ప్రముఖ పుణ్యక్షేత్రం ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం స్వామివారికి అంగరంగ వైభవంగా వసంతోత్సవం, పల్లవ ఉత్సవం జరిగింది. ఈనెల ఏడు నుంచి ఆరంభమైన ఉత్సవాల్లో, బుధవారం సహస్ర కలశాభిషేకం, గురువారం చందనోత్సవం, నేడు స్వామివారి వసంతోత్సవం, పల్లవ ఉత్సవాలు జరిగాయి. వేదపండితులు, అర్చకులు, సనాతన సాంప్రదాయ పద్ధతిలో స్వామివారికి పూజలు నిర్వహించారు.

ఈరోజు స్వామివారికి , లక్ష్మీ అమ్మవారి కి వివిధ రకాల పండ్ల రసాలతో అభిషేకాలు, అన్న కూట ఉత్సవం, నిర్వహించారు. స్వామివారికి పులిహార, దద్దోజనం, పూరీలు, బజ్జీలు, తీపి పదార్థాలు, వివిధ రకాల పిండివంటలతో స్వామివారికి నైవేద్యం సమర్పిస్తారు

. ఈ ప్రసాదాల తయారీ కోసం దాత, ప్రముఖ గుండె వైద్య నిపుణులు డాక్టర్ కస్తూరి శ్రీధర్, ₹ 25,000/- ఆలయానికి అందించారు. సాయంత్రం స్వామి వారి ఉత్సవమూర్తులను మంటపంలో. ఉంచి వివిధ రకాలైన పచ్చని చెట్లు కోమ్మలు , పళ్ళు సహజసిద్ధమైన, ప్రకృతి వాతావరణం లా వేదిక నలంకరించిన అందులో స్వామి వారి ఉత్సవ విగ్రహాలను కూర్చుండబెట్టి, ప్రత్యేక పూజలు చేస్తారు

ఈ సుందర దృశ్యం తిలకించడానికి భక్తజనం పడిగాపులు కాస్తారు.
స్వామివారి ప్రసాద వితరణ కోసం భక్తజనం భారీగా తరలివచ్చి గంటల తరబడి క్యూ లైన్ లో నిలబడి ప్రసాదాలు స్వీకరించారు. ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఐ. రామయ్య, అతడి బృందం, కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్, ఆలయ సిబ్బంది తదితరులు పర్యవేక్షణలో కార్యక్రమం జరిగింది.

అన్నదానం కు ₹ లక్ష విరాళం!
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో జరుగు నిత్యం అన్నదానం నకు నిజామాబాద్ జిల్లా మగ్గిడి గ్రామానికి చెందిన శ్రీ మగిడి చంద్రవదన్ గురువారం, ₹ 1,01,116/- విరాళంగా ఇచ్చారు.. వీరికి దేవస్థానం పక్షాన శ్రీస్వామి వారి శేషవస్త్ర ప్రసాదం ఇచ్చి సత్కరించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాస్ , రమణయ్య, అర్చకులు నరసింహ మూర్తి , వంశి , రెనవేషన్ కమిటి సభ్యులు వేముల నరేష్ , సీనియర్ అసిస్టెంట్ అలువాల శ్రీనివాస్ , తదితరులు పాల్గొన్నారు.