హైదరాబాద్: అనాదిగా వివక్షకు, నిరాదరణకు గురైన ఎస్సీల జీవితాలలో వెలుగులు నింపేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ “దళితబంధు” పథకానికి రూపకల్పన చేసి,ఒక యజ్ఞం మాదిరిగా ముందుకు తీసుకుపోతున్నారని మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.ఈ పథకం తీరుతెన్నులపై మంత్రి హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో సోమవారం సమీక్ష జరిపారు.ఇది అద్భుతమైనది, ఇటువంటి పథకం గురించి మనం గతంలో కనీవిని ఎరుగం అని,దీనికి రూపకల్పన చేసి విజయవంతంగా అమలు చేస్తున్న కేసీఆర్ గొప్ప పాలనాదక్షులన్నారు.సుమారు రెండు గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రాహూల్ బొజ్జా, ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రాహూల్ బొజ్జా ఇప్పటివరకు 24,046 యూనిట్లు గ్రౌండింగ్ అయ్యాయని,35,642 కుటుంబాలకు లబ్ధి చేకూరిందని, ఇందుకు రూ.3,048 కోట్లు ఖర్చయ్యాయని మంత్రికి చెప్పారు.వీటిలో హూజూరాబాద్ నియోజకవర్గంలో 11,647,ఆలేరు నియోజకవర్గానికి చెందిన వాసాలమర్రిలో 71,చింతకాని,తిర్మలగిరి,చారగొండ, నిజాంసాగర్ మండలాలలో 6,685,అన్ని జిల్లాల్లో 8,507 యూనిట్లు, మొత్తంగా 24,046 గ్రౌండింగ్ అయ్యినట్లు తెలిపారు.ఈ పథకం గురించి మరింత అవగాహన కల్పించాలని,లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించే విధంగా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు మంత్రి దిశానిర్దేశం చేశారు.
సమావేశంలో ఎస్సీ కులాల అభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రాహూల్ బొజ్జా,ఎస్సీ కార్పొరేషన్ జనరల్ మేనేజర్ ఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

శుభకార్యంలో…
కరీంనగర్ జిల్లా తెరాస పార్టీ అధ్యక్షులు, సుడా చైర్మన్ G.V రామకృష్ణా రావు సోదరుడు G.V రఘునందన్ రావు-సమత కుమారుని ఉపనయనామ్ మహోత్సవ కార్యక్రమం లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. సోమవారం మానకొండూర్ లో జరిగింది. హాజరై చిరంజీవి ని ఆశీర్వదించారు.

క్రీడా మైదానాలు ఏర్పాటు చేస్తాం. చిట్టి బాబు !
ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా క్రీడాకారుల సౌకర్యం కోసం క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఎంపిపి ఎడ్ల చిట్టిబాబు అన్నారు, మండలంలోని పెద్ద నక్కలపేట, దుబ్బల గూడెం, రాజారం గ్రామాలలో ఏర్పాటు చేస్తున్న క్రీడా మైదానం పనుల పురోగతులను పరిశీలించారు..ఈ కార్యక్రమములో జడ్పిటిసి బత్తిని అరుణ ,DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ,రైతు బంధు అధ్యక్షులు , సౌల్ల భీమయ్య మండల ప్రత్యేకాధికారి (జిల్లా పంచాయితి అధికారి) ఇ.హరికిషన్ ,DLPO కనక దుర్గ ,MPDO ప్రవీణ్ కుమార్ ,MPO నరేష్ కుమార్ ,గ్రామాల సర్పంచ్ లు లు, పంచాయితి కార్యదర్శులు, ,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

