జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం యశ్వత్ రావుపేట గ్రామంలో ₹ 246.10 లక్షలతో పెద్ద చెరువు ప్రాజెక్టు పునరుద్ధరణ పనులకు శనివారం శంకుస్థాపన చేసి, జరుగుతున్న పూడికతీత పనులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు..
అనంతరం గ్రామం నుండి కాంగ్రెస్ బిజెపి పార్టీల నుండి యూత్ నాయకులు మంత్రి సమక్షంలో తెరాస పార్టీలో చేరారు.

ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ జల సమృద్ధి కోసం ఎన్నో పనులు చేపట్టారు. పాత చెరువులకు కొత్త కళను తెచ్చే మిషన్ కాకతీయ పథకాన్ని, చేపట్టిన సీఎం కేసీఆర్ ఇప్పుడు కొత్త చెరువులకూ ప్రాణప్రతిష్ఠ చేస్తున్నారు అని అన్నారు. బీళ్లకు నీళ్లు మళ్లించే కొత్త శకానికి నాంది పలికారు, నీటి సందడి ఎరుగని నేలలకు జలకళ తెచ్చేందుకు కృషి చేస్తుందన్నారు, అవసరమైన మేర నీటి లభ్యత ఉన్నచోట ప్రజలకు జలసిరి సమకూర్చేందుకు నడుం బిగించింది మన ముఖ్యమంత్రి

ఈ కార్యక్రమంలో జెడ్ పి టి సి బాదినేని రాజేందర్ గారు ఎంపీపీ బాదినేని రాజమణి గారు, రైతు బంధు సమితి మండలం అధ్యక్షులు తాండ్ర సత్యనారాయణ రావు, వైస్ ఎంపీపీ సుచింధర్ గారు, ఎం.పి.టి.సి లక్ష్మి బుచ్చన్న, పార్టీ అధ్యక్షులు మహేష్, సర్పంచ్ కోల రాజు, తదితరులు పాల్గొన్నారు

టౌన్ హాల్ ప్రారంభం!
పట్టణంలోని టౌన్ హాల్ లో శుభమస్తు కన్వెన్షన్ ను ప్రారంభించిన మంత్రి కొప్పుల ఈశ్వర్., ఎమ్మెల్యే సంజయ్ కుమార్, మున్సిపల్ చైర్ పర్సన్ ,డాక్టర్ భోగ శ్రావణి ప్రవీణ్, జడ్పీ చైర్పర్సన్ దావా వసంతసురేష్, గ్రంథాలయ చైర్మన్ డా చంద్రశేఖర్ గౌడ్, కౌన్సిలర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు

అర్బన్ పార్క్ !
జగిత్యాల అర్బన్ మండలం అంబారీపెట గ్రామంలో తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా 1కోటి రూపాయలు నిధులతో చేపట్టిన అర్బన్ పార్క్ ను జిల్లా అటవీ అధికారి వెంకటేశ్వర రావుతో కలిసి సందర్శించిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, సందర్శించారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగాధర్, ఎంపీటీసీ మల్లారెడ్డి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మండల రైతు బందు కన్వీనర్ రవీందర్ రెడ్డి, ఉప సర్పంచ్ నారాయణ,కౌన్సిలర్ లు కప్పల శ్రీకాంత్,బోడ్ల జగదీష్, మల్లేశం, గంగారెడ్డి,శంకర్, సాయి చరణ్,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంఘ భవనం !
జగిత్యాల అర్బన్ మండలం పెర్కపల్లే గ్రామం లో పెర్క సంఘ భవనం కు అదనపు పనుల కు భూమీ పూజ చేసి అనంతరం, కల్యాణ లక్ష్మి, లబ్ధి దారులకు మరియు సీఎం సహాయ నిధి ద్వారా మంజూరైన ₹ 140000/- విలువ గల చెక్కులను పంపిణి చేసిన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ అనంతరం మూడు లక్షల రూపాయల సి సి రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే, జడ్పీ చైర్పర్సన్, ఈ కార్యక్రమంలో ఎంపీపీ ములసాపు లక్ష్మి సర్పంచ్ రౌతు జయ, జిల్లా పెర్క సంఘ అధ్యక్షుడు రైతు బంధు నాయకులు బాల ముకుందం, అర్బన్ మండల రైతు బంధు అధ్యక్షుడు జుంబర్థి శంకర్, ఉప సర్పంచ్ బొడ్డు బుచన్న, గ్రామ శాఖ అధ్యక్షుడు గంగం మహేశ్ మాజీ సర్పంచ్ రౌతు గంగాధర్, వార్డు సభ్యులు రాజన్న, గంగా రెడ్డి, వజ్రవ్వ, నాయకులు శేకర్,చందు బోగు సత్తాయ, పెర్క సంఘ నాయకులు దేవయ్య మల్లన, గంగ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గోదాం పనుల పరిశీలన !
ధర్మపురి మండలం ధమ్మన్నపేట్, గ్రామంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రంను సందర్శించి, నిర్మాణం లో ఉన్న ఎరువుల గోధంను మంత్రి కొప్పుల ఈశ్వర్ పరిశీలించారు. ఈ సందర్భంగా జైన సింగిల్విండో చైర్మన్ సౌల్ల నరేష్ మంత్రి అభినందించారు. ఈ కార్యక్రమంలో . దమ్మన్నపేట సర్పంచ్ పులిశెట్టి మల్లేశం, జైన సహకార సంఘం అధ్యక్షులు సౌళ్ల నరేష్, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, దర్మపురి zptc సభ్యురాలు బత్తిని అరుణ ,ఎంపీపీ చిట్టిబాబు, వైస్ ఎంపీపీ మహిపాల్ రెడ్డి, ధర్మపురి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సౌళ్ల బీమాయ్య, మార్కెట్ కమిటీ అధ్యక్షుడు అయ్యోరి రాజేష్,.మార్కెట్ కమిటీ ఉప అధ్యక్షుడు అక్కినపెళ్లి సునీల్, సహకార సంఘం పాలకవర్గ సభ్యులు దండవేణి గంగమల్లయ్య, తాడుక తిరుపతి ధమ్మన్నపేట్ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు గొల్లపెళ్లి సత్తయ్య, రైతులు పాల్గొన్నారు.

ప్రతిష్ట కార్యక్రమం !
ధర్మపురి మండలం దొంతాపూర్ గ్రామంలో రజకుల ఇష్ట దైవం శ్రీ మడేలేశ్వర స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠపన కార్యక్రమానికి హాజరై స్వామి వారి ప్రత్యేక పూజలో పాల్గొన్న సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ . పాల్గొన్నారు