దసరా రోజు యువరాజుకు పట్టాభిషేక మా..?

కెసిఆర్ కొత్త చరిత్ర సృష్టిస్తాడా..?

J. Surender Kumar.
కెసిఆర్ అంటేనే ఒక సంచలనం, ఒక ప్రభంజనం, ఒక చరిత్ర, తెలంగాణ సారథి, టిఆర్ఎస్ భాగ్యదాత,
ఇవన్నీ నిజాలే ! దసరా పండగ రోజున తనయుడు మంత్రి కేటీఆర్ ను ముఖ్యమంత్రినీ చేసి కెసిఆర్ కొత్త చరిత్ర కు శ్రీకారం చుట్టనున్నరా ? అంటే దాదాపు అత్యధిక రాజకీయ విశ్లేషకులు అవుననే అంటున్నారనే చర్చ జరుగుతోంది.
రాజకీయాలు శాంతిగా, శాంతంగా ఎవరిని ఉండనివ్వవు, పదవులు శాశ్వతాలు, అనే భ్రమలు కలిపిస్తాయి. అవకాశ ఆకాశహర్మ్యాలను రంగుల కలల్లో చూపిస్తాయి, నేల విడిచి సాము చేసేలా ఊరిస్తాయి, ఉత్తేజపరుస్తాయి, ఉసిగొలుపుతాయి.
ఇలాంటి పరిస్థితే సి యం కెసిఆర్‌ను ప్రస్తుతం వెంటాడుతుందా ? రాజకీయ లోఎత్తులకు పై ఎత్తులు వేయడంలో అపర చాణక్యుడిగా పేరుపొంది ఇంతవరకు రాజకీయంగా పెద్దగా తప్పుటడుగులు వేయని కెసిఆర్ ఇప్పుడు వేస్తున్న అడుగులు సరియైనవేనా ? రాజకీయ ప్రత్యర్థులను సరిగా అంచనా వేస్తున్నారా ? రాజకీయ మిత్రులనుకునేవారిని సరిగా అర్థం చేసుకున్నారా ? వారు మనస్ఫూర్తిగా కెసిఆర్ కు సహకరిస్తారా ? చెయ్యి ఇస్తారా ? రానున్నఅసెంబ్లీ ఎన్నికల విశయంలో కెసిఆర్ ఆచితూచి తర్జనభర్జన చేసి ఒక నిర్ణయానికి వచ్చారా ? అందుకే రాష్ట్రాన్ని యువరాజుకు అప్పగించి కేంద్రబాట పట్టనున్నారా ? అనే చర్చ రాజకీయ విశ్లేషకులలో జరుగుతోంది.


