ఆసిఫాబాద్ జిల్లాలో మావోయిస్టుల రిక్రూట్మెంట్ – ఆరుగురి అరెస్ట్ ఎస్ పి సురేష్ కుమార్!



. ఆసిఫాబాద్ జిల్లా నుండి  మావోయిస్టుల లో  చేరడానికి వెళ్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్ పి సురేష్ కుమార్  తెలిపారు.

ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  బెజ్జూర్ మండలం కుష్న పెల్లి వద్ద, ఆరుగురిని అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా ముగ్గురు దళంలో చేరడానికి వెళ్తున్నారని, మరో ముగ్గురు సానుభూతిపరులు అని వారు వివరించినట్టు ఎస్పీ తెలిపారు.

వీరి వద్ద 53 డిటోనేటర్ లు, 27 జిలేటిన్ స్టిక్స్, లభించాయని,  బేజ్జుర్ మండలానికి చెందిన వాడే హనుమంతు,  కౌటాల మండలము  జనగాం గ్రామానికి చెందిన నాగపురే చక్రపాణి, అలియాస్ చత్రు,


కొరియర్ ల ద్వారా రిక్రూట్మెంట్ !


జాడే ఎక్ నాథ్ , జాడే శాంతారాం ,  మురళి గూడ  కు చెందిన  వాడే హనుమంతు  అనే  మావోయిస్ట్ కొరియర్ ద్వారా. ఈ రిక్రూట్ మెంట్ జరుగుతుందని  ఎస్పీ వివరించారు , ఆర్థిక, కుటుంబ , భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలతో సతమతం అవుతున్న వారిని గుర్తించి మావోయిస్టు దళం లో చేరేలా చూడాలని మావోయిస్టులు చెప్పడం తో వాడే హనుమంతు వీరిని గుర్తించి మావోయిస్టు  దళం లో చేర్చేందుకు ముగ్గురు వ్యక్తులను మరో ముగ్గురు కలసి తీసుకు వెళ్తుండగా  వాహనాల తనిఖీలు చేస్తుండడం తో వీరు దొరికి పోయారని వెల్లడించారు,  మావోయిస్టు లలో చేరకుండా వీరిని గుర్తించి పట్టుకున్న కౌటాల సీఐ, బుద్దే స్వామీనీ  బేజ్జూర్ ఎస్సై వేంకటేశ్  ను ,ఎస్పీ ఈ సందర్భంగా అభినందించారు,
సమస్యలున్న వారిని ,గుర్తించి వారికి కౌన్సిలింగ్ ఇచ్చి దళం లో చేరేలా ప్రోత్సహిస్తు న్నారనీ అన్నారు, సమస్యలు ఉంటే పోలిస్ లకు చెప్పుకుంటే తీరుస్తామని, కానీ మావోయిస్టు లలో చేరితే సమస్య పరిష్కారం కాకపోగా కొత్త సమస్యలు చుట్టూ ముడుతాయని అన్నారు, మావోయిస్టు లలో చేరడానికి ప్రయత్నం చేస్తే చర్యలు తప్పవని  ఈ సందర్భంగా ఎస్పీ హెచ్చరించారు,

మరోసారి మార్కెట్ కమిటీ అధ్యక్షుడిగా రాజేష్.!
  రేపు పదవీ బాధ్యతలు స్వీకరణ !


