తెలంగాణలో కుటుంబ పాలన ప్రధాని నరేంద్ర మోడీ!

హైదరాబాద్‌లో ప్రధాని మోదీ పర్యటన షురూ అయింది. బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న మోదీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, భాజపా ఓసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, నాయకులు మురళీధర్ రావు, ఇంద్రసేనారెడ్డి, జితేందర్ రెడ్డి, విజయశాంతి, ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటెల రాజేందర్, విజయశాంతి, బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, డాక్టర్ వివేక్ వెంకటస్వామి, ఇతర నాయకులు ఘన స్వాగతం పలికారు.

ప్రభుత్వం తరఫున సీఎస్ సోమేశ్ కుమార్‌ మోదీని ఆహ్వానించారు.
ఈ సందర్భంగా బేగంపేట లో ఏర్పాటు చేసిన స్వాగత సభ లో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడుతూ ,


భారత దేశ ఐక్యత కోసం సర్దార్‌ పటేల్‌ ఎంతో కృషి చేశారు. టెక్నాలజీ హబ్‌గా తెలంగాణ ఎదుగుతోంది. తెలంగాణ ఉద్యమంలో వేల మంది అమరులయ్యారు. ఒక ఆశయం కోసం వేల మంది ప్రాణత్యాగాలు చేశారు. అమరుల ఆశయాలు తెలంగాణలో నెరవేరటం లేదు. ఒక కుటుంబ పాలనలో తెలంగాణ బందీ అయ్యింది. నిరంకుశ తెలంగాణలో ఎవరి ఆశయాలు నెరవేరటం లేదు. తెలంగాణను ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలనేది మా ఆకాంక్ష. అని ప్రధాని నరేంద్ర మోడీ  అన్నారు-   జగిత్యాల, సత్యనారాయణ రావు, సిరిసిల్ల , ప్రతాప రామకృష్ణ, తదితర జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రధానికి స్వాగతం పలికారు.


బెంగళూరులో సీఎం కేసీఆర్ !

  ముఖ్యమంత్రి కేసీఆర్… బెంగళూరుకు చేరుకున్నారు. కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి, జేడీఎస్ నేతలు కేసీఆర్​కు ఘన స్వాగతం పలికారు. అనంతరం పద్మనాభనగర్​లోని  మాజీ ప్రధాని దేవెగౌడ, నివాసంలో భేటీ అయ్యారు. ఆయనతో పాటు కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామితో కూడా భేటీలో పాల్గొన్నారు

. దేశంలో ప్రస్తుతం నెలకొన్న పరిణామాలు, జాతీయ రాజకీయాలు, రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం, అనురిస్తున్న విధానం సహా తాజా పరిణామాలు, భవిష్యత్ కార్యాచరణపై దేవెగౌడ, కుమారస్వామితో  చర్చించారు.. దేశంలో ప్రబల మార్పు రావాల్సిన అవసరం ఉందంటున్న కేసీఆర్.  అందుకు సంబంధించిన అంశాలపై వారితో చర్చలు జరిపినట్టు సమాచారం. ఎంపీ సంతోష్ కుమార్ ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి టిఆర్ఎస్ నాయకులు, సీఎం ఎం కేసీఆర్ వెంట పాల్గొన్నారు.