‘తరుగు’ వడ్ల తోనే తిప్పలు … అధికారులకా? మిల్లర్ లకా?

J. Surender Kumar .

అధికారులు రైస్ మిల్లు లో ధాన్యం నిల్వల పై తనిఖీలు నిర్వహిస్తున్న తరుణంలో ‘తరుగు వడ్ల’ అంశం వెలుగు చూసినట్లు సమాచారం. ఈ వడ్ల ను  ఏ రైతు అమ్మకాలు జరిపారు ?  ఏ రైతు పేరు  రికార్డులో నమోదైంది ?  ఎవరి బ్యాంక్ ఖాతాలో డబ్బులు చెల్లించారు ?   అనే అంశంలో రైస్ మిల్లర్ల కో ?  అధికారులకో ?  తిప్పలు తప్పేలా లేనట్టు సమాచారం. అడ్డగోలుగా రైతాంగం నుండి  తరుగు పేరిట వడ్లను నిర్బంధంగా సేకరించిన వారు, వాటి లెక్కల అడ్జస్ట్మెంట్ కోసం అవస్థలు  పడుతున్నట్టు తెలిసింది. అధికారుల తనిఖీలలో  వెలుగుచూసిన అంశంల పై  జగిత్యాల జిల్లా పౌరసరఫరాల అధికారులు,మౌనం వహిస్తు, మా వద్ద ఎలాంటి రికార్డులు లేవు, ఎఫ్సిఐ అధికారులు మాకు ఎలాంటి నివేదికలు ఇవ్వలేదు వారిని సంప్రదించండి అంటున్నారు.


వివరాల్లోకి వెళితే ..


‘ రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లులో నిలువ ఉన్న ధాన్యం ఎంత ?  CMR ( కష్టం మిల్లింగ్ రైస్ ) బియ్యం  ప్రభుత్వానికి  మిల్లర్లు అప్పగించింది ఎంత ?  వారు చెల్లించాల్సిన బియ్యం టార్గెట్ ఎంత ?  ఆ మిల్లులో ధాన్యం నిల్వలు ఎంత ? వివరాల సేకరణ కి రాష్ట్ర వ్యాప్తంగా ఎఫ్ సి ఐ , వేర్ హౌస్ గోడౌన్ , పౌరసరఫరాల శాఖ అధికారులు కలసి 60 బృందాలుగా ఏర్పడి గత నెల రోజులనుంచి  రాష్ట్ర వ్యాప్తంగా రైస్ మిల్లు లో తనిఖీలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గత పది రోజుల క్రితం జగిత్యాల జిల్లాలో రైస్ మిల్లు లో తనిఖీ అధికారుల బృందం  గుట్టుచప్పుడు , తూతూమంత్రంగా తనిఖీలు నిర్వహించినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
CMR  కేటాయించిన రైస్ మిల్లు లో ధాన్యం నిల్వల లో పెద్ద మొత్తంలో వ్యత్యాసం వెలుగు చూసినట్లు తెలిసింది. చెల్లించాల్సిన బియ్యం లక్ష్యాన్ని పూర్తి చేయకుండానే. ఆయా రైస్ మిల్లు ధాన్యం సేకరిస్తున్న విషయం వెలుగు చూసినట్టు సమాచారం.. ఎఫ్సిఐ అధికారులు ‘ క్లియరెన్స్ షీట్ ‘ ఆయా మిల్లులకు జారీ చేసిన తరువాత వారు ధాన్యం కొనుగోలు చేయాలి అనే నిబంధన ఉన్నట్టు సమాచారం.


తరుగు వడ్లు ఎక్కడివి ?