ప్రశాంత్ కిషోర్ తో చర్చలు. కేంద్రంపై విమర్శలు

!గత కొన్ని నెలల క్రితం రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తో కెసిఆర్ తో జరిపిన చర్చల అనంతరం కేంద్రంపై టీ ఆర్ఎస్ నేతల నోరు పెరగడం, మంత్రి కేటీఆర్ నేరుగా ప్రధాని నరేంద్ర మోడీ, అమిత్ షా ల పై విమర్శలు, తెలంగాణపై వివక్ష అంటూ ఆరోపణలు, వడ్ల కొనుగోలు పై రాష్ట్రంలో రాస్తారోకోలు, ఢిల్లీలో మంత్రులు, సీఎం కెసిఆర్ ధర్నాలు, కేంద్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేయడంలాంటివి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మనం ఇటీవలి పరిణామాలు గమనిస్తే ముఖ్యంగా కెసిఆర్, కెటిఆర్ లు కేంద్ర ప్రభుత్వం పైన ప్రతిరోజు ఒంటికాలు మీద లేస్తున్నారు. అలాగే మంత్రులు, ఎమ్మెల్లేలు, అధికార ప్రతినిధులు అందరూ కేంద్రాన్ని అదేపనిగా విమర్శిస్తున్నారు. ఇది కాకతాళీయం కాదు అని, కావాలని రాజకీయ రచ్చ దేశవ్యాప్తంగా టిఆర్ఎస్ కు కేంద్ర మధ్య వైరం ఉందనే ఉనికిని తెలియడం కోసమే అనే విషయం కనీస రాజకీయ పరిజ్ఞానం కలిగిన ఎవరికైనా అర్థమవుతుంది. మరో కారణం కూడా ఉండి ఉండవచ్చు రాష్ట్రంలో బిజెపి ఎదుగుతున్నతీరు, కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో కూడా అనుకున్న రీతిలో బలపడకపోవడం వల్ల, బిజెపి వల్ల ప్రమాదం పొంచిఉందన్న సంగతి గమనించడంవల్ల కావచ్చు. ఐతే ప్రశాంత్ కిషోర్, కెసిఆర్ ల వ్యూహాలు మాత్రం ఊహాజనితంగా మాత్రమే చర్చల్లో నానుతున్నాయి.
వీటిని రాజకీయ విశ్లేషకులు ప్రస్తుత పరిస్థితులకు అనువయిస్తూ, నిశితంగా గమనిస్తూ వారి వారి అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాలకన్నా ఉత్తరాదిలో, జాతీయ మీడియాల్లో , సామాజిక మాధ్యమాల్లో, కెసిఆర్ వేస్తున్న రాజకీయ వ్యూహాల పట్ల చర్చ జరుగుతున్నది.
కెసిఆర్ ఈమధ్య వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రతిపక్ష ప్రాంతీయ పార్టీలను, నాయకులను వారి వద్దకు ప్రత్యేకంగా వెళ్ళి మరీ కలుస్తున్నారు. కాంగ్రెస్ లేని ప్రతి పక్షాల ఐక్యతను కెసిఆర్ కోరుకుంటున్నారు. దాదాపు 200 లోక్ సభ స్థానాల్లో భాజపా, మరియు ,కాంగ్రెస్ ముఖాముఖి పోటీ ఉన్న నేపథ్యంలో, కెసిఆర్ ఆశ నెరవేరేనా ? చివరకు రాజకీయాల్లో సంఖ్యాబలమే ముఖ్యం కదా ! కేవలం 17 ఎంపీ సీట్లు ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రాంతీయ పార్టీ నాయకత్వాన్ని ,42 ఎంపీ స్థానాలున్న పశ్చిమ బెంగాల్ లోని TMC పార్టీ, 39 ఎంపీ స్థానాలున్న తమిళనాడులోని డిఎంకె, 80 ఎంపీ స్థానాలున్న ఉత్తరప్రదేశ్లోని ఎస్పి లాంటి ప్రాంతీయ పార్టీలు సమయం వచ్చినప్పుడు 17 లోకసభ స్థానాలున్న తెలాంగాణ రాష్ట్రం లోని టిఆర్ఎస్ ఆధిపత్యాన్ని ఒప్పుకుంటాయా ? ఈవిషయం కెసిఆర్‌కు తెలువదా ? లేక రాష్ట్రంలో హ్యట్రిక్ సాధించడానికి దారి లేక, చివరగా కెసిఆర్ వేస్తున్న అతి పెద్ద ప్రమాదభరిత అడుగు కాదా ? కెసిఆర్ కు మరొ తలనొప్పి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఏపార్టీకైనా దేశ రాజకీయాల్లో పాత్ర పోషించడానికి అధికారముంది. అవకాశముంటుంది. ఐతే ఆర్థిక వనరులు, అవకాశాల్ని సమయ, సందర్భాలు మరియు పరిస్థితులు కలిపిస్తాయి. గతంలో కేంద్రంలో రాజకీయ కూటమి రాజకీయాలు, నేర్పిన పాఠాలు తాజా జ్ఞాపకాలే కదా ! అందునా కేంద్రంలో బలంగా ఉన్న భాజపా ప్రభుత్వం, మోడీకి దేశవ్యాప్తంగా ఉన్న ప్రజాదరణ, ఆ అవకాశాన్ని ఇప్పటికిప్పుడు కెసిఆర్‌కు కలిపిస్తుందా ? ఒకవేళ భాజపా ప్రభుత్వం కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాలేకపోయి నా, కాంగ్రెస్ నాయకత్వంలోని సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడవలసి వస్తే, టిఆర్ఎస్ స్థానికంగా ఎలాంటి రాజకీయ నిర్ణయం తీసుకుంటుంది ? అనే అంశం ప్రస్తుత చర్చ. కొన్నిసార్లు అధినాయకులు తమ వ్యక్తిగత ప్రతిష్ఠ కొరకు రాజకీయ వైరుధ్యాలు, విద్వేషాల నేపథ్యంలో అతి విశ్వాసంతో తీసుకునే రాజకీయ నిర్ణయాలు ఆయా పార్టీలకు, నాయకులకు శాపాలుగా మారవచ్చు. ముఖ్యంగా ప్రాంతీయ పార్టీలు రాష్ట్రంలోనే అధికారానికి దూరమైతే వారి పాత్ర దేశ రాజకీయాల్లో మృగ్యమైతుంది కదా ! పక్క రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్రం పై చేసిన ధర్మపోరాటం ఆందోళన ఒక నిలువెత్తు నిదర్శనమే కదా ! విజయపరంపరలో ప్రతి నాయకుడు, బలంగా కనిపిస్తాడు. అది ఇందిరాగాంధీ కావచ్చ, ఎన్టీఆర్ కావచ్చు, మోడీ కావచ్చు లేదా, కెసిఆర్ కావచ్చు. అపజయాలు చవిచూసినప్పుడు క్యాడర్ లీడర్లు కొద్దిమంది మాత్రమే ఆ నాయకుని వెంట ఉంటారనేది రాజకీయాల్లో జగమెరిగిన సత్యం.