ధర్మపురి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రాజేష్. పాలకవర్గ సభ్యులు సోమవారం పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. తెరాస ప్రభుత్వం ఆవిర్భవించిన తర్వాత మొట్టమొదట అల్లం దేవమ్మ, మార్కెట్ కమిటీ చైర్మన్ గా  బాధ్యతలు నిర్వహించారు. అనంతరం రాజేష్ ఆ పదవిని చేపట్టారు. రెండోసారి ఈ ప్రభుత్వం ఉత్తర్వులు సంఖ్య 203 , తేదీ 22-05/2022 అయ్యో రాజేష్ కుమార్ చైర్మన్గా పాలకవర్గం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు రేపు
మార్కెట్ యార్డ్ లో మంత్రి సమక్షంలో పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.
సీనియార్టీ , కి పట్టం !
తెరాస ఉద్యమం ఆరంభంలో 2001 ఆగస్టు మాసంలో. ధర్మపురి గ్రామపంచాయతీ  వార్డు సభ్యుడిగా కొనసాగుతున్న రాజేష్ తనతో పాటు మరో నలుగురు వార్డు సభ్యులను వెంటబెట్టుకొని సిద్దిపేటలో స్వర్గీయ దుబ్బాక ఎమ్మెల్యే రామలింగారెడ్డి ద్వారా కెసిఆర్ వీరికి గులాబీ కండువా కప్పి ఐదుగురు వార్డు సభ్యులను పార్టీలో చేర్చుకున్నారు. నాటినుండి రెండు దశాబ్దాల కాలం గా టిఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్నారు. ఎంపీటీసీగా,మండల పరిషత్ ఉపాధ్యక్షుడిగా, పదవులు చేపట్టిన  రాజేష్ కు మంత్రి కొప్పుల ఈశ్వర్ నమ్మినబంటుగా గుర్తింపు ఉంది.
వైస్ చైర్మన్ గా అక్కన పెల్లి సునిల్ కుమార్, డైరెక్టర్లుగా గాజు సత్తయ్య, ర్యాగల నారాయణ, అల్పట్టి లక్ష్మి, పాయిల శ్రీనివాస్, వీరవెని రాజ మల్లయ్య, గైని మల్లేశం, జంగ శ్రీనివాస్, మహమ్మద్ ఇక్రం, మామిడి శ్రీనివాస్, మైనేని వెంకటీ, బొల్లం హరి ప్రసాద్, జైనా పీఏసీఎస్ చైర్మన్ సౌళ్ళ నరేశ్, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ సత్తెమ్మ, జిల్లా మార్కెటింగ్ మేనేజర్, వ్యవసాయ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ లు. సోమవారం మంత్రి సమక్షంలో బాధ్యతలు చేపట్టనున్నారు.


సిద్దిపేట జిల్లా :
కరీంనగర్ – హైదరాబాద్ రాజీవ్ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం.,


సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మం. మల్లారం వద్ద మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్ డివైడర్ ఎక్కి కార్ ను ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురి మృతి, కరీంనగర్ నుండి హైదరాబాద్ కి వెళ్తుండగా జరిగిన ఘటన..మృతులు సిరిసిల్ల జిల్లా నేరేళ్ళ కి చెందిన తాండ్ర పాపారావు, పద్మ, కార్ డ్రైవర్ ఆంజనేయులు.,


పలువురు ఐఏఎస్ ల బదిలీలు.!


సంగారెడ్డి జిల్లా కలెక్టర్ గా ఎ.శరత్, సిద్దిపేట జిల్లా కలెక్టర్ గా ప్రశాంత్ జీవన్ పాటిల్, గద్వాల జిల్లా కలెక్టర్ గా కోయ శ్రీ హర్ష,  ఉట్నూర్ ఐటిడిఎ ప్రాజెక్టు ఆఫీసర్ గా వరుణ్ రెడ్డి, పంచాయతీ రాజ్ శాఖ డైరెక్టర్ గా హనుమంత్ రావు, ఏటూరు నాగారం ఐటిడిఎ పిఓ గా అంకిత్,  నల్గొండ కలెక్టర్ గా రాహుల్ శర్మ.


జగిత్యాల జిల్లా :
ఆర్మూర్ కు బయలుదేరిన బీర్పూర్ మం. బిజేపి నాయకులు.


