14 జోన్ ల తో జగిత్యాల మున్సిపాలిటీ- ఎమ్మెల్యే సంజయ్!

పట్టణములో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 43,13,30 వార్డులను  శనివారం సందర్శించి అనంతరం మీటింగ్ లో పాల్గొన్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్  ఈ సందర్భంగా ఎమ్మేల్యే మాట్లాడుతూ జగిత్యాల పట్టణం పురాతనమైన పట్టణమని గతంలో జగిత్యాల పట్టణంలో చాలా పెద్ద పెద్ద విశాలమైన రహదారులు ఉండేవని కానీ గడచిన కొద్ది నేడు రహదారులు చాలా ఇరుగ్గా మారాయని ఒక కారు వెళ్లే పరిస్థితి కూడా లేదని ఇది పట్టణ ప్రగతి కి అభివృద్ధికి నిరొదకంగా మారుతాయని అన్నారు.గత అధికారులు, పాలకులు కొంత అవగాహన కల్పించక పోవడం వల్ల పట్టణం అస్తవ్యస్తంగా తయారైంది అని అన్నారు.రోడ్డు పెద్దగా ఉండడం వల్ల డ్రైనేజీ,కరెంట్ పోల్,చెట్లు నాటడం వల్ల వార్డు సుందరంగా తీర్చిదిద్దవచ్చనీ అన్నారు.

నేడు తెలంగాణ రాష్ట్రంలో మాస్టర్ ప్లాన్ మార్పులు చేసిన మొదటి జిల్లా జగిత్యాల అని,దాదాపు వంద కు పైగా సర్వే నంబర్ లు14 జోన్ లను మార్పు చేయటం ద్వారా నేడు చట్ట బద్ధంగా అనుమతులు మంజూరు వస్తాయని,లేఅవుట్ ప్రకారం ఇండ్ల నిర్మాణం చేపట్టాలని భవిష్యత్ తరాల కోసం అలోచన చేయాలని కోరారు. రియల్ వ్యాపారులు, అధికారులు,ప్రజా ప్రతినిదులు అందరూ ఏకమై పట్టణ అభివృద్ధికి సహకరించాలని అన్నారు.పట్టణంలో ప్లాస్టిక్ వాడకం వల్ల పట్టణం పూర్తిగా ప్లాస్టిక్ మయంగా తయారైందని, డంపింగ్ యార్డు లు సరిపోవని,ప్రజల భాగస్వామ్యం లేకుండా సాద్యం కాదని,తడి పొడి ప్లాస్టిక్ వేరు చేసి ఇవ్వాలని అన్నారు.పట్టణంలో రహదారులను అభివృద్ధి చేశామని గంజ్ నుండి SKNR రోడ్డు సైతం వేశామని గుర్తు చేశారు.మిషన్ భగీరథ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో ఒక లక్ష నలభై వెల కిలోమీటర్ల మేర పైప్ లైన్ పనులు జరుగుతున్నాయి అని,నూతనంగా ధరూర్ క్యాంప్ లో 18లక్షల లీటర్ల టాంక్ లు వాడుకలోకి వచ్చాయని అన్నారు.మన బడి మన బస్తీ,బస్తీ దవాఖాన లాంటి కార్యక్రమాలు ప్రజల కోసం చేపడుతున్నామని, ప్రభుత్వ పథకాల విజయవంతం కావటానికి ప్రజల భాగ్వామ్యం తప్పనిసరి అని అన్నారు.


అనంతరం జగిత్యాల పట్టణ 20వ వార్డు మురుగు కాలువ ప్లాస్టిక్ మహమ్మారి వల్ల పూర్తి గా నిండిపోయి రోడ్డు పై మురుగు పారుతున్న విషయాన్ని స్థానికులు ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా వెంటనే స్పందించిన ఎమ్మేల్యే మున్సిపల్ సిబ్బందితో డ్రైనేజీలో పూర్తిగా నిండి పోయిన ప్లాస్టిక్ ను తీయటం జరిగింది.,మాట్లాడుతూ పట్టణ ప్రజల సహకారం తోనే ప్లాస్టిక్ ను అంతం చేయవచ్చని,ప్లాస్టిక్  కరగదు,కాలదు,మురగదు అని ప్రజలు గమనించాలని,నిత్యం టివి,పేపర్ ల్లో చెప్తున్నపటికి ప్రజలు ఉపయోగించడం పట్ల అసహనం వ్యక్తం చేశారు,ప్లాస్టిక్ వాడకం తగ్గించడానికి జరిమానాలు విధించాలని,ప్రజలకు అధికారులు,ప్రజా ప్రతినిదులు అవగాహన కల్పించాలని, వర్షాలు కురవక ముందే డ్రైనేజీ నుండి మురుగు నీరు రోడ్డు పై పారడం చాలా బాధాకరమని, ప్రజలు ఇప్పటి కైనా ప్లాస్టిక్ వాడకం తగ్గించాలనీ ప్లాస్టిక్ పర్యావరణం తో పాటు మానవాళికి ముప్పు అని గుర్తించాలని అన్నారు.


ఈ కార్యక్రమంలో వైస్ ఛైర్మెన్ గోలి శ్రీనివాస్,స్థానిక కౌన్సిలర్లు ఫిర్ధిస్ తరున్నం,అనుమళ్ల కృష్ణ హరి,కౌన్సిలర్ పంబల రామ్ కుమార్, కమిషనర్ స్వరూప రాణి,DE రాజేశ్వర్,AE సత్య నారాయణ,పట్టణ ప్రదాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్,నాయకులు మైనార్టీ యూత్ అధ్యక్షులు ముఖీం, తదితరులు పాల్గొన్నారు.


జనగామ జిల్లా:
ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ దుర్మరణం!


జనగామ మండలం పెంబర్తి వద్ద టాటా ఏసి వాహనం బైక్ ఢీ…బైక్ పై వెల్తున్న జనగామ ఆంద్రజ్యోతి టౌన్ రిపోర్టర్ పాషా(48) అక్కడికక్కడే మృతి.

పల్లె, ప్రగతితో గ్రామాల అభివృద్ధి
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్.


తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‌‌5వ విడత పల్లెప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం నేరల్ల  మరియు గోవిందు పల్లె  గ్రామంల్లో  జగిత్యాల జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  ప్రజాప్రతినిధులతో  పల్లె ప్రగతిని ప్రారంభించారు.


ఈ సందర్బంగా 9 వ రోజు పల్లె ప్రగతి  లో భాగంగా సోక్ పిట్స్ , పారిశుధ్య పనులు మరియు పల్లే ప్రకృతి వనం ను పరిశీలించిన జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్  మాట్లాడుతూ…
గ్రామాల్లో పరిశుభ్రతను పెంచడం, ఆగిపోయిన పనులను పూర్తిచేయడానికి ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని  చెప్పట్టడం జరుగుతుందన్నారు.
15రోజుల పాటు అధికారులు గ్రామాల్లో ఉంటే కొంతమేర సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్న ఆలోచనతో పల్లె ప్రగతి కార్యక్రమానికి ముఖ్యమంత్రి కేసీఆర్  ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని పేర్కొన్నారు.పల్లె ప్రగతి తో అపరిష్కృతంగా ఉన్న పనులు పూర్తి అవుతాయని ఇప్పటికే హరితహరం కార్యక్రమం చేపట్టి చెట్లు నాటుతున్నం,  ఇలాంటి మంచి కార్యక్రమాలతో గ్రామల్లో అభివృద్దికి బాటలు పడుతున్నాయని చైర్పర్సన్ తెలిపారు.
పల్లె ప్రగతిలో ప్రజాప్రతినిధులు పాల్గొని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.
పల్లె ప్రగతి లో ప్రజల భాగస్వామ్యం చేసుకోవాలని, పల్లె ప్రాంతాల్లో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే దిశగా సర్పంచ్ లు అధికారులు చూడాలన్నారు.


అనంతరం గోవిందు పల్లే లోని అంగన్వాడీ కేంద్రాని ఆకస్మికంగా తనిఖీ చేసి పిల్లలకు పౌష్ఠిక ఆహారంను అందించాలని అంగన్వాడీ టీచర్లకు  సూచించారు.
  ఈ కార్యక్రమంలో  జెడ్పీటీసీ సభ్యురాలు బత్తిని అరుణ, ఎంపీపీ చిట్టిబాబు, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి,  సర్పంచ్ లు వసుంధర, రాజయ్య, ఉప సర్పంచ్ శంకర్, మలయ్య, ఎంపిడిఒ నాయకులు ప్రజాప్రతినిధులు అధికారులు తదితరులు పాల్గొన్నారు.


బీజేవైఎం ఆధ్వర్యంలో..


ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  పరిపాలన 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మోడీ  చేసిన పరిపాలనను అన్నింటిని ప్రజలకు వివరిస్తూ
బీజేపీ సంక్షేమ పథకాలను వివరిస్తూ  BJYM పట్టణ అధ్యక్షులు గాజు భాస్కర్ ఆధ్వర్యం లో శనివారం ధర్మపురి లోని 2 వ డివిజన్ లో  కరపత్రాలను   పంపిణి  చెయ్యడం  జరిగింది. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు బెజ్జరపు లావణ్,జిల్లా కార్యదర్శి పిల్లి శ్రీనివాస్,బీజేయం జిల్లా  it సెల్ కో కన్వీనర్ దివిట్టి శ్రీధర్,BJP,BJYM నాయకులు సంగి మాధవ్,ఆనందస్ నవీన్,తౌటం మహేష్,వెల్గనందుల మణికంఠ,కసెట్టి రమేష్ మరియు తదితరులు పాల్గొన్నారు .


కమలాపూర్, నాగారం..


కేంద్ర ప్రభుత్వం మెడీ గారి పాలనలో 8 సంవత్సరల  ఇంటా ఇంటా ప్రచారంలో గ్రామ ఇంచార్జి రాయిళ్ల రవికుమార్ మాట్లాడుతూ గ్రామంలో విశేష స్పందన లభించింది వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అన్నారు ఇట్టి కార్యక్రమంలో  బూత్ అధ్యక్షుడు అక్కల కృష్ణ తదితరులు పాల్గొన్నారు