గురువారం మధ్యాహ్నం 1200 గంటల సమయంలో గొల్లపల్లి నల్లగుట్ట వద్ద వాహనాలు తనికి చేస్తుండగా నిందితుడు దండుగుల చీరంజీవి s/o నర్సయ్య, age22yrs, కులం: వడ్డెర r/o రంగపేట్ గ్రామం, సారంగాపూర్ మండలం అను అతన్ని అరెస్టు చేయడం జరిగింది. విచారంలో నిందితుడు (4) చైన్ స్నాచింగ్ లు చేసినట్లుగా గుర్తిచడం జరిగింది.
నిందితుడు దండుగుల చీరంజీవి చేసిన (4) చైన్ స్నాచింగ్ ల వివరాలు,
S.No నిందితుడు చైన్ స్నాచింగ్ తేదీ నిందితుడు చైన్ స్నాచింగ్ చేసిన ప్రాంతం నిందితుడు స్నాచింగ్ చేసిన బంగారు గొలుసుల బరువు & విలువ.
1. తేదీ:21.05.2022 వేములవాడలోని చెక్కపల్లి గ్రామ శివారులో పెద్దమ్మ గుడి దగ్గరలో, సుమారు (2) తులాల బంగారు పూస్తేల తాడు
2. తేదీ: 24.05.2022 నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ శివారులో లలిత ఫంక్షన్ హాల్ దగ్గరలో, సుమారు (2) తులాల బంగారు పూస్తేల తాడు
3. తేదీ: 05.06.2022 వెల్గటూర్ లోని కొత్త బ్రిడ్జ్ వద్ద, రోల్డ్ గోల్డ్ పూస్తేల తాడు.
4. తేదీ: 05.06.2022 గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామా శివారులో సుమారు (2) తులాల బంగారు పూస్తేల తాడు
నిందితుడు దండుగుల చీరంజీవి పైన పేర్కొన్న (4) చైన్ స్నాచింగ్ చేసి అట్టి బంగారు గొలుసులను జగిత్యాల లోని ప్రవేట్ ఫైనాన్స్ లలో తన పేరుమీద కుదవ పెట్టి డబ్బులు తీసుకొని తన జల్సాలకు ఇతర ఖర్చులకు వాడుకున్నాడు, నిందితుడుని పోలీస్ అదుపులోకి తీసున్న తరువాత తాని వద్ద నుంచి పోలీస్ వారు స్వాదిన పర్చుకున్న విలువైన వస్తువుల వివరాలు,
నిందితుని వద్ద నుంచి స్వాదిన పర్చుకున్న విలువైన వస్తువులు వాటి విలువ. గొల్లపల్లి మండలం బొంకూర్ గ్రామా శివారులో నిండుతుడు స్నాచింగ్ చేసిన సుమారు (2) తులాల బంగారు పూస్తేల తాడు సుమారు విలువ 90,000/- నిజామాబాద్ జిల్లా మోర్తాడ్ శివారులో లలిత ఫంక్షన్ హాల్ దగ్గరలో నిండుతుడు స్నాచింగ్ చేసిన సుమారు (2) తులాల బంగారు పూస్తేల తాడు. సుమారు విలువ 90,000/- 75,000/- రూపాయల నగదు – నిందితుని చైన్ స్నాచింగ్ చేసుటకు వాడిన YAMAHA FZS దాని నంబర్ TS21D3061 – నిందితుని Realme cell phone స్వాధీన డిఎస్పీ తెలిపారు.
నిండుతున్ని పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన CI- ధర్మపురి, SI- ధర్మపురి, SI- గొల్లపల్లి, SI-.వెల్గటూర్, SI- బుగ్గారం సిబ్బంది రామస్వామి, రమేశ్, మల్లేశ్, చంద్రమోహన్, రవి, కిరణ్, వేణు, పూర్ణ సాయి, .తిరుపతి, జిల్లా IT Core సిబ్బందిని SP, అభినంధించినారు.
గుట్కా పట్టివేత!

రాయికల్ మండలం రామోజీ పేట శివార్లలో గుట్కా తరలిస్తున్న ఆటో ను రాయికల్ పోలీసులు పట్టుకున్నారు..
జన్నారం నుండి ఆటో లో గుట్కా తరలిస్తున్న రాథోడ్ అజయ్ పై కేసు నమోదు ….
సుమారు లక్షా 25 వేల విలువ గల గుట్కా ను, ఆటో ను స్వాధీనం…

కూల్చివేత !
ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నిర్మించిన బేస్ మెంట్ ను కూల్చి వేసిన రెవెన్యూ అధికారులు
జగిత్యాల ధర్మపురి రోడ్డు తిప్పన పేట సమీపంలో హద్ది రాస్తా లో ( ప్రభుత్వ స్థలం )లో అక్రమంగా నిర్మించిన బేస్ మెంట్ ను కూల్చి వేశారు , తహాసిల్దార్, సిబ్బంది అధికారులు మాట్లాడుతూ అక్రమ కట్టడాల నిర్మిస్తే ప్రభుత్వపరంగా చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు
జడ్పీ చైర్పర్సన్ దావ వసంత !
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా భీర్పూర్ మండలంలోని రేకులపెల్లి గ్రామంలో జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు.
ఈసందర్భంగా జిల్లా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ.. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని, గ్రామీణాభివృద్ధిలోనే దేశాభివృద్ధి సాధ్యమని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పల్లె ప్రగతి కార్యక్రమంతో పల్లెల్లో పండుగ వాతావరణం ఏర్పడిందని, ప్రజలందరూమమేకమై పల్లె ప్రగతిలో పాల్గొంటున్నారని, ప్రజలు చుట్టుపక్క
పరిసరాలను పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని అందరూ ఆరోగ్యవంతమైన జీవనం కొనసాగించేలా పల్లె పరిసరాలను పరిశుభ్రంగా చూసుకోవాలని అన్నారు.
గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం,
ముఖ్యమంత్రి కేసీఆర్, పంచాయతీరాజ్ శాఖ మంత్రి, ఎమ్మెల్యే లకు పల్లె ప్రజల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కేడీసీసీ జిల్లా డైరెక్టర్ రాంచందర్ రావు, రైతు బంధు జిల్లా మెంబర్ కొల్ముల రమణ, ,జెడ్పీటీసీ పాత పద్మరమేష్, రైతు బంధు మండల కన్వినర్ మెరుగు రాజేష్, సర్పంచ్లు పర్వతం రమేష్, ఎలగందుల లక్ష్మి అశోక్ ,ఉప సర్పంచ్ కాసారపు రమేష్, గ్రామ శాఖ అధ్యక్షులు మేడి రాజన్న, ఉప అధ్యక్షులు తాటిపెల్లి దుబ్బయ్య, ఎంఆర్ఓ,ఎంపిడిఓ మరియు ఇతర ప్రజాప్రతినిధులు అధికారులు నాయకులు తదితరులు
పాల్గొన్నారు.
కాంగ్రెస్ మేధోమథనం !
జిల్లా కేంద్రంలో దేవిశ్రీ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం పార్టీ బలోపేతానికి నిర్వహించే మేధోమథన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి, ఇండియన్ యూత్ కాంగ్రెస్ నేషనల్ కోఆర్డినేటర్ , మనాఫ్ నుల్లిపాడు తదితరులు పాల్గొన్నారు