భారత ప్రధాని నరేంద్ర మోడీ  పరిపాలన 8 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వివిధ పథకాల లబ్ధిదారులతో నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ లో నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్ ఆధ్వర్యంలో జరుగుతున్న సదస్సు కు బయలుదేరిన బిజేపి నాయకులు.,
దీనికి భారత భారీ పరిశ్రమల శాఖ మంత్రినరేంద్రనాథ్ పాండే గారు హాజరవుతున్న దృష్ట్యా ఈ కార్యక్రమానికి జగిత్యాల మరియు బీర్ పూర్ నుండి కార్యకర్తలు లబ్ధిదారులు తరలి వెళ్ళారు,
ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు చిలకమర్రి మదన్మోహన్, బీర్పూర్ మండల శాఖ అధ్యక్షుడు, జనార్ధన్,  జగిత్యాల పట్టణ అధ్యక్షుడు జీవన్, .బీర్పూర్ ప్రధాన కార్యదర్శి రమేష్, కిషన్, దళిత మోర్చా అధ్యక్షుడు ప్రభాకర్, యువమోర్చా అధ్యక్షులు, నరేందర్, ఉపాధ్యక్షులు రాజశేఖర్,  శ్రీనివాస్ జగిత్యాల దళిత మోర్చా బాపురపు శేఖర్, ఓరుగంటి హరికృష్ణ గంగన్న హరి కిరణ్ తదితరులు తరలి వెళ్ళడం జరిగింది.


రేపటి నుంచే స్కూళ్లు ప్రారంభం.


తెలంగాణలో విద్యాసంస్థల ప్రారంభంపై అనిశ్చితి నెలకొనగా, వేసవి సెలవుల అనంతరం సోమవారం నుంచి విద్యాసంస్థలు తెరుచుకోవాల్సి ఉండగా.. కరోనా కేసులు పెరిగుతున్న నేపథ్యంలో సెలవులను పొడగిస్తారనే వార్తలు వెలువడ్డాయి.
అయితే, కరోనా కేసుల తీవ్రత నేపథ్యంలో సెలవుల పొడిగింపుపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ముందు ప్రకటించిన విధంగానే ఈ నెల 13న పాఠశాలలు పునఃప్రారంభించనున్నట్లు ఆమె వెల్లడించారు. అయితే పాఠశాలల పునః ప్రారంభంపై మంత్రి సబితా ఇంద్రారెడ్డి నేడు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యాశాఖ ఉన్నతాధికారులు మంత్రి ముందుకు కరోనా పరిస్థితులను తీసుకెళ్లారు.

మౌలిక సదుపాయాల కల్పనే  పల్లె ప్రగతి ధ్యేయంగా!

బుగ్గారం మండలం గోపులాపూర్ గ్రామంలో శ్రమదానం 5 వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న బుగ్గారం మండల ఎంపీపీ జెడ్పిటిసి సభ్యులు బాదినేని రాజమణి రాజేందర్  ఈ కార్యక్రమం  ఈనెల 3 వ తేదీ నుండి ఈనెల18 వరకు కొనసాగుతుందని, రోజువారి చేపట్టే కార్యక్రమాలను ప్రజలకు వివరించారు… పారిశుద్ధ్యం మెరుగు పరచడం, మంచినీటి సదుపాయం కల్పించడం, చెట్లను పెంపొందించడం.. కరెంటు పోల్స్ మరమ్మతులు, ప్రతిఇంటా ఇంకుడుగుంత, మరుగుదొడ్డి నిర్మాణలు, తడి, పొడి చెత్తల విధానాన్ని ప్రోత్సాహించడం లాంటి కార్యక్రమలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లానని ఎంపీపీ జెడ్పిటిసి సభ్యులు బాదినేని రాజమణి రాజేందర్ గారు అన్నారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్  కొమ్మినేని సుశీలా నారాయణ , తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు కొమ్మినేని కొమురయ్య , తెరాస గ్రామ శాఖ ఉపాధ్యక్షులు మేడిపెల్లి గంగాధర్ ,గైని మల్లేశం ,మరిపెళ్లి నారాయణ రెడ్డి , ఎంపీడీవో  తిరుపతి, స్పెషల్ ఆఫీసర్ సత్యనారాయణ, సెక్రెటరీ అమీర్, కారోబార్ నైజం ,అధికారులు, నాయకులు మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.