హైదరాబాద్ ట్యాంక్ లోని సమాచార, పౌర సంబంధాల శాఖ కార్యాలయ ఆవరణలో ఉన్న. తెలంగాణ రాష్ట్ర టీవీ చలనచిత్ర అభివృద్ధి సంస్థ కార్యాలయంలో ఆదివారం చైర్మన్ గా అనిల్ కూర్మాచలం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా మంత్రి కొప్పుల ఈశ్వర్ అనిల్ కూర్మాచలం ను అభినందించి శుభాకాంక్షలు తెలిపి, ఆశీర్వదించారు.

అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం అవగాహన ర్యాలీ !
జగిత్యాల జిల్లా కలెక్టర్ రవి ఆదేశానుసారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాల నివారణ దినోత్సవం సందర్భంగా జిల్లా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో, కలెక్టరేట్ నుండి న్యూ బస్సు స్టాండ్ చౌరస్తా వరకు అవగాహనా ర్యాలీ ప్రారంభించిన ఎక్సైజ్ AD SP చంద్రబాను నాయక్ ., అనంతరం కొత్త బస్ స్టాండ్ వద్ద విద్యార్థులు, సిబ్బంది, మానవ హారంగా ఏర్పడి మాదక ద్రవ్యాల నివారణ కోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు.

ఈ సందర్భంగా జరిగిన అవగాహన ర్యాలీ లో ఎక్సైజ్ సీఐ ప్రభాకర్ రెడ్డి, ఎక్సైజ్ ఎస్సై, సిబ్బంది,NCC, ఆశా వర్కర్లు, విద్యార్థులు, పాల్గొన్నారు., చంద్రబానునాయక్, ప్రభాకరరెడ్డి గార్లు ప్రసంగించారు.

యువత డ్రగ్స్ కు బానిస కావద్దు
ఎస్పీ శ్రీమతి సింధు శర్మ
తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై దృష్టి సారించాలి
ప్రపంచ మాదకద్రవ్యాల నివారణ దినోత్సవం ను పురస్కరించుకొని డ్రగ్స్ కు యువత బానిస కావద్దు- బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దుని జిల్లా ఎస్పీ శ్రీమతి సింధు శర్మ యువతకు సూచించారు..డ్రగ్స్ వాడకం సంతోషంతో మొదలై దుఃఖంతోనే అంతమౌతుందని అన్నారు. .తల్లిదండ్రులు పిల్లల ప్రవర్తనపై అనునిత్యం దృష్టిపెట్టాలని అన్నారు. .ప్రవర్తనలో మార్పులు ఎప్పటికప్పుడు గమనిస్తు సరైన మార్గదర్శనం చేయాలని అన్నారు. డ్రగ్స్ కు అలవాటు పడిన తర్వాత బాధపడితే ప్రయోజనం లేదని భవిష్యత్తు ను అందకారంలోకి నెట్టిన వారవుతారని అన్నారు. మెదడు, నరాల వ్యవస్థ దెబ్బతిని శాశ్వత మానసిక వైకల్యం వచ్చే అవకాశాలుంటాయని అన్నారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రాఫిక్ సబ్ స్టాన్స్ యాక్ట్ 1985 ప్రకారం శిక్షార్హులు అవుతారని అన్నారు. మాదకద్రవ్యాలు అమ్మడం, సేవించడం రెండు నేరమని అన్నారు. చట్టాలు బలంగా ఉన్నాయని తెలుపుతూ తర్వాత బాధపడి లాభం లేదని అన్నారు. పోలీస్ శాఖ జిల్లాలో డ్రగ్స్ పట్ల యువతలో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
గడిచిన 2021 సంవత్సరం జిల్లాల లో గంజాయి కి సంబంధించి మొత్తం 14 కేసులు నమోదయ్యాయి ఇందులో 38 మoది ని అరెస్టు చేయడం తో పాటు 30.165 kgs ల గంజాయి ని సీజ్ చేయడం జరిగిందన్నారు.
2022 సంవత్సరంలో జిల్లాల లో గంజాయి కి సంబంధించి మొత్తం 06 కేసులు నమోదయ్యాయి ఇందులో 23 మoది ని అరెస్టు చేయడం తో పాటు 11.20 kgs ల గంజాయి ని,11 గంజా మొక్కలను సీజ్ చేయడం జరిగింది. ఎస్పీ వివరించారు

సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ ఎంపీ !
ఇటీవల మృతి చెందిన జైన గ్రామంలో సర్పంచ్ జోగినపల్లి ప్రభాకర్ రావు కుటుంబాన్ని మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వెంకటస్వామి పరామర్శించారు. మండల అధ్యక్షులు సంగేపు గంగారాం.ప్రధాన కార్యదర్శి కోరుట్ల మల్లికార్జున్. సీనియర్ నాయకులు నలమాసు వైకుంఠం, వేముల భాస్కర్. వెలుగు గంగాధర్..పలేర్ల సురేందర్ సోగల కిషన్. లింగారెడ్డి. శివరాజ్. రాజేందర్..ప్రసాద్ రాజు. సతీష్ ప్రవీణ్. తదితరుల వివేక్ వెంట ఉన్నాడు.

ప్రారంభోత్సవాలు !
బీర్ పూర్ మండల కోల్వాయి, కోమన్ పల్లి, చిన్న కలువాయి చిత్ర వేణి గూడెం ,తాళ్ళధర్మారం,కమ్మునురు, కండ్ల పల్లి, రంగ సాగర్, చర్ల పల్లి, కందేన కుంట, గ్రామాల్లో ఎమ్మెల్యే సంజయ్ కుమార్, పల్లే ప్రకృతి వనం, వైకుంఠ ధామం, కంపోస్టు షెడ్డు లను ప్రారంభించారు. వీటితో పాటు .రంగ సాగర్ లో DMFT నిధులు ₹7.6 లక్షలతో నిర్మించిన గంగ పుత్ర సంఘం భవనాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీపీ రమేష్, జెడ్పీటీసీ పద్మ, KDCC జిల్లా మెంబర్ రామ్ చందర్ రావు, పాక్స్ ఛైర్మెన్ నవీన్,వైస్ ఎంపీపీ లక్ష్మణ్ రావు,,సర్పంచులు, ఎంపీటీసీలు,ఉప సర్పంచ్ లు నాయకులు, కార్యకర్తలు, తదితరులు, పాల్గొన్నారు.