J.Surender Kumar,
“అభం శుభం తెలియని 14 సంవత్సరాల ఆ బాలిక అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని కావచ్చు , ప్రేమ పేరిట కావచ్చు, మాయమాటలతో కావచ్చు, లేదా బెదిరింపులకు పాల్పడికావచ్చు ఖచ్చితంగా తెలియదు కానీ మానవ మృగం మా? మృగాల ? తెలియదు కానీ ఆ బాలికపై నెలల తరబడి లైంగిక దాడులకు పాల్పడ్డారు. ఫలితంగా ఆ బాలిక గర్భం దాల్చింది, తనకు గర్భం వచ్చింది అనే విషయం కూడా తెలియని అమాయకత్వం ఆమెది.
అంగబలం, అర్థబలం, కుల బలం, ఇంటిలో మగదిక్కు లేని తనం ,నిలువనీడ ,గూడులేని, కడు పేదరికం వారిది. పరువు కాపాడుకోవడం కోసం ఆ బాలిక తల్లి పడిన పడరాని పాట్లు బాలిక ప్రాణాలను కాపాడలేదు. ప్రసవంలో శిశువుకు జన్మనిచ్చిన ఆ బాలిక మృతి చెందింది. ఈ సంఘటన ను పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ ల విచారణ 18 నెలలు గడుస్తున్నా బాలిక గర్భం దాల్చడానికి బాధ్యులు ఎవరు ? అనే మిస్టరీని ఛేదించే లేకపోతున్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం నేటికీ అందించలేక పోతున్నారు. అనే చర్చతో పాటు ఈ సంఘటనలో పోలీసులు తూతూమంత్రంగా కేసు నమోదు చేసి ఏదో మొక్కుబడిగా విచారణ. చేస్తున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వివరాలలోకి వెళితే !
జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణానికి చెందిన 14 సంవత్సరాల. దళిత మైనర్ బాలిక 10/10/2020 న ప్రసవ సమయంలో మృత శిశువుకు జన్మ ఇచ్చి మృతి చెందింది. స్థానిక పోలీసులు తేది 11/10/2020 తేదీన, FIR No 335/2020 న కేసే నమోదు చేశారు. అక్షర జ్ఞానం లేని బాలిక తల్లి, శిశువు, బాలిక మృతదేహాలను నదీతీరాన ఖననం చేయించింది. అయితే బాలిక మరణం సమాచారాన్ని తమకు చెప్పలేదని లేదని స్థానిక పోలీసులు అదె నెల 12న ఖననం చేసిన బాలిక, శిశువు మృతదేహాలను తీసి వైద్య పరీక్షల నిమిత్తం జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
18 నెలలు గడుస్తున్నా వీడని మిస్టరీ !
మృత శిశువును డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఆసుపత్రిలో భద్రపరిచిన మృత శిశువు శరీరంలో నమూనాలను సేకరించి పోలీసులు పరిశోధనలకు, ఫోరెన్సిక్ లాబ్ పంపించి బాలిక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి తల్లికి అప్పగించారు. 18 నెలలు గడుస్తున్నా డిఎన్ఏ నివేదిక పోలీస్ శాఖకు చేరిందో, లేదో స్పష్టంగా తెలియడం లేదు.
తూతూ మంత్రంగా విచారణ ?
మృతి చెందిన బాలిక తల్లికి, ఎస్సీ ఎస్టీల పై దాడులు జరిగిన, లైంగిక వేధింపులకు జరిగిన, మరణాలు సంభవించిన బాధిత కుటుంబానికి ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం 18 నెలలు గా ఆ కుటుంబానికి అందలేదు
. ఏదో తూ తూ మంత్రంగా నివేదికలను పోలీస్ శాఖ ప్రభుత్వానికి నివేదిక ను సమర్పించినట్లు చర్చ నెలకొంది. ముందుగా ఎఫ్ఐఆర్లో 174 సి ఆర్ పి సి సెక్షన్ గా నమోదు చేసి,26/10/2020 న న్యాయస్థానానికి సమర్పించిన ఎక్స్ప్రెస్ నివేదికలో అదనంగా ,పలు సి ఆర్ పి సి సెక్షన్ లతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, సెక్షన్ ఫోక్స్, చట్టంలోని తదితర సెక్షన్ల నమోదు చేసినట్టు నివేదికలో పేర్కొన్నారు. ఈ నివేదిక ను అప్పటి ఎస్ ఐ, న్యాయమూర్తికి సమర్పించినట్లు సమాచారం. అయితే ఎస్సీ ఎస్టీ పొక్స్ చట్టంలోని సెక్షన్ల కింద నమోదైన కేసులను C.I, లేదా D.S.P స్థాయి అధికారి విచారణ చేస్తారా ? సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి చేస్తారా ? అనే అంశం గమనార్హం. మృతి చెందిన బాలిక కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడానికి నివేదికలో సంపూర్ణ సమాచారం లేదని, ఎఫ్ఐఆర్లో నిందితుడు ,గుర్తు తెలియని వ్యక్తి అని పేర్కొన్నారని. నిందితుడి వివరాలు ఎఫ్ఐఆర్లు పేర్కొనలేదని, ప్రత్యేకంగా ఆ నిందితుడి కులము నమోదు చేయలేదని , నిందితుడు ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గానికి చెందినవాడు కాదు అనే విషయం స్పష్టంగా నివేదికలో పేర్కొనలేదని, ప్రభుత్వం పోలీసు శాఖను ప్రశ్నించినట్టు సమాచారం. నిందితుడు కాని, అనుమానితుడి కానీ అతడిపై కోర్టులో సమర్పించిన చార్జ్ షీట్, ఒరిజినల్ ఎఫ్ఐఆర్ ప్రతి, అవసరమైన అన్ని ధ్రువీకరణ పత్రాలు, జతపరచి సమర్పిస్తే, బాధిత దళిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందించనున్నట్టు 2022 మార్చి మాసంలో ప్రభుత్వం, పోలీస్ శాఖ కు లేఖ వ్రాసినట్టు సమాచారం.
సాంకేతిక అంశాల దిశగా విచారణ చేపట్టలేరా?బాలిక సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్న పోలీసులు, ఆ బాలిక ఫోన్ కాల్ డాటా పరిశీలిస్తూ ఇన్ కమింగ్, అవుట్ గోయింగ్ , కాల్స్ వివరాలను స్వీకరించడంలో ఇబ్బందులు ఏమిటి ? బాలిక ఫోన్ కు ఎవరెవరు కాల్ చేశారు ? ఎందుకు చేశారు ? ఎన్ని సార్లు చేశారు? ఎన్ని రోజుల నుండి చేస్తున్నారు? అనే తదితర వివరాలతో పాటు ఏ ఫోన్ ఎవరిది ? ఎంత సేపు మాట్లాడారు ? ఏ ప్రాంతం ప్రదేశం నుంచి మాట్లాడారు, తదితర సమగ్ర వివరాలతో, పాటు సెల్ కంపెనీల డాటా సర్వర్ ద్వారా సైతం సమగ్ర సమాచారాన్ని తెలుసుకునే అవకాశం పోలీసు శాఖకు ఉంది. దీనికితోడు సెల్ ఫోన్ కాల్స్ సెల్ టవర్ నుంచి ఏ ప్రాంతానికి వెళ్ళింది ఏ ప్రదేశంలో ఫోన్ ఆక్టివేట్ అయింది, సమయం ,తేదీ ల, తో పాటు, వాయిస్ రికార్డు తెలుసుకునే అధునాతన సాంకేతిక పరికరాలు తెలంగాణ పోలీస్ శాఖ వద్ద ఉందనే విషయం తెలిసిందే. ఈ అధునాతనమైన టెక్నాలజీని ఉపయోగించే పోలీసులు హైదరాబాదులోని దిశ పై అత్యాచారం ఆమెను హతమార్చడం సంఘటనలు నిందితులను గుర్తించి అరెస్టు చేసిన విషయం విధితమే. ( గ్లోబల్ పోసే సింగ్ సిస్టం) G.P. S అంటారు. విధానంతో వివరాలు సేకరిస్తే మృతి చెందిన బాలిక తో స్నేహ సంబంధాలు కొనసాగించి వారి వివరాలతో పాటు తదితర అంశాలు వెలుగుచూసే అవకాశం ఉంది. ఆ వివరాలలో అనుమానితులను గుర్తించి వారి కి వైద్య పరీక్షలు నిర్వహించి శిశువు మృతదేహానికి డిఎన్ఏ టెస్ట్ నిర్వహిస్తే ఆ బాలిక గర్భం దాల్చడానికి కారకులు ఎవరు ? అనే విషయం తేటతెల్లమవుతోంది అనేది చర్చ నెలకొంది.
లైంగిక దాడులపై ” లా ” చెప్పిన వాళ్లు –
నోళ్ళు విప్పడం లేదు ఎందుకో ?
దేశంలో ఎక్కడ ఏ ప్రాంతంలో మహిళలపై దాడులు జరిగిన, లైంగిక వేధింపులు , హత్యలు,జరిగిన వారికి న్యాయం చేయాలంటూ నిందితులను కఠినంగా శిక్షించాలని అంటూ ధర్నాలు, నిరసనలు చేసే వివిధ హక్కుల సంఘ నాయకు లు , మహిళా సంఘాలు , వివిధ రాజకీయ పార్టీల నేతలు లైంగిక వేధింపులు గూర్చి “లా ” చెప్పినవాళ్ళు అనేక మంది ఉన్నారు. ధర్మపురిలో దళిత బాలిక మరణానికి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని లైంగిక దాడికి పాల్పడిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని నిరసనలు, ధర్నాలు ,నిర్వహించ లేకపోవడానికి వాళ్లు నోళ్లు ఎందుకు విప్పడం లేదో తెలియడం లేదు.
అక్టోబర్10 న ఏం జరిగిందంటే ?
10న ఉదయం బాలిక ప్రసవవేదన తో ఆర్తనాదాలు చేస్తుండగా, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు 108 అంబులెన్స కు ఫోన్ చేశారు. ఆంబులెన్స్ ,వారు అద్దెకు ఉండే గది ముందరికి వచ్చింది కారణం ఏమిటో తెలియదు కానీ అందులో వాళ్ళు వెళ్లడానికి నిరాకరించినట్టు సమాచారం. ఈ దశలో బాలిక కు తీవ్ర రక్తస్రావం కావడంతో పాటు ఆమె తన దుస్తుల లోనే మృత శిశువును ప్రసవించి నట్టు సమాచారం. ఈ తరుణంలో బాలిక తల్లి తన కూతురు పరిస్థితి చూసి వైద్యుల వద్దకు తీసుకెళ్లడానికి బయటికి పరుగెత్తి ఆటో రిక్షా కోసం పలువురిని ప్రాధేయపడిన టు తెలిసింది. ఒకరిద్దరు వచ్చి రక్తంతో తడిసిన దుస్తులతో ఉన్న బాలికను చూసి తన ఆటోలో తీసుకెళ్లడానికి నిరాకరించినట్లు సమాచారం. ఈ దశలో తల్లి ప్రాథమిక వైద్యం తో శిశువును తల్లి నుంచి వేరు చేసినట్టు సమాచారం . ఈ దశలోనే బాలిక మృతి చెందింది. అనేది చర్చ. సమాచారం తెలిసిన కులస్తులు ఆర్థిక సహాయం అందించి బాలిక శిశు మృతదేహాలను అంతిమ సంస్కారం నిర్వహించినట్లు సమాచారం.
దుర్భరమైన జీవనం!
కొన్ని సంవత్సరాల క్రితం భర్త ను కోల్పోయిన ఆమె తన ఇద్దరు పిల్లలు కష్టపడి పోషించు కుంటూ దుకాణాల వద్ద ధాన్యం గింజలు తుడుస్తూ గింజలు తీసుకొని జీవనం కొనసాగిస్తున్నారు. సొంత ఇల్లు లేకపోవడంతో పోలీస్ స్టేషన్ సమీపంలోని ఒక అద్దె గది లో తల్లీబిడ్డలు జీవనం కొనసాగిస్తున్నారు. పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని బాలిక గర్భం దాల్చడానికి బాధ్యులు ఎవరో గుర్తించి చట్టపరంగా శిక్షించాలని, బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన ఆర్థిక సహాయం అందించి ,న్యాయం చేసి ఆదుకోవాలని పలువురు ముక్తకంఠంతో కోరుతున్నారు.