ధర్మపురి క్షేత్ర అభివృద్ధి మహర్దశ !
₹ 1.7 కోట్ల పనుల టెండర్ ప్రకటనకు తీర్మానం!


J. Surender Kumar,
ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మి నరసింహ స్వామి ఆలయ అనుబంధ ఆలయాల అభివృద్ధికి చింతామణి చెరువు సుందరీకరణ తదితర పనులకు ₹.1 కోటి 7 లక్షల పనుల టెండర్ ప్రకటనకు తీర్మానించారు.


కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ పర్యవేక్షణలో  ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు ఇందారాపు రామయ్య, గంధ పద్మ, అక్కనపల్లి సురేందర్ , చుక్క రవి,  రమాదేవి గునిశెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, సంఘం సురేష్,  తదితరులు బుధవారం ఆలయంలో సమావేశమై అభివృద్ధి పనుల సమీక్ష పర్యవేక్షణ కోట్లాది రూపాయల నిధులతో చేపట్టే పనులకు టెండర్ ప్రకటన జారీ చేయుటకు తీర్మానించారు.

పనుల వివరాలు ఇలా ఉన్నాయి. చింతామణి చెరువులో వరహ మూర్తి విగ్రహ నిర్మాణం కోసం ₹ 50 లక్షలు, ఇసుక స్తంభం ( సత్యవతి గుడి పునర్నిర్మాణం ) పనులకు ₹ 20 లక్షలు, నంది విగ్రహం వద్ద ఆర్చ్ నిర్మాణంకు ₹ 10 లక్షలు, పుట్ట బంగారం స్థలం అభివృద్ధి కోసం ₹ 15 లక్షలు, నాగమయ్య ఆలయ పునర్నిర్మాణం కోసం ₹ 12 లక్షలు,  దాతల విరాళంతో శివాలయం గర్భాలయంలో వెండి పందిరి నిర్మాణం, కళ్యాణ మండపం, శివాలయ ప్రాంగణంలో గణపతి ఆలయంలో, నవగ్రహాల ఆలయంలో, గ్రానైట్ రాతి పరచడం, ఆధునీకరణ పనుల పై సమీక్ష జరిపారు. శివాలయ ప్రాంగణంలో అదనంగా మరో నాలుగు సీసీ కెమెరాల ఏర్పాటుకు తీర్మానించారు.
నెలరోజులపాటు భక్తుల వసతి గృహాలు మూసివేత !
బస్టాండ్ సమీపంలో 30 గదులు భక్తుల వసతి గృహాన్ని నెల రోజులపాటు మూసివేస్తున్నట్టు సమావేశంలో తీర్మానించారు. వాటిపై భక్తుల సౌకర్యార్థం అదనంగా గదుల నిర్మాణ పనులు జరుగుతున్నందున వాటర్ ట్యాంక్ తొలగించి నూతన వాటర్ ట్యాంక్ నిర్మాణం, పైప్ లైన్ లు డ్రైనేజీ, తదితర మరమ్మతులు ఏర్పాటు నేపథ్యం, దీనికితోడు ఆషాడమాసంలో భక్తుల తాకిడి తక్కువగా ఉంటుందని. మూసివేత  నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటనలో పేర్కొన్నారు. దీనికితోడు ఆలయం ప్రాంగణంలో పడమర వైపు గల ద్వారాన్ని మూసివేయడానికి తీర్మానించారు.


ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ దంపతుల పూజలు !
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ దంపతులు బుధవారం ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామినీ దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం సాదరంగ స్వాగతం పలికి పూజల చేసిన అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామన్న ,కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ శేషవస్త్ర ప్రసాదం చిత్రపటం బహూకరించారు.
ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం రెనవేషన్ కమిటి సభ్యులు


అక్కనపల్లి సురేందర్ , సంగం సురేష్ , చుక్క రవి,గునిశెట్టి రవీందర్, పల్లెర్ల సురేందర్, ఇనగంటి రమ,గందె పద్మ , మున్సిపల్ చైర్మన్ సంగి సత్తెమ్మ, వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ఉప ప్రధాన అర్చకులు నేరెళ్ల శ్రీనివాసాచార్యులు , ముఖ్య అర్చకులు రమణయ్య, తదితరులు పాల్గొన్నారు.

ధర్మపురిలో పట్టపగలు చోరీ!
పోలీసులు ఏరి మరి ?


