ఎలక్టోరల్ అధికారి వికాస్ రాజ్
జగిత్యాల, మే, 17:-పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని చీఫ్ ఎలెక్టోరల్ అధికారి వికాస్ రాజ్ అన్నారు.
మంగళవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లా ఎన్నికల అధికారి అన్ని జిల్లా కలెక్టర్లతో గూగుల్ మీట్ నిర్వహించి పెండింగ్ లో ఉన్న ఓటరు నమోదు దరఖాస్తులు, ఓటర్ జాబితాలో డబుల్ ఫోటోల ప్రచురణ, తదితర అంశాలపై సమీక్షించారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ 30 రోజుల పైబడి పెండింగ్ లో ఉన్న ఓటర్ నమోదు, మార్పులు, చేర్పుల దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని అన్నారు. ఓటర్ జాబితాలో ఒకే ఓటర్ ఫోటోలు, వివరాలు రెండుమార్లు ప్రచురించిన వాటిని పరిశీలించి వెంటనే తొలగించాలని అన్నారు.
అదనపు సీఈఓ బుద్ధప్రకాష్ యం జ్యోతి మాట్లాడుతూ ఈవీఎం గోదాం ల పరిశీలన నివేదికను నిర్ణీత సమయంలోగా సీఈఓ కార్యాలయానికి సమర్పించాలని, సీసీ టీవీల పనితీరు, అగ్నిమాపక ప్రమాదాలు, తదితర వివరాలను సకాలంలో పంపించాలని అన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా కలెక్టర్ జి.రవి కలెక్టరేట్ ఎలక్షన్ సెల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

కరీంనగర్ లో…
కరీంనగర్ పట్టణ అభివృద్ధి పనులు పూర్తి చేయండి!
. అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్

.
జిల్లాలోని మున్సిపాలిటీలలో చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ది పనులను త్వరితగతిన పూర్తిచేయాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు.
మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో కరీంనగర్, కొత్తపల్లి, చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపల్ కమీషనర్లతో ఆయా మున్సిపాలిటీలలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై ఆమె సమీక్షించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపాల్టీల పరిధిలోని ప్రతి ఇంటింటికి మిషన్ భగీరథ మంచినీటి సరఫరాలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, వార్డు వారిగా చేపడుతున్న పైప్ లైన్ మరమ్మత్తు పనులను సకాలంలో పూర్తయ్యేలా చూడాలని అన్నారు. మంచినీటి సరఫరాలో ఎక్కడకూడా సమస్యలు తలెత్తకండా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. రాబోయో వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని వార్డుల వారిగా టైంటేబుల్ ఏర్పాటు చేసుకొని ఎక్కడకూడా సానిటేషన్, డ్రైనేజీ , లేబర్ సమస్యలు తలెత్తకుండా ఇప్పటి నుండే పర్యవేక్షణ చేస్తేనే రానున్న వర్షాకాలంలో సమస్యలు తలెత్తకుండా చేయగలుగుతామని అన్నారు. మురుగు కాలువల మరమ్మతులను వెంటనే ప్రారంభించాలని, ఓపెన్ వెల్ లను మూసివేయించాలని, తడి, పొడి చెత్తసేకరణ కొరకు ఇంటింటికి సరఫరా చేసిన చెత్తడబ్బాలను వాడుతున్నారా లేదా అని పర్యవేక్షించాలని సూచించారు. పట్టణాలలో చెత్తను సేకరించాల్సిన ప్రదేశాలను గుర్తించాలని, ప్రతిరోజు ఇంటింటి చెత్తసేకరణ సక్రమంగా జరిగేలా చూడాలని, చెత్తసేకరణ, ఇతరపనుల కొరకు అన్ని మున్సిపాలిటీలలో జేసిబి మొదలగు వాహనాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని పేర్కోన్నారు. రానున్న వానాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని కూలీ పోవడానికి సిద్దంగా ఉన్న ఇళ్లు, ఇతర కట్టడాలను కూల్చివే యాలని ఇంటి యజమానులకు తెలియజేయాలని సూచించారు.

నీరు నిలిచే బహిరంగ ప్రదేశాలను గుర్తించి దోమలు తయారు కాకుండా ఆయిల్ బాల్ మొదలగునవి సిద్దం చేసుకోవాలని సూచించారు. ప్రతి ఇంటింటికి వెళ్లి మొక్కలను అందించాలని, వార్డు వారిగా సభలను ఏర్పాటు చేసి లక్ష్యం మేర మొక్కలను 100% నాటాలని, హరితహారం కార్యక్రమంలో బాగంగా నాటిన ప్రతి మొక్క సంరక్షించబడేలా వార్డువారిగా ఒక ప్రత్యేకా అధికారిని నియమించాలని సూచించారు. వేసవికాలం సెలవులో ప్రతి పాఠశాల, కళాశాలలో పేరుకుపోయిన చెత్తను తొలగించాలని, పిచ్చిమొక్కలు పెరిగిపోయి చెత్తాచెదారం లేకుండా శుభ్రం చేయించాలని అన్నారు. మున్సిపాలిటీలలో ఏర్పాటు చేసిన టాయిలెట్ల నిర్వహణలో ఎటువంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 10 గంటల వరకు టాయిలెట్ లు తెరిచే ఉండేలా చూడాలని అన్నారు. క్లినింగ్ మరియు మరుగుదొడ్ల నిర్వహణ మొదలగు మున్సిపల్ పనులలో ట్రాన్స్ జెండర్లకు అవకాశం కల్పించాలని పేర్కోన్నారు. ఇంటిగ్రెటెడ్ వెజ్, నాన్ వెజ్ మార్కెట్లు మరియు వైకుంఠధామాల ఏర్పాటులో జాప్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని పనుల నిర్వహణలో సమస్యలు ఎదురైతే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు. అన్ని మున్సిపాలిటీలలో అప్డేటడ్ మాస్టర్ ప్లాన్ అందుబాటులో ఉండేలా చూసుకోవాలని అన్నారు.
ఈ సమావేశంలో కరీంనగర్ మున్సిపల్ కమీషనర్ సేవ ఇస్లావత్ , కొత్తపల్లి, చొప్పదండి, జమ్మికుంట, హుజరాబాద్ .మున్సిపల్ కమిషనర్ లు డిఈలు ,మరియు సంబంధిత అధికారులు పాల్గోన్నారు.
జగిత్యాల జిల్లా :
రాయికల్ మం. అల్లీపూర్‌లో విద్యుత్ షాక్‌తో బత్తుల లక్ష్మయ్య అనే రైతుతో పాటు ఆవు మృతి ..
పొలం వద్ద హైటెన్షన్ వైరు తెగిపడి ఉంది.. అక్కడే గడ్డి మేస్తూ ఆవు వైరును తాకటంతో షాక్‌తో కొట్టుకుంటున్న ఆవును రక్షించే ప్రయత్నం చేసిన రైతు అక్కడిక్కడే మృతి. చెందాడు.
