అంగరంగ వైభవంగా నరసింహ జయంతి ఉత్సవం!


ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం స్వామివారి జయంతి ఉత్సవాలు, జరిగాయి..

అంగరంగ వైభవంగా స్వామివారి తొమ్మిది రోజులు పాటు జరిగిన నవరాత్రి ఉత్సవాలు,పూజాది కార్యక్రమాల ముగిశాయి . ఈనెల 7 నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం చందనోత్సవం, శుక్రవారం స్వామివారి వసంతోత్సవం, పల్లవ ఉత్సవాలు, నేడు జయంతి ఉత్సవం జరిగాయి.

నేడు స్వామివారి జన్మ నక్షత్రమైన స్వాతి కలిసి రావడంతో ఆలయ ప్రాంగణంలో భక్తజనం రద్దీపెరిగింది. నేటితో స్వామివారి . నవరాత్రి ఉత్సవాలు ముసాయి. వేదపండితులు, అర్చకులు, సనాతన సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పూజలు నిర్వహించారు.

ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాస్ , రమణయ్య, అర్చకులు నరసింహ మూర్తి , వంశి , ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇందారపు రామయ్య, కమిటీ సభ్యుల బృందం, వేలాది మంది భక్తజనం కార్యక్రమంలో పాల్గొన్నారు.