పాల్గొన్న శాసనమండలి సభ్యులు ఎల్.రమణ మాట్లాడుతూ నూతన రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా పనిచేస్తున్నారని అన్నారు.
ఈ. డి. ఎస్సీ కార్పొరేషన్ అధికారి లక్ష్మీ నారాయణ, జిల్లా సంక్షేమ శాఖ అధికారి నరేష్ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు