అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన – ఎమ్మెల్యే సంజయ్!


మన ఊరు మన బడి కార్యక్రమంలో భాగంగా బీర్ పూర్ మండల తుంగుర్ గ్రామంలో ₹ 82 లక్షల నిధులతో చేపట్టనున్న పాటశాల అభివృద్ధి పనులకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆదివారం భూమి పూజ చేశారు. ,అదనపు తరగతి గదులను ప్రారంభించి, , గ్రామం లో పల్లే ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కంపోస్టు షేడ్డులను ప్రారంభించారు. .అనంతరం డంపింగ్ యార్డ్ వద్ద చెత్త ను పరిశీలించి తడి, ,పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాలని ఎరువుగా మార్చ వచ్చని, ప్లాస్టిక్ ను వేరుగా ఇవ్వాలని ప్రజలకు అవగాహన కల్పించడం ప్రజా ప్రతినిదులు, నాయకులు, అధికారుల భాధ్యత అన్నారు.


ఈ కార్యక్రమంలో సర్పంచ్ శ్రీమతి జితేందర్, ఎంపీపీ రమేష్, జెడ్పీటీసీ పద్మ రమేష్, KDCC జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు, ఎంపీటీసీ మల్లీశ్వరి తిరుపతి, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.


₹.2.50 లక్షల L.O.C !
హైదరాబాద్ క్యాంపు కార్యాలయంలో ఆదివారం జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణం అంబేద్కర్ కాలనీ చెందిన B. నందు S/o స్వామి అనారోగ్యంతో బాధపడుతున్న సమాచారం తెలుసుకున్న మంత్రి కొప్పుల ఈశ్వర్, మరింత మెరుగైన వైద్యం కోసం సీఎం కార్యాలయం నుంచి నిమ్స్ ఆస్పత్రికి ₹ 2.50 లక్షల L.O.C నీ వారి కుటుంబ సభ్యులకు హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో అందించారు. ఈ సందర్భంగా LOC వెంటనే మంజూరు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ కు వారి కుటుంబ సభ్యులు, గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలియజేశారు.


కళ్యాణ మండపం ప్రారంభం !
బీర్ పూర్ మండల కేంద్రంలో DMFT నిధులు ₹18.40లక్షలతో నిర్మించిన కళ్యాణ మంటపాన్ని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం గ్రామంలో వైకుంఠ దామాన్ని ప్రారంబించి .గ్రామంలో బేతాళ విగ్రహ ప్రతిష్ట సందర్భంగా బేతాలున్ని దర్శించుకున్నారు. అనంతరం మ్యాదరి సంఘం అధ్వర్యంలో నిర్వహించే, కేతేశ్వరాస్వామి కనకాలమ్మ జాతర కార్యక్రమానికి హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్, కేడీసీసీ జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, సర్పంచ్ శిల్ప రమేష్, ఉప సర్పంచ్ హరీష్, మండల పార్టీ అధ్యక్షులు నార పాక రమేష్, సర్పంచుల ఫోరం మహిపాల్ రెడ్డి, మండల రైతు బందు కన్వీనర్ రాజేశం, ప్రధాన కార్యదర్శి రమేష్, ఉపాధ్యక్షులు శ్రీనివాస్ రావు, యూత్ ప్రధాన కార్యదర్శి అజిత్ రావు,నాయకులు తదితరులు పాల్గొన్నారు.


పరామర్శ
బీర్ పూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,మాజీ సర్పంచ్ చెరుకూరి సుభాష్ తండ్రి చెరుకూరి రాములు అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ పరామర్శించారు. నరసింహుల పల్లే గ్రామ టీఆరెఎస్ అధ్యక్షులు సుధ నారాయణ అనారోగ్యంతో బాధపడుతూఉండగా ఆయనను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనంతరం గ్రామానికి చెందిన వెయ్య నర్శవ్వ అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఎమ్మేల్యే .వెంట కేడీసీసీ జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు,జిల్లా రైతు బంధు సమితి మెంబర్ కొలుముల రమణ,మండల పార్టీ అధ్యక్షులు నార పాక రమేష్,సర్పంచ్ ప్రభాకర్,ఎంపీటీసీ సుషీన్,తదితరులు పాల్గొన్నారు

.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శ !
బీర్పూర్ మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెరుకూరి సుభాష్ కుటుంబ సభ్యులను పట్టభద్రుల ఎమ్మెల్సీ టి.జీవన్ రెడ్డి ఆదివారం నరసింగపాడు లేదు పరామర్శించారు. సుభాష్ తండ్రి రాములు ఆదివారం అనారోగ్యంతో మృతి చెందారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ సుభాష్ కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు.

ఉచిత నేత్ర శస్త్ర చికిత్సలు!
జగిత్యాల పావని కంటి ఆసుపత్రి లో అపి,రోటరీ క్లబ్ సహకారం తో జగిత్యాల నియోజకవర్గానికి చెందిన 27 మంది నిరుపేదలకు ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించి, ఉచితంగా మందులు ,కంటి అద్దాలను జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ వారికి అందించారు..ఈ కార్యక్రమంలో డా.విజయ్, కౌన్సిలర్ లు పంబాల రామ్ కుమార్, కోరే గంగమల్లు, లత జగన్, వైస్ ఎంపీపీ సురేందర్, ,ఆత్మ ఛైర్మెన్ రాజిరెడ్డి,.సర్పంచ్ బొడ్డు దామోదర్, పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు దు మాల రాజ్ కుమార్, నాయకులు సత్తి రెడ్డి, రాజేష్ ,అనిల్ ,ఆసుపత్రి సిబ్బంది,నాయకులు,తదితరులు ఉన్నారు.


ఆర్ఎంపీల సేవలు అమోఘం !
బీర్ పూర్ మండల అర్ ఎం.పి,పి ఎం పి వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశానికి హాజరైన ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ గారు. అనంతరం మాట్లాడుతూ మారుమూల ప్రాంతాల్లో
అర్ ఎం.పి,పి ఎం పి లు అందించే సేవలు చాలా గొప్పవని,ప్రాథమిక వైద్యంలో ముందుంటారు అని, ఒక వైద్యునిగా అందరి సమస్యలు తెలుసునని సమస్యలు ఇబ్బందులు ఉంటే అన్ని విధాల అండగా ఉంటానని ఆర్ఎంపీపీ ఎంపీ వైద్యులకు ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.