మంగళవారం జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ, బుగ్గారం, మద్దునూర్ గ్రామాల్లో పల్లె ప్రగతి, మన ఊరు..మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రాథమిక, ఉన్నత పాఠశాలలో మౌళిక వసతుల అభివృద్ది పనుల కు శంకుస్థాపన చేసిన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శ్రీకారం చుట్టారు

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోరంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు. వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువచ్చిందన్నారు.

గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుతో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు. కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. కార్యక్రమం మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్ దావ వసంత, డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, జెడ్పీటీసీ బాదినేని రాజేందర్, యంపిపి బాదినేని రాజమణి, వైస్ యంపిపి జోగినిపల్లి సుచెంధర్, ఎంపీటీసీ రెండ్ల లక్ష్మి, సర్పంచ్ గాదె తిరుపతి, SMC ఛైర్మెన్లు పాతకాల రమేష్, పెరుక రమేష్, కో.అప్షన్ సభ్యులు రహమాన్ తదితరులు పాల్గొన్నారు.

టిఆర్ఎస్ లో చేరిక !
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం వెల్గొండ గ్రామ సర్పంచ్ గాదె తిరుపతి గారు మరియు ఇతర పార్టీ నుండి వంద మంది కార్యకర్తలు మంగళవారం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రాష్ట్రం ప్రవేశ పెడుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై చేరినట్లు వారు ప్రకటించారు

.
మాజీ మంత్రికి పరామర్శ!
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సతీమణి లత ఇటీవల అనారోగ్యం తో మరణించగా వారి కుటుంబ సభ్యులను సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ , ఎమ్మెల్యేలు విద్యాసాగర్ రావు , డాక్టర్ సంజయ్ కుమార్ , జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ , డిసిఎంఎస్ చైర్మన్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి, వైస్ చైర్మన్ హరిచరణ్ రావు బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్ ,మున్సిపల్ ఛైర్ పర్సన్ బోగ శ్రావణీ ఇతర ప్రజాప్రతినిధులు మంత్రి వెంట ఉన్నారు.

సర్పంచ్ ప్రభాకర్ రావు హఠాన్మరణం !
ధర్మపురి మండలం గ్రామ సర్పంచ్ జోగినిపల్లి ప్రభాకర్ రావు (68). గుండెపోటుతో మంగళవారం మృతి చెందారు.
రెండవ సారి సర్పంచ్ గా గెలిచిన ప్రభాకర్ కు అజాతశత్రువు గా మండలంలో గ్రామంలో గుర్తింపు ఉంది. ఆయన మృతి పట్ల మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు జైన గ్రామానికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు.

వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం భాస్కర్ రెడ్డి , గుండారపు నరసయ్య కొమురెల్లి రెడ్డి, రైస్ మిల్లు అధినేత వినోద్ రావు వెంకటేశ్వరరావు, మాజీ మండల పరిషత్ అధ్యక్షులు సౌమ్య భీమయ్య, గురువారం జడ్పిటిసి సభ్యులు బాదినేని రాజేందర్, దమ్మన్నపేట పేట సర్పంచ్ పీ.మల్లేశం, విండో చైర్మన్ నరేష్, మాజీ సర్పంచ్ బుచ్చన్న, మాజీ ఎంపీటీసీ ప్రభాకర్ , గంగారెడ్డి, తదితరులు ప్రభాకర్ రావు కు ఆయన ఇంటికి వెళ్లి మృతదేహం నివాళులర్పించి సంతాపం వ్యక్తం చేశారు.
రేపు ఉదయం అంత్యక్రియలు !
బుధవారం ఉదయం 9 గంటలకు జైన గోదావరి తీరంలో ప్రభాకర్ రావు అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు సమీప బంధువు హరి ప్రసాద్ తెలిపారు.

తుంగుర్ లో ఉచిత వైద్య శిబిరం!
శనివారం బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామ పంచాయతీ అవరణలో జగిత్యాల వేద ఐ కేర్ Dr రాజు ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించిడం జరిగింది. రోగులకు ఉచితంగా మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం లో సర్పంచ్ గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్ మరియు ఉపసర్పంచ్ పూడూరి రమేష్ , శైలజ మరియు వైద్య సిబ్బంది గ్రామ ప్రజలు పాల్గొన్నారు