ధర్మపురి పట్టణంలోని పట్టపగలు  చోరీ జరిగింది. ఇద్దరు ఉపాధ్యాయులను దంపతులు  9 గంటలకు ఇంటికి తాళంవేసి పాఠశాలకు వెళ్లారు. మధ్యాహ్నం భోజనం ఇంటికి రాగానే  ఇంటిలో చోరీ జరిగిన విషయం గుర్తించి పోలీసులు సమాచారం ఇచ్చారు. దాదాపు 25 తులాల బంగారు ఆభరణాలు, వేలాది రూపాయల నగదు దొంగలు ఎత్తుకెళ్లారు అని బాధిత బంధువులు  ఆవేదనవ్యక్తం చేస్తున్నారు. ఎస్సై కిరణ్ కుమార్ పోలీసు బలగాలు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని ఉపాధ్యాయుడు కిషోర్ నుంచి వివరాలను అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు క్లూస్ టీం సమాచారం ఇచ్చారు. తాళం డూప్లికేట్ కీ తో తెరిచి  ఇంట్లోకి చొరబడి బంగారం నగలు ఎత్తుకెళ్లి యధావిధిగా తాళం వేశారు ఉపాధ్యాయడు, కిషోర్ పగలు భోజనం చేయడానికి ఇంటికి వచ్చి తాళం తీయడానికి ప్రయత్నించగా హార్డ్ గా వచ్చిందని, అతి కష్టం మీద కాలం తీయడంతో లోపల బీరువా ,బట్టలు , చిందర వందరగా ఉన్నాయని  బీరువా తెరిచి ఉండడంతో ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చారు.. చోరీ జరిగిన కీర్తనల పట్ల. వాడకట్టుపై అవగాహన కలిగి ఉండి  యజమానుల కదలికల పై  రిక్కీ నిర్వహించి చోరీ పాల్పడినట్టు పలువురు చర్చించుకుంటున్నారు


పోలీసులు ఎక్కడ మరి ?

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి నిత్యం వేలాది మంది భక్తజనం కిటకిటలాడుతోంది. నైట్ పెట్రోలింగ్ బృందాలు, బ్లూ కోర్టు, నిరంతరం పర్యవేక్షణ చేస్తుంటారు. 20 మందికి పైగా కానిస్టేబుల్లు, నాలుగుగురు హెడ్ కానిస్టేబుల్ లు, ఇద్దరు ఎ.ఏస్ఐలు, పలువురు హోంగార్డులు స్టేషన్ పరిధిలో విధులు నిర్వహించాల్సి ఉంటుంది.  నిత్యం వీఐపీల తాకిడి, గోదావరి తీరంలో భక్తుల సందడి, ట్రాఫిక్ సమస్యలు, ఇద్దరు రైటర్లు, కోర్టు కానిస్టేబుల్, సెంట్రీ సిఐ,ఎస్ఐలకు , అంగరక్షకులు  కాగా ఈ క్షేత్రస్థాయిలో శాంతిభద్రత పరిరక్షణ, పర్యవేక్షణ తదితర అంశాలలో పోలీసులు క్షణం తీరిక లేకుండా విధులు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు దాదా పదిహేను గ్రామాల్లో శాంతిభద్రతలు కూడా పోలీస్ స్టేషన్ పోలీస్ యంత్రాంగం పర్యవేక్షించాల్సిన ఉంటుంది. ఈ నేపథ్యంలో అదనంగా పోలీస్ ఫోర్స్ లు శాశ్వత ప్రాతిపదికన కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు.


దోనూర్ లోకాపర్ వైరు దొంగతనం !
ధరంపురి పోలీస్ స్టేషన్ పరిధి దోనూరులో బుధవారం తెల్లవారుజామున 25 కే.వి విద్యుత్ ట్రాన్స్ఫారంలో కాపర్ వైర్ ఆయిల్ దొంగతనం జరిగిన ఉదాంతం వెలుగు చూసింది.  దోనూర్ బీర్పూర్ గ్రామం మధ్య సిరిపురం విద్యుత్ ఫీడర్ , రైతుల పంట పొలాలకు లో ఓల్టేజీ ప్రాబ్లం ఉండడంతో ఎనిమిది మంది రైతులు నిబంధన మేరకు ట్రాన్స్ఫర్ ను కొనుగోలు చేశారు.