క్రేజివాల్ తీరే వేరు !

కేంద్రం లో బిజెపి ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాజధాని ఢిల్లీ ఎన్నికల్లో ఆ పార్టీ రెండు సార్లు ఘన విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కేజ్రీవాల్ ఇటీవల పంజాబ్ రాష్ట్రంలోను ఆప్ ప్రభుత్వం ఏర్పడడం తో రెండు రాష్ట్రాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకైక ప్రాంతీయ పార్టీగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో క్రేజీ వాల్ కు క్రేజ్ పెరిగింది. పారదర్శక పాలన, అవినీతి రహిత పాలన అంటూ ప్రచారం చేసుకుంటు ఇతర ప్రాంతీయ పార్టీలను ఆయన చులకన చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే ఇదిలా ఉండగా. ఇటీవల ఈ డి అధికారులు ఆప్ మంత్రిని అరెస్టు చేసిన విషయం మిగతా పార్టీలకు ఏ సంకేతాలుస్తున్నది ?


కెసిఆర్ చరిత్ర సృష్టించనున్నాడా?

దేశ రాజకీయ చరిత్రలో ముఖ్యమంత్రి గా కొనసాగుతూ తన పదవిని తనయుడికి పట్టాభిషేకం చేసిన ఉదంతం లేదు దాణా కుంభకోణంలో అప్పటి బీహార్ సీఎం లాలూ ప్రసాద్ యాదవ్, పదవి నుంచి తప్పుకుని. తన భార్య ను సీఎం చేశారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో అప్పటి మాజీ సీఎం.ములాయం సింగ్ యాదవ్ సంపూర్ణ మెజారిటీ సాధించి తన తనయుడు అఖిలేష్ యాదవ్ కు సీఎం పీఠం అప్పగించారు. 2004 నుంచి 2014 వరకు కేంద్రంలో యూపీఏ ప్రభుత్వం లో యూపీఏ చైర్ పర్సన్ సోనియా గాంధీ , ప్రధానిగా మన్మోహన్ సింగ్ కొనసాగించింది తప్ప రాహుల్ గాంధీకి ప్రధాని పదవి కట్టబెట్టే సాహసం చేయలేదు. ఒకవేళ కేసీఆర్ తనయుడు కేటీఆర్ కు దసరా పండగ రోజున సీఎం పదవి పట్టాభిషేకం చేస్తే దేశ రాజకీయాల్లో కొత్త చరిత్ర సృష్టించబడుతుంది అనడంలో సందేహం లేదు.