గ్రామాల్లో ఐకెపి, సహకార సంఘాలు, డి సి ఎమ్ ఎస్ ల కొనుగోలు కేంద్రాల ద్వారా రైతాంగం తాము పండించిన ధాన్యాన్ని  ప్రభుత్వం ప్రకటించిన గిట్టుబాటు ధర కు విక్రయాలు జరుపుతారు. తాలు, తప్ప, పచ్చి గా, ఉందని నాణ్యత లేదంటూ, రైతుల ధాన్యం తూకం వేసే సమయంలో అమాయక . రైతుల ధాన్యములో క్వింటాలుకు,  దాదాపు. 5 నుంచి  7 కిలోల వడ్లను అధికంగా తూకం వేస్తారు. లారీల ద్వారా ఆయా రైస్ మిల్లులకు ఈ ధాన్యాన్ని పంపిస్తారు.  కొందరు రైస్ మిల్లర్లు, ధాన్యం అన్లోడ్ చేసుకోకుండా, తమ వద్ద స్టాకు అధికంగా ఉందని, మీరు పంపిన ధాన్యంలో నాణ్యత, ప్రమాణాలు లేవంటూ. రెండు మూడు రోజులుగా లారీల నుంచి ధాన్యం  దించు కోరు.  క్వింటాలుకు మరో 5 కిలోలు తగ్గించి కొనుగోలు చేస్తామంటూ పేచీ పెడతారు.  విధిలేని పరిస్థితుల్లో రైతులు  రోజుల తరబడి పడిగాపులు, పడలేక.  వారి డిమాండ్లను ఒప్పుకొని  ధాన్యం విక్రయాలు కొనసాగిస్తారు.  ఈ లెక్కన దాదాపు క్వింటాలుకు 15 కిలోల వడ్లను, రైతు నష్టపోతున్నాడు దీనినే తరుగు వడ్లుఅంటారు. ఈ అంశంపై పలువురు ప్రతిపక్షా నాయకులు, రైతు సంఘాల నాయకులు, పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, రైతుల పక్షాన, ప్రభుత్వానికి అనేకసార్లు ఫిర్యాదు చేసిన ఉదంతాలు ఉన్నాయి.


రైతుకు చెల్లింపులు ఇలా !


ధాన్యం విక్రయించడానికి వచ్చిన రైతు పట్టాదారు పాస్ పుస్తకం, (జిరాక్స్), సర్వే నెంబర్, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నంబర్ వివరాలు,. అతను కొనుగోలు కేంద్రంలో విక్రయిస్తున్న ధాన్యం నిలువల మొత్తం.  కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు రికార్డులలో నమోదు చేస్తారు.  ఈ వివరాలతో కూడిన రసీదు రైతుకు వెంటనే ఇవ్వాల్సి ఉంటుంది. కానీ రైతులకు ఇచ్చిన సందర్భాలు తక్కువ.
మహిళా సంఘాలకు (ఐకెపి), సహకార సంఘాలకు  దాన్యం కొనుగోలు చేసినందుకు ప్రభుత్వం కమిషన్ చెల్లిస్తుంది.  డి సి ఎం ఎస్ సంస్థ నేరుగా కొనుగోలు చేసే అవకాశం లేనట్లు సమాచారం. ఈ సంస్థ పేరిట, ప్రైవేట్ వ్యక్తులు గాని, ఓ వ్యవస్థ గాని , కొన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసుకొని ఖర్చు వారే భరించి ప్రభుత్వం చెల్లించిన కమిషన్ డబ్బుల లో 50 శాతం. కమిషన్ వాటా డిసిఎంఎస్ సంస్థకు చెల్లించాల్సి ఉంటుంది. అని సమాచారం.  ప్రభుత్వం క్వింటాలు  ఒక్కంటికి  ₹ 32/- రూపాయలు కమిషన్ రూపేనా చెల్లించాల్సి ఉండగా, ₹ 27/- రూపాయలు కొనుగోలు కేంద్రాలకు కమిషన్ ఇస్తున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఉనికి కోసమే తనిఖీలా.?

ఈ నెల 3 నుంచి దాదాపు 140 కిపైగా రైస్ మిల్లు లో ఐదు బృందాలు  తనిఖీలు గుట్టుచప్పుడు కాకుండా, ఉనికి కోసమే చేపట్టినట్టు చర్చ నెలకొంది. 62  రైసు మిల్లుల వాళ్లు 3,,25,444/- మెట్రిక్ టన్నుల కష్టం మిల్లింగ్ రైస్ అందించాల్సి ఉంది  ఈ టార్గెట్ 2021-22 వానకాలం కు  సంబంధించింది. ఈ టార్గెట్లో 1,52,627 మెట్రిక్ టన్నుల  బియ్యం ప్రభుత్వానికి  అప్పగించాల్సి ఉంది.  ఎఫ్సీఐ నిబంధనల మేరకు ఆయా మిల్లులకు  క్లియరెన్స్ సీట్ జారీ చేసిన తరువాత మరో సీజన్ ధాన్యం కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ధాన్యం బస్తాలు, బియ్యం బస్తాలు ,లెక్కించే దుస్థితి ఆయా రైస్ మిల్లు లేదని.  తనిఖీ బృందాలు నివేదికలు పంపినట్టు సమాచారం. ఎఫ్సీఐ నిబంధనల మేరకు ఆయా రైస్ మిల్ లో  ధాన్యం బస్తాలు గాని, బియ్యం బస్తాలు కానీ,అధికారుల తనిఖీ అనుకూలంగా నెట్ వేయాల్సి ఉంటుంది, కానీ ఆ నిబంధనలు పాటించని మిల్లర్ లపై  చర్యలు సిఫారస్ చేసారో లేదో తెలియాల్సి ఉంది.