ఓట్లలో తేడాపై అడ్లూరి లక్ష్మణ్ కోర్టు కెళ్లాడు
కోర్టు గుర్తించి ఈవీఎంలు భద్రపర్చింది_
ధర్మపురి అసెంబ్లీకి 2018 లో జరిగిన ఎన్నికలో పోలైన ఓట్లు, లెక్కించిన ఓట్లలోని తేడాపై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కోర్టు కెళ్లాడని, జనం ఓడిస్తే ఒప్పుకొనే వారమని ధర్మపురి కాంగ్రెస్ నాయకులు అన్నారు. సోమవారం జగిత్యాల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ధర్మపురి బ్లాక్ కాంగ్రెస్ అద్యక్షులు కుంట సుధాకర్, వెల్గటూర్ మండల కాంగ్రెస్ అద్యక్షులు, తాటిపర్తి శైలేందర్ రెడ్డి, జగిత్యాల యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ , వేముల రాజు లు మాట్లాడారు. పోలైన ఓట్లు, కౌంటింగ్ చేసిన ఓట్ల మధ్యలో తేడా ఉన్నాయని పోలైన వాటికంటే. ఐదు వందల ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ,జరిగిన అన్యాయానికి కోర్టును అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆశ్రయించాడన్నారు. ఎన్నిక జరిగి మూడేండ్లు అవుతున్నా మంత్రి కొప్పుల ఈశ్వర్ ఎందుకు రీ కౌంటింగ్ కు ఒప్పుకోవడం లేదని, ఇందులో మర్మమేమిటి ? అని కాంగ్రెస్ నాయకులు ప్రశ్నించారు. ఒక్కసారి కోర్టుకైనా, ప్రజల కైనా, చెప్తే బాగుంటుందని ఆ ఫలితాల్లో ఓటమి చెందితే ప్రజలు ఓడించారని, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ భవిష్యత్తు కార్యక్రమానికి సిద్ధమవుతారని వారన్నారు. అలాకాకుండా కాలయాపన చేస్తుండడంతోనే ఆవేదనతో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడారన్నారు. మంత్రి కొప్పుల ఈశ్వర్ పైగానీ, తెరాసపై అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కు గాని మాకైనా ఎలాంటి వ్యక్తిగత వ్యతిరేకత లేదన్నారు. కానీ ఎస్సి కార్పొరేషన్ చైర్మన్ గా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అవినీతికి పాల్పడ్డట్లు తెరాస నాయకులు ప్రెస్ మీట్ లో మాట్లాడడం బాధాకరమని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ధర్మపురి కౌంటింగ్ లో మొదటి పది రౌండ్లలో అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మూడువేల మెజారిటీతో ఉన్నాడని మిగతా మూడు రౌండ్ల కౌంటింగ్ సమయానికి ఈవియం లు మొరయించాయని అధికారులు గంటన్నర పాటు కాలయాపన చేశారని చెప్పారు. కానీ కల్వకుంట్ల కవిత కనుసైగల్లో ఇక్కడి అధికారులు తారుమారు చేశారని అప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా తెరాస మెజారిటీ సీట్లను గెలవడంతో ఇక్కడి అధికారులు అన్ని తారుమారు చేసి కొప్పుల ఈశ్వర్ కు మూడువేల ఓట్ల మెజారిటీని తెచ్చి 4 వందల ఓట్ల మెజారిటీతో గెలిచినట్లు ప్రకటించారన్నారు. అడ్లూరి అవినీతి ఆరోపనలంటూ డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి మాట్లాడడం విడ్డురంగా ఉందని ధర్మపురి పట్టణంలో ఒక దాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయలేని వ్యక్తి కుంటి సాకులతో తప్పించుకోవడంతోనే అర్థము అవుతుందన్నారు. వ్యక్తిగత ఆరోపణలకు దిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన గట్టి బుద్ధి చెపుతామని హెచ్చరించారు. కొప్పుల ఈశ్వర్ ఎన్నిక నిజాయితీగా జరిగితే రి కౌంటింగ్ కు ఒప్పుకోవాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో బుగ్గారం, పెగడపెళ్లి మండలాల కాంగ్రెస్ అద్యక్షులు వేముల సుభాష్, బుర్ర రాములు, యువజన కాంగ్రెస్ అద్యక్షులు సింహారాజు ప్రసాద్, చిలుముల లక్ష్మణ్, ఎంపిటిసి లక్ష్మణ్, సర్పంచులు
చిర్ర గంగాధర్, ఆరెల్లి లక్ష్మణ్, పూసల తిరుపతి, పెగడపెళ్లి మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తడగొండ రాజు, చెవులమద్ది శ్రీనివాస్, సురకంటి సత్యనారాయణ రెడ్డి, పురుషోత్తం, అనిల్ కుమార్, లైశెట్టి శ్రీను, వెంకటస్వామి, మన్నే జితేందర్, శ్రీనివాస్, శంకర్, సత్యంరావ్ లు ఉన్నారు.