వ్యవసాయ పంపు విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో వారు ట్రాన్స్ఫారం దగ్గరికి రావడం గద్య పైనుంచి కిందికి దించి అందులో కాపర్ వైర్లెత్తి కలిగినట్లు గుర్తించిన విద్యుత్ శాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు.  దీనికి తోడు ఈ ప్రాంతంలో. గత నెలరోజుల్లో నాలుగు సార్లు ,విద్యుత్ స్తంభా జంపర్ వైర్లను, ఎత్తుకెళ్లినట్టు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


విద్యార్థినికి అభినందనలు!
జగిత్యాల జిల్లా PRTUTS పక్షాన. ఇంటర్లో అత్యధిక మార్పు సాధించి స్టేట్ మొదటి స్థానం సాధించిన PRTUTS సారంగపూర్ మండల ప్రధాన కార్యదర్శి సంగ శ్రీధర్  కుమార్తె సంగ విగ్నేత ,ఇంటర్మీడియట్ ఫలితాల్లో 467/470మార్కులతో స్టేట్ 1st ర్యాంక్ సాధించిన సందర్భంలో,   సంగ విగ్నేతకు శుభాకాంక్షలు తెలిపి సన్మానం చేసిన  మిఠాయి తినిపించి భవిష్యత్తులో ఉన్నత ర్యాంకులు మొదటి విజయం సాధించాలని వారు చిన్నారి ని ఆశీర్వదించారు.

ఘనంగా విద్యార్థి దత్తత కార్యక్రమం
₹ 5 లక్షలు విలువ గల.650. బ్యాగుల పంపిణీ!
ఉపాధ్యాయులను అభినందించిన డి ఈ ఓ !


. బుధవారం ధర్మపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలికలు) లో విద్యార్థి దత్తత కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మపురి, బుగ్గారం మండలాల లోని 23 పాఠశాలలు బీర్పూర్ ,ఎండపల్లి పాఠశాలలకు  చెందిన 650 మంది పేద విద్యార్థులకు ₹ 5 లక్షలు విలువగల.650 ,ఎడ్యుకేషన్ కిట్లని ,పంపిణీ చేశారు. ఒక్కో కిట్టు ధర ₹750/- ఉంటుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  జిల్లా విద్యాధికారి  డా. జగన్మోహన్ రెడ్డి, విశిష్ట అతిథిగా, మండల విద్యాధికారి బత్తుల భూమయ్య, ప్రత్యేక ఆహ్వానితులుగా ధర్మపురి లైన్స్ క్లబ్ అధ్యక్షుడు డా. ఇందారపు రామకృష్ణ పాల్గొన్నారు.. 

ఈ సందర్భంగా జిల్లా విద్యాధికారి డాక్టర్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, నిర్వాహకులు దాతల నుంచి విరాళాలు సేకరించి ప్రభుత్వ పాఠశాలలో పేద విద్యార్థులకు అందించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమానికి పాఠశాల ప్రధానోపాధ్యాయులు చెరుకు రాజన్న, అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, దాతలు, గ్రామస్థులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.


ఈ సందర్భంగ సహకారం అందించిన దాతలకు, వివిధ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు, మా పాఠశాల HM  చెరుకు రాజన్న కు కార్యక్రమ విజయంలో తోడ్పాటునందించిన మా  స్టాఫ్ కు ,మిత్రులకు, నిర్వాహకులు ఉపాధ్యాయుడు గొల్లపల్లి గణేష్ కృతజ్ఞతలు తెలిపారు.


విద్యార్థులను అభినందించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్ !

జగిత్యాల శ్రీచైతన్య  జూనియర్ కళాశాల విద్యార్థులను అభినందించిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్
ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలలో జగిత్యాలలోని శ్రీచైతన్య జూనియర్ కళాశాలకు చెందిన
సంగ విజ్ఞత  467/470,  కట్లకుంట శ్రీనిక  467/470
గట్ల ప్రియాంక  467/470, సిరిపురం అపరాజిత467/470,
మరిపెల్లి నాగమల్లికా 467/470 మార్కులతో
1st Yr MPC విభాగంలో స్టేట్ మొదటి స్థానంలో నిలవగా,
మరియు 1st Yr CEC లో అల్లకొండ సుకన్య  494/500 మార్కులు రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకు,1st Yr BIPC విభాగంలో రాచర్ల వైష్ణవి  435/440  రాష్ట్ర మూడవ ర్యాంకు లో 2nd yr MPC విభాగంలో రౌతు శ్రీయ 992/1000 మార్కులు, 2nd yr BIPC విభాగంలో  తుమ్మ అక్షిత 986/1000  జగిత్యాల జీల్లా విద్యార్థులు రాష్ట్ర స్థాయిలొ ఉత్తమ మార్కులు సాధించిన సందర్భంగా విద్యార్థుందరికీ పుష్