జాతీయ హరిత ట్రిబ్యునల్ న్యూ ఢిల్లీ వారి ఆదేశానుసారం బయోమెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ వ్యర్ధాల నిర్వహణ పై జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ జిల్లా కలెక్టర్ ఏర్పాటు చేశారు. ఇట్టి కమిటీ లో చైర్మన్ గా జిల్లా కలెక్టర్ వ్యవహరిస్తారు. మరియు డి ఎం హెచ్ ఓ, జిల్లా పోలీసు ప్రతినిధి, ఏరియా హాస్పిటల్ సూపరిండెంట్, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్, సభ్యులుగా ఉంటారు. తెలంగాణ రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి రామగుండం నోడల్ ఏజెన్సీ గా ఉన్నారు..ఇట్టి సమావేశాన్ని అడిషనల్ కలెక్టర్ జగిత్యాల 29 6 2022 న జరిగింది. ఇట్టి సమావేశంలో బయోమెడికల్ వేస్ట్ ను, ఎట్టి పరిస్థితుల్లో మున్సిపల్ సాలిడ్ వేస్ట తో కలవకూడదని మునిసిపల్ అధికారులను ఆదేశించారు . అన్ని ఆస్పత్రి లోని బయోమెడికల్ వేస్ట్ ను, ఎట్టి పరిస్థితుల్లో వెంకటరమణ ఏజెన్సీకి మాత్రమే ఇవ్వాలని డీఎంహెచ్వో జగిత్యాల్ హాస్పిటల్స్ ను ఆదేశించడం జరిగింది.

అలాగే బయో మెడికల్ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ , 2016 పాటించాలని ఆదేశిస్తూ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సర్టిఫికెట్ తీసుకోవాలని సూచించారు.. నియమాలు పాటించని ఆసుపత్రులపై , పోలీస్ డిపార్ట్మెంట్ సహాయంతో తగిన చర్యలు తీసుకోవాలని కమిటీని ఆదేశించడం జరిగింది. రిజిస్టర్ ప్రైవేట్ ప్రాక్టీషనర్లు, మరియు ప్రైవేట్ మెడికల్ ప్రాక్టీషనర్లు ,బయో మెడికల్ వేస్ట్ ను ,దగ్గర్లోని హాస్పిటల్ లో ఇవ్వడానికి తగినన్ని ఏర్పాటు చేయాలని మున్సిపల్ కమిషనర్లను మరియు జిల్లా పంచాయతీ అధికారి వాళ్లను ఆదేశించారు. ఇట్టి సమావేశంలో డాక్టర్ పి శ్రీధర్ డిఎంహెచ్వో , ఆర్ ప్రకాష్ డిఎస్పి జగిత్యాల , జగిత్యాల మున్సిపల్ కమిషనర్ జి స్వరూపారాణి , డాక్టర్ ఎన్ సుదక్షిణా దేవి, ఏరియా హాస్పిటల్ సూపర్డెంట్ జగిత్యాల్ కోరుట్ల ,మెట్పల్లి ,ధర్మపురి, రాయికల్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు రవి దాస్, మరియు మహేష్, జి మహేష్ మెడికల్ ఏజెన్సీ వెంకటరమణ ఏజెన్సీ పాల్గొనడం జరిగింది

ఉద్యోగుల ఆత్మీయ సమావేశంలో మంత్రి ఈశ్వర్!
జగిత్యాల పట్టణ టౌన్ హాల్ లో జరిగిన జగిత్యాల జిల్లా స్థాయి ఐకేపీ,వివోఏ ఉద్యోగుల సంఘం ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,కోరుట్లఎమ్మేల్యే, జిల్లా పార్టీ అధ్యక్షులు విద్యాసాగర్ రావు ,జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ,జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత సురేష్

ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు రూఫ్ సింగ్, రాష్ట్ర అధ్యక్షురాలు మాధవి, జిల్లా అధ్యక్షులు తిరుపతి, ,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మచ్చెందర్, టీఆరెఎస్ కేవి పవన్ బాబు, ,వివోఏ లు, ఐకేపీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