దేశ రాజకీయాల్లో కెసిఆర్ కీలకపాత్ర ?

సీఎం కేసీఆర్ పుట్టిన రోజున, తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా జాతీయ దిన పత్రికలు, వివిధ రాష్ట్రాలలో లార్జెస్ట్ సర్కులేషన్ ప్రాంతీయ పత్రికలకు వేలకోట్ల రూపాయలు ప్రకటన జారీ చేయడం, ప్రత్యేకంగా ప్రకటనలలో ” తెలంగాణ ఆచరిస్తున్నది దేశం అనుసరిస్తున్నది ” ప్రధాన నగరాల్లో కేసీఆర్ కటౌట్లు, రైతు చట్టాల రద్దు కోసం పోరాటంలో మృతి చెందిన వందలాది మంది రైతులకు పంజాబ్, హర్యానా, రాష్ట్రంలో ప్రభుత్వం పక్షాన లక్షలాది రూపాయల ఆర్థిక సహాయం. ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజ్, ప్రశాంత్ కిషోర్ లతో మంతనాలు. తదితర అంశాల నేపథ్యంలో సీఎం కేసీఆర్ దేశ రాజకీయాల్లో కీలకపాత్ర వహించనున్నట్లు స్పష్టమవుతున్నది. స్వయాన కేసీఆరే కొన్ని నెలల ఆగండి సంచనాలు బయటపడతాయి అంటూ పాత్రికేయుల సమావేశంలో బెంగళూరులో ప్రకటించడం ప్రస్తావనార్హం.


దసరా రోజే ఎందుకంటే !

తెలంగాణ ప్రజలు దసరా విజయానికి ప్రతీకగా, అతిపెద్ద పండగగా సంతోషాలతో జరుపుకుంటారు. దుర్గా నవరాత్రి ఉత్సవాలు ,బతుకమ్మ పండుగ,( దసరా ) విజయదశమి అమ్మవారికి ప్రీతిపాత్రమైన రోజు. దీనికితోడు కేసీఆర్ 2015లో అయత చండీ యాగం, 2018 లో రాజ్య శ్యామల యాగం, ఘనంగా నిర్వహించారు. గత కొన్ని రోజుల క్రితం సీఎం కూతురు ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత నిజాంబాద్ జిల్లా నందిపేట లో తన స్వగ్రామంలోని పురాతనమైన శ్రీ రాజ్య లక్ష్మి నరసింహ ఆలయం ను లక్షలాది రూపాయలు వ్యయం తో పునరుద్ధరణ చేశారు. అమ్మవారి అనుగ్రహంతో ఎలాంటి ఆటంకాలు లేకుండా విజయదశమి రోజున నూతనంగా నిర్మితమవుతున్న సెక్రటేరియట్ భవనం కూడా ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు చేసినట్టు చర్చ. రాత్రి పగలు యుద్ధప్రాతిపదికన శరవేగంగా భవనం పనులు జరుగుతున్నాయి. ఇదే రోజు కేటీఆర్ ను ముఖ్యమంత్రి పట్టాభిషేకం కు రంగం సిద్ధం అయినట్టు చర్చ. సీఎం కేసీఆర్ కొందరు సీనియర్ మంత్రులను సైతం వెంటబెట్టుకొని జాతీయ రాజకీయాల్లో కీలక బాధ్యతలు అప్పగించనున్నట్లు చర్చ. ఖాళీ ఆయన మంత్రి పదవుల్లో కేటీఆర్ నమ్మకమైన వారికి ఐదారు మంత్రిపదవులు కట్ట పెట్టనున్నట్టు చర్చ. రాష్ట్ర రాజకీయాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు జరగనున్నాయి దసరా పండుగ వరకు వేచి చూసే ధోరణిలో వివిధ రాజకీయ పార్టీల నేతలు ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

One thought on “దసరా రోజు యువరాజుకు పట్టాభిషేక మా..?

  1. Dear Editor.
    Good at analysis. Nwe story. Is so many possibilities are there. Once again congratulations.

Comments are closed.