J. Surender Kumar,
బి జె పి, ఎన్ డి ఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపత్ విధానం తో సైన్యం నియామకం వల్ల దేశ భద్రతకు అనంతరం వాటిల్లే అవకాశం ఉందని. మాజీ మంత్రి, మంథని ఎమ్మెల్యే, దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశ సరిహద్దుల్లో కాపలా కాస్తూ దేశాన్ని రక్షిస్తున్న సైన్యం నియామకంలో గత 60 సంవత్సరాలుగా కొనసాగుతున్న విధానమే ప్రభుత్వం కొనసాగించాలని, దేశంలో లో లక్షలాది మంది యువత నిరుద్యోగంతో బాధ పడుతున్నారని గత మూడు సంవత్సరాలుగా సైన్యంలో ఎయిర్ ఫోర్స్ లో నేవీలో రిక్రూట్మెంట్ ప్రక్రియ బిజెపి ప్రభుత్వం చేయకపోవడం దారుణమన్నారు. నాలుగు సంవత్సరాల కాలపరిమితికి సైన్యాన్ని రిక్రూట్ చేసుకోవడం అగ్నిపత్ విధానం ( కాంట్రాక్ట్ ఆర్మీ కావడం) ఆందోళన కలిగించే అంశం అన్నారు. ఇందుకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మా నాయకుడు రాహుల్ గాంధీ ఇచ్చిన పిలుపు మేరకు ఆ దేశ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో సత్యాగ్రహ దీక్షలు చేపట్టనున్నామని అన్నారు. రైతు చట్టాలను ఏ విధంగా వెనక్కి తీసుకుందో మోడీ ప్రభుత్వం అదే తరహాలో అగ్నిపత్ పథకాన్ని వెనక్కి తీసుకునేలా సత్యాగ్రహ దీక్షలు ధర్నాలు కాంగ్రెస్ పార్టీ పక్షాన చేపట్టనున్నామని శ్రీధర్ బాబు అన్నారు.
మిషన్ భగీరథ నీళ్లు ఎక్కడ ?
రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లతో చేపట్టామని చెప్పుకుంటున్న మిషన్ భగీరథ నీళ్లు ప్రజలకు అందడం లేదని ప్రత్యేకంగా ధర్మపురి క్షేత్రంలో పరిసర గ్రామాల్లో పట్టణాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంద ని శ్రీధర్ బాబు ఆరోపించారు. స్థానిక మంత్రి జ్యోతి స్వామి తాగునీటి ఎద్దడి నివారించాలని శ్రీధర్ బాబు విజ్ఞప్తి చేశారు. ప్రత్యేకంగా పుణ్యక్షేత్రమైన ధర్మపురి ఆలయ అభివృద్ధి, రోడ్ల విస్తీర్ణ పేరిట అర్ధరాత్రి, అపరాత్రి, ముందస్తు ఎలాంటి నోటీసు లేకుండా ఇల్లు కట్టడాలు కూల్చడం దారుణమన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి వ్యతిరేకం కాదని అయితే ముందస్తుగా ఇంటి యజమానులతో ప్రజలకు చర్చించి వారి సమ్మతి మేరకు విస్తరణ పనులు చేపట్టితే అభ్యంతరం లేదని. రోడ్ల విస్తరణకు చట్టంలో ఓ విధానం ఉందని, అధికారులు ఆ విధానాన్ని విస్మరించి ఇష్టారాజ్యంగా ప్రవర్తించడం తగదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిందని, ఉస్మానియా, కాకతీయ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీల లో కొత్త కోర్సులు ప్రవేశ పెట్టడం లేదని, నిధులు ఇవ్వడం లేదని ,ప్రైవేట్ యూనివర్సిటీలకు అనుమతులు ఇస్తూ ఎస్సీ ,ఎస్టీ ,బీసీ విద్యార్థులకు ఉన్నత విద్యను కాస్ట్లీ గా చేసిందన్నారు. బాసర త్రిబుల్ ఐటీ లో లో విద్యార్థులు ఆందోళన చేసే వరకు డైరెక్టర్ ను నియమించడం పోవడం శోచనీయమన్నారు. సమావేశంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, మాయకు వేముల రాజేష్ కస్తూరి శ్రీనివాస్, శ్రీపతి సత్యానారాయణ్, మల్లేష్, రఫీ, జాజాల రమేష్, హరీష్ , అప్పని తిరుపతి, తదితర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకున్న శ్రీధర్ బాబు, కుటుంబ సభ్యులు
ఆదివారం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ మంథని శాసనసభ్యులు శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు, కుటుంబ సమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

. దేవస్థానం సాంప్రదాయం ప్రకారం , సాదరంగ స్వాగతం పలికి పూజల చేసిన అనంతరం, అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ స్వామివారి శేషవస్త్ర ప్రసాదం అందించారు.

వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాస్ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ రాజగోపాల్, పాల్గొన్నారు.
పరామర్శ !
కాంగ్రెస్ నాయకులు దినేష్ మాతృమూర్తి నీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు ఇంటికి వెళ్లి పరామర్శించారు. గత కొన్ని రోజుల క్రితం నిమ్స్ లో వైద్యం పరీక్షలు చేయించుకొని అడ్మిట్ అయ్యారు. ఇటీవలే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. శ్రీ గాయత్రి నిత్యాన్నదాన సత్రం నూతన భవనం శ్రీధర్ బాబు సందర్శించారు

. ఈ సందర్భంగా భవన పాలకవర్గం అధ్యక్ష కార్యదర్శులు మధుర చారి రామ్ కిషన్ ,డాక్టర్ కే దత్తాత్రేయ, బొజ్జ శంకర్ ,నరేందర్ ,దినేష్ తదితరులు శ్రీధర్ బాబును వేదమంత్రాలతో ఆశీర్వదించి. ఘనంగా సన్మానించారు.

స్వామివారిని దర్శించుకున్న NTPC జనరల్ మేనేజర్!
శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి నీ NTPC చీఫ్ జనరల్ మేనేజర్ సునీల్ కుమార్ దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు . వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగ స్వాగతం పలికి పూజల చేసిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య శేషవస్త్ర ప్రసాదం చిత్రపటం అందజేసినారు.

ఈ కార్యక్రమంలో దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ముఖ్య అర్చకులు నంభి శ్రీనివాస్ , అభిషేకం పురోహితులు బొజ్జ సంతోష్ కుమార్, సంపత్ కుమార్ రాజగోపాల్, పాల్గొన్నారు.