అకాల వర్షంతో అపార నష్టం కు గురికాబడిన రైతాంగాన్ని తడిసిన వారి వరి ధాన్యం ప్రభుత్వం ఎలాంటి ఆంక్షలు విధించకుండా యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు రైతాంగాన్ని ఆదుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు .

ఐకెపి కేంద్రాల్లో మార్కెట్ యార్డ్ లో వారి కళ్లలో తడిసిన ధాన్యాన్ని జీవన్ రెడ్డి ఇ పరిశీలిస్తూ కన్నీరుమున్నీరుగా రోదిస్తున్న రైతాంగాన్ని ఓదార్చారు. ఈ సందర్భంగా తడిసిన ధాన్యం ప్రాంతం నుంచి రైతులు సమక్షంలోనే,ప్రభుత్వ యంత్రాంగానికి ఫోన్ చేసి యుద్ధ ప్రాతిపదికన తడిసిన వరి ధాన్యం ప్రభుత్వం కొనుగోలు చేయాలని రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని ఆయన అధికార యంత్రాంగంకు విజ్ఞప్తి చేశారు.
గొల్లపల్లి లో..

గొల్లపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ లో అకాల వర్షం వల్ల తడిసిన వరి ధాన్యాన్ని బుధవారం జగిత్యాల జిల్లా అధ్యక్షులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ .పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దాదాపు 15 రోజుల గడిచిన వరి ధాన్యం కొనుగోలు చేయకపోవడంతో అకాల వర్షం వల్ల వ్యవసాయ మార్కెట్ లో వరి ధాన్యం తడిసిపోయిందని అన్నారు.. ఆరుగాలం కష్టంచేసి పండించిన పంట మార్కెట్ యార్డుకు తెచ్చి పోసిన తర్వాత తడిసిపోవడంతో అన్నదాతలు, తీవ్ర మనోవేదనకు గురవుతున్నారని ఆరోపించారు.

ఏ ఒక్క అధికారి మార్కెట్ యార్డుకు రాలేదని అన్నారు. జగిత్యాల జిల్లాలో అకాల వర్షం వల్ల తడిసిన వరి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా వెంటనే కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కొనుగోలు చేయని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని ఆయన హెచ్చరించారు. లక్ష్మణ్ కుమార్ వెంట గొల్లపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముస్కు విశాంత్ రెడ్డి, .సర్పంచ్ లు రెేవలె సత్యనారాయణ, చిర్ర గ౦గదార్, తిరుపతి రెడ్డి , వెంకటేష్, ఎంపీటీసీ సభ్యులు లక్ష్మణ్ ,నాయకులు అరవింద్, శ్రీనివాస్, వెంకటేశ్, రాము రెడ్డి రెైతులు తదితరులు పాల్గొన్నారు
.ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలి ! కలెక్టర్

జిల్లాలో ధాన్యం కొనుగోలులో వేగం పెంచాలని అధికారులను ఆదేశించారు.నిన్న రాత్రి కురిసిన అకాల వర్షాలతో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ జి.రవి అధికారులతో టేలి కాన్ఫరెన్స్ ద్వారా సమావేశం నిర్వహించి రైతులకు భరోసా కల్పించాలని తెలియచేశారు.
ఇప్పటి వరకు జిల్లాలో 1546 మెట్రిక్ టన్నుల ధాన్యం 127 మంది రైతుల నుండి కొనుగోలు చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో 366 ధాన్యం కొనుగోలు కేంద్రాలను అంచనా వేసి ఇప్పటి వరకు 187 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించామని, అకాల వర్షాల వల్ల ధాన్యం లో తేమ శాతం అధికంగా ఉందని, దీనివల్ల కొంతమేర కొనుగోలు ఆలస్యమవుతుందని, చివరి గింజ వరకు నాణ్యమైన ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ స్పష్టం చేశారు.
రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుని, కొనుగోలు కేంద్రాలకు తీసుకొని రావాలని , ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని, ప్రభుత్వ ఆదేశాల మేరకు పంటను పూర్తిస్థాయిలో కొనుగోలు చేస్తామని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ ఆదేశాల మేరకు వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా, నాణ్యత ,ప్రమాణాలను, ధృవీకరించిన తరువాతే దాన్యాన్ని కోనుగోలు చేయడం జరుగుతుందని, రైస్ మిల్లు లో ఎలాంటి అవకతవకలు జరగకుండా సిబ్బందిని నియమించి ఎప్పటికప్పుడు తగు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.
టేలీ కాన్ఫరెన్స్ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్రీమతి బి.ఎస్.లత, డి.ఏ.ఓ.,డి.ఎం. సివిల్ సప్ప్లై, డి.ఆర్.డి.ఓ., తహసీల్దార్లు వ్యవసాయ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.