కమిషనర్ కార్యాలయంలో కదలని ఫైల్ !
J.Surender Kumar
సాలీనా కోట్లాది రూపాయల ఆదాయం కలిగిన ఐదు, ప్రముఖ ఆలయాల వాటి అనుబంధ ఆలయాల ఉద్యోగులు, పిఆర్సి తో కూడిన వేతనం సంవత్సరకాలంగా పొందలేకపోతున్నారు. ఎన్ని రాజకీయ ఒత్తిళ్లు, ఉద్యోగ సంఘాలు నాయకులు పైరవీలు చేసిన, దేవాదాయశాఖ కమిషనర్ కార్యాలయం నుండి, ఆర్థిక శాఖకు వీరికి సంబంధించిన ఫైల్ చేరనట్టు చర్చ.
వివరాలు ఇలా ఉన్నాయి. వరంగల్ దేవాదాయ శాఖ పరిధిలోని భద్రకాళి, మేడారం, కురివి, జామలాపూర్, ధర్మపురి, ఆలయాలతోపాటు, అనుబంధం ఆలయాలు ఉద్యోగులకు, సిబ్బందికి, అర్చకులకు, వేదపండితులకు 2021 జూన్ మాసం నుంచి అందాల్సిన నూతన PRC 28 శాతం ఫిట్మెంట్ తో, వేతనం ఈ సంవత్సరం మే మాసం వరకు వీరు పొందనట్టు సమాచారం.

నియామకాలు ఎలా జరిగాయి ?
తన పర్యవేక్షణ పరిధిలోనీ ఆలయ ఉద్యోగులు, పిఆర్సి తో కూడిన వేతనం పొందుటకు అర్హులు అని, వీరి ఉద్యోగ నియామకం ప్రభుత్వ నిబంధనల మేరకు, ఈ ప్రక్రియ ద్వారా జరిగిందని, వరంగల్ దేవాదాయ శాఖ ఉన్నతాధికారి, కమిషనర్ కార్యాలయంకు సిఫారసు చేయాల్సి ఉంటుంది.. అయితే కొన్ని ఆలయాల్లో కొందరు ఉద్యోగుల నియామకాలకు, సంబంధించిన అధికారిక వివరాలు, రికార్డ్స్ లేకపోవడం, ఉన్న నిబంధనల

అనుకూలంగా నియామకాలు జరగకపోవడంతో సిఫారసు చేసే అధికారి అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ, కమిషనర్ కు పంపిన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. సర్వీస్ రికార్డులు, ఉద్యోగంలో చేరిన తేదీ, నాటి కి వయస్సు, ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ ద్వారా నియామకం జరిగిందా ? పాలకవర్గాల తీర్మానం మేరకు జరిగిందా ? ఆలయ కార్యనిర్వహణాధికారి ద్వారా నియామకం జరిగిందా? ఆలయ ఆదాయం తో పాటు, నిబంధనల శాతం కన్నా అధికంగా వ్యయంతో వారికి జీతభత్యాలు చెల్లింపులు చేశారా?.

ఆలయ పాలమండలి తీర్మానం మేరకు ఆ ఉద్యోగులకు పదోన్నతులు కల్పించరా.? కొందరు ఉద్యోగులకు ప్రతి నెల ₹లక్ష రూపాయలకు పైన జీతం ఏ ప్రాతిపదికన వారు పొందుతున్నారు? కమీషనర్ అనుమతి ఉత్తర్వులు ఉన్నాయా ? పే స్లిప్స్ లు, కొందరి సర్వీస్ పుస్తకాల లో తప్పులు, మార్పులు చేర్పులు, తదితర అంశాలు తన పరిశీలన లో నిబంధనల మేరకు లేవని, ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్, ఉద్యోగులు,తదితర అంశాలను కమిషనర్ కు పంపిన నివేదికలో ఉన్నతాధికారి పేర్కొన్నట్టు చర్చ.

డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయినా ఆ అధికారి ( గ్రూపు ద్వారా ) ముక్కు సూటిగా, నిజాయితీగా, ఆలయం కు సంబంధించిన ఆస్తులు, భూములు కాపాడాలని ఆదాయాన్ని పెంచాలని, అవినీతి అక్రమాలకు పాల్పడవద్దని, ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, అనేక సందర్భాల్లో ఉద్యోగులకు వివరించడంతో పాటు ఆ అధికారి కూడా నిక్కచ్చిగా విధులు నిర్వహిస్తారని కొందరు ఉద్యోగులు ఆ అధికారి విధి నిర్వహణ తీరును ప్రశంసిస్తున్నారు.

రాజకీయ ఒత్తిడి.?
ఐదు ఆలయాలకు చెందిన కొందరు ఉద్యోగలు, నాయకులు, అర్చకులు ,వేద పండితులు, తమ తమ ప్రాంత ఎమ్మెల్యేలు, మంత్రుల ద్వారా ఆర్థిక శాఖ అధికారులపై, సంబంధిత శాఖ మంత్రి ద్వారా, రాజకీయ ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఆ అధికారి రాజకీయ ఒత్తిళ్లకు లొంగడు, రూల్ ప్రకారమే పనిచేస్తాడు, మీ వినతిపత్రం పరిశీలించమని అధికారికి సిఫార్స్ చేస్తానంటూ మంత్రి తన వద్దకు వచ్చిన ఉద్యోగ సంఘం నాయకులతో అన్నట్టు సమాచారం. నివేదిక లో ఇన్ని అభ్యంతరాలు ఉండగా, తాము పిఆర్సి అమలుకు ఎలా ? సిఫారస్ చేస్తామంటూ, కమిషనర్ కార్యాలయంలో సంబంధిత సెక్షన్ అధికారులు కుడా జంకుతున్నట్లు ఉద్యోగ వర్గాల్లో చర్చ నెలకొంది. ఇదిలా ఉండగా పిఆర్సి పొందుటకు అన్ని అర్హతలు ఉండి, కొందరి వల్ల అర్హత ఉన్నవారు నష్టపోవడం బాధాకరమని, నిబంధనలకు విరుద్ధంగా ఉద్యోగం సంపాదించిన, పదోన్నతులు పొందిన వారిని మినహాయించి మిగతా ఉద్యోగులకు PRC వర్తింపచేయాలని కొందరు ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కమిషనర్ కార్యాలయంలో పిఆర్సి మంజూరు ఖర్చుల నిమిత్తం కొన్ని ఆలయాల్లో ఉద్యోగులను గ్రూపులుగా విభజించి ముగ్గురు, నలుగురు ఉద్యోగలు కలసి PRC పేరిట పెద్ద మొత్తంలో వసూలు చేసినట్టు చర్చ.
ఉద్యోగుల లో ఆందోళన!
PRC తో కూడిన జీవితం తమ ఖాతాలో జమ కాకపోవడం ఖర్చుల నిమిత్తం పెద్ద మొత్తంలో తమ వద్ద వసూలు చేసిన తయారయ్యే కార్లు నిమ్మకు నీరెత్తినట్టు ప్రవర్తించడం రేపు మాపు అంటూ మంత్రులు, కమిషనర్ , ఆర్థిక శాఖ అధికారుల వద్దకు వెళుతున్నామంటూ సంవత్సర కాలంగా మద్ద పెట్టు తున్నారని ఉద్యోగుల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొన్ని ఆలయాల్లో ఉద్యోగులు డబ్బులు వసూలు చేసిన వారిని బహిరంగంగా ఇంకెంతకాలం ? అంటూ ప్రశ్నించిన సందర్భాలు అనేకం. ఇదిలా ఉండగా గత మూడు నెలలుగా ఈ ఆలయల కార్యనిర్వహణాధికారుల కు మినహా మిగతా ఉద్యోగులకు జీతాలు రావడంలేదని సమాచారం. కార్యనిర్వహణాధికారులకు ప్రభుత్వం నెల, నేల జీతాలను ట్రెజరీ ద్వారా ప్రభుత్వం చెల్లిస్తున్నది. PRC తో కూడిన వేతనం చెల్లించడానికి అధికార యంత్రాంగంపై ఒత్తిడి పెరగడంతో నియామకాలపై విజిలెన్స్ విచారణకు ,సిఫారసు చేసే యత్నంలో దేవాదాయ శాఖ ఉన్నట్టు ఉద్యోగ వర్గాల్లో చర్చ నెలకొంది.