చెన్నూర్ మండలం, అక్కెపల్లి గ్రామంలో గల, నర్సింహుల బండలో, ఆదివారం గాయత్రీ యజ్ఞం వైభవోపేతంగా నిర్వహించారు.
పంచ క్రోశ ఉత్తర వాహినీ, గోదావరీ తీరమైన చెన్నూరు అగ్రహారానికి ఆరు కిలో మీటర్ల దూరాన ఉన్న స్వయంభు శ్రీ లక్ష్మీ నర్సింహ స్వామి దివ్య క్షేత్రమైన “నర్సింహుల బండ”లో గాయత్రీ యజ్ఞంతో పాటు , గాయత్రీ జపం, హోమం, అన్నదానం నిర్వహించారు.

లోక కళ్యాణం కోసం 15న ఆదివారం బ్రహ్మశ్రీ పులి సీతారామ్ శర్మ, గారి వైదిక నిర్వహణలో ఉదయం 6.48 నుంచి గాయత్రీ జపం, గాయత్రీ తర్పణం, గాయత్రీ హోమం 11.00 గం.ల వరకు చేశారు. ఈ క్రతువులో హైదరాబాద్, వరంగల్, మంథని, కరీంనగర్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, మంచిర్యాల, చెన్నూర్ తో పాటు పలు పట్టణాల నుంచి జప, హోమ, అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఉపనయనం అయిన బ్రాహ్మణుల సహాయంతో జరిగిన ఈ యజ్ఞం లో ఈ సంవత్సరం ,వడుగయిన, బ్రాహ్మణ వటువులు చాలా మంది పాల్గొన్నారు.

11.00 గం. లకు పూర్ణాహుతి, అనంతరం యజ్ఞ ప్రసాదంగా భోజన కార్యక్రమం నిర్వహించారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భక్తుల సౌకర్యార్థం చెన్నూరు శివాలయం నుంచి గాయత్రీ యజ్ఞానికి ఉచిత రవాణా సౌకర్యం కల్పించారు.
యజ్ఞ సమన్వయ కర్త, మహావాది వినోద్ కుమార్ మాట్లాడుతూ గాయత్రిని మించిన మంత్రం లేదని, తల్లిని మించిన దైవం లేదని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరిపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరినట్లు చెప్పారు. .మహిళలు అమ్మకు ఇష్టమైన పసుపు రంగు దుస్తులు ధరించి
గాయత్రీ యజ్ఞంలో పాల్గొన్నారు. ఉపనయన సంస్కారం అయిన బ్రాహ్మణులు సంప్రదాయ దుస్తులు ధరించి, ఎవరి సంధ్య పాత్రలు, జప మాల, ఆసనం వారే వెంట తెచ్చుకొని గాయత్రీ జపం చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ పెద్దింటి స్వరుప రాజన్న, గ్రామస్తులు పాల్గొన్నారు.