ధాన్యం, బియ్యం అమ్ముకుంటున్నారా ?


ప్రభుత్వానికి అందించాల్సిన  CMR. పై వత్తిడి లేకపోవడం దానికి తోడు ధాన్యం నిల్వలు పేరుకుపోవడంతో. కొందరు మిల్లర్లు ధాన్యాన్ని మార్కెట్లో  విక్రయించి డబ్బుతో ఇతర వ్యాపారాలలో అడుగు పెట్టినట్లు సమాచారం.  దళారులతో రేషన్ బియ్యం కొనుగోలు చేసి CMR బియ్యంగా  నిల్వలు చూపుతున్నట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే గత రెండు రోజుల క్రితం కథలాపూర్ మండలం లో రైస్ మిల్లు లో 150 క్వింటాళ్ల రేషన్ బియ్యం పోలీసులు పట్టుకున్న విషయం విధితమే. రష్యా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో మిల్లులో తవుడు,నూనె కోసం, ఉనుక ,పవర్ ఉత్పత్తి కోసం, నూకలు, బీర్ లాంటి పదార్థాలు ఉత్పత్తి కై. డిమాండ్ పెరగడంతో మిల్లర్లు వాటి ధరలు కూడా గణనీయంగా పెంచినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో అవకతవకలు వెలుగుచూసిన మిల్లర్ లపై చర్యలకు  అధికార యంత్రాంగం జంకుతున్నట్లు సమాచారం. సీఎంఆర్ అంశంలో, విద్యుత్ వినియోగం, తరుగు ధాన్యం,  డబ్బులు, బినామీ రైతుల ఖాతాల్లో జమ చేయడం తో పాటు.. ధాన్యం విక్రయించే సందర్భంలో రైతులు ఆధార్ ,పాస్ బుక్కు,బ్యాంకు ఖాతాలు, అందుబాటులో లేనందున కొనుగోలు కేంద్రం నిర్వాహకుల ఖాతాలో అట్టి డబ్బులు జమ చేశామని. అధికారులు రికార్డులలో స్పష్టం గా నమోదు చేసినట్టు తెలిసింది. రైతులకు  గన్ని బ్యాగుల పంపిణీ సందర్భంలో రైతు,పేరు గ్రామము, ఆధార్ నెంబరు, సంతకం విధిగా తీసుకోవాల్సి. ఉంది. రికార్డులు పరిశీలిస్తే. వాస్తవాలు వెలుగు చూసే అవకాశాలు ఉన్నవి.


కొనుగోలుపై విచారణ జరిగితే…


జిల్లాలోనీ ఓ కొనుగోలు కేంద్రం నుంచి గత వర్షాకాలం దాదాపు 500 మంది రైతుల నుంచి 58 వేల బస్తాల ధాన్యం కొనుగోలు చేసినట్లు, ఈ ధాన్యం విలువ దాదాపు 23 వేల క్వింటాళ్లకు పైగా ఉంటుంది. రైతులకు ₹ 4 కోట్ల 28 లక్షలకుపైగా చెల్లింపులు జరిగినట్టు రికార్డులో నమోదైంది. ఇట్టి ధాన్యాన్ని వెల్గటూర్,ధర్మపురి , జగిత్యాల, గొల్లపల్లి, రైస్ మిల్లర్ లతోపాటు  200 కిలోమీటర్ల దూరంలో ఉన్న  సిద్దిపేట ఓ మిల్లుకు ధాన్యం తరలించినట్టు రికార్డ్ లో స్పష్టంగా నమోదై ఉంది.  రైస్ మిల్లు లో.విద్యుత్ వినియోగం, రైతుల ఖాతాల్లో జమ అయిన నగదు మొత్తం, రైతుల భూమి వివరాలు, పాస్ బుక్, ఆధార్ కార్డు,  దాన్యం డబ్బులు జమ కాబడిన వారి వృత్తి వివరాలపై విచారణ జరిగితే.  రైతులను మోసం చేసిందెవరు ? అనే అంశం వెలుగు చూడడంతో పాటు. ఎన్ని వేల కింటాలు వడ్లు తరుగు పేరిట రైతుల నుంచి. నిర్బంధంగా దోచుకొని లక్షలాది రూపాయల సొమ్ము స్వాహా చేసిన వారి వివరాలు తేటతెల్లం అయ్యే అవకాశాలు ఉన్నాయనే చర్చ ప్రజల్లో నెలకొంది.