శాంతియుత వాతావరణంలో బక్రిద్ పండుగను నిర్వహించుకోవాలి కలెక్టర్ జి. రవి!
జగిత్యాల, జూన్.29: ముస్లీంల ప్రదానమైన పండుగలలో ఒకటైన బక్రిద్ పండుగను ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా శాంతియుత వాతావరణంలో జరుపుకునేలా తగు ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లాలోని ముస్లీం మతపెద్దలు, మున్సిపల్, పంచాయితి, పోలీసు అధికారులతో సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జులై 10వ తేదిన నిర్వహించుకోనున్న బక్రిద్ పండుగ కొరకు ,వెటర్నిటి శాఖ అధికారులచే దృవీకరించిన జంతువులను మాత్రమే వినియోగించాలని, పండుగ కొరకు వాహనాల ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించే జంతువులను అధికారులు దృవీకరించినవి మాత్రమే ఉండాలని, పరిమితికి మించి వాహనాలలో పశువులను తరలించరాదని పేర్కోన్నారు. జిల్లాలో చెక్ పోస్టులను కూడా ఏర్పాటు చేయడం జరిగిందని అక్కడ అధికారులచే గుర్తించిన దృవీకరించిన పత్రాలు ఉన్న వాటికి మాత్రమే అనుమతులు ఇవ్వడం జరుగుతుందని పేర్కోన్నారు.
ప్రశాంత వాతావరణంలో పండుగను నిర్వహించుకునేలా ప్రతిఒక్కరు వ్యవహరించాలని, కబేలాల వద్ద పారిశుద్ద్యం కార్మికులచే ఎప్పటికప్పుడు శుభ్రంచేయించడం, పశు వ్యర్థాలను బయటి ప్రాంతాలలో పడవేయకుండా బ్లాక్ కవర్లలో మాత్రమే వేయాలని సూచించారు. జిల్లాలో సబ్ డివిజనల్ అధికారులను నియమించడం జరుగుతుందని, ఫిర్యాదు వచ్చినప్పడు సక్రమంగా స్పందించిన అధికారులపై, అసంఘటిత వాతావారణాన్ని సృష్టించే వారిపై చట్టరిత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కోన్నారు.
సామాజిక మాద్యమాల వచ్చే సందేశాలపై సరైన విధంగా నిర్దారించుకోవాలని, ఎవరు కూడా తొందరపడకుండా ఉండాలని, పశుసంవర్దక శాఖ అధికారిచే దృవీకరించిన వాటిని మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. కబేలాల వద్ద ప్రతిఒక్కరు సామాజిక దూరం పాటించడం, మాస్క్ దరించడం, వంటివాటి పాటించాలని, ఆదిశగా అధికారులు కబేలాల నిర్వహకులకు అవగాహన కల్పించాలని సూచించారు. పండుగ ముగిసే వరకు మున్సిపల్ మరియు గ్రామ పంచాయితీ పరిదిలో అధికారులు, సిబ్బంది ప్రత్యేక పారిశుద్ద్య కార్యక్రమాలను చేపట్టాలని అన్నారు.
జిల్లా ఎస్పి సిందుశర్మ మాట్లాడుతూ, రవాణలో ఇబ్బందులు కలుగకుండా జిల్లాలో వెటర్నరి అధికారులతో సమన్వయంతో పనులు నిర్వహించడం జరుగుతుందని, జంతువులను కొనుగోలు చేసే ప్రాంతంలోనే ఎ జంతువులను కొనుగోలు చేయాలి, ఒక వాహనం ద్వారా ఎన్ని జంతువులను తరలించాలి అనే వాటిని అధికారుల ద్వారా కోనుగోలు చేసిన ప్రాతంలోనే దృవీకరించుకోవాలని సూచించారు. రవాణలో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, జంతువుల కొనుగోలు, అమ్మకాలు జరిగే ప్రాంతాలలో పోలీసులు ఎప్పటికప్పుడు పెట్రోలింగ్ చేస్తారని, ఎక్కడైన అవాంచనీయ సంఘటనలు జరిగితే వెంటనే అధికారుల దృష్టికి తీసుకురావాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని ముస్లిం మత పెద్దలు, ఇంచార్జి స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ , పశు సంవర్ధక శాఖ అధికారులు, జిల్లా మైనారిటి అధికారి , జిల్లా పంచాయితి అధికారి నరేష్, జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి డివిజన్ పోలీసు అధికారులు, మన్సిపల్ కమీషనర్లు పాల్గోన్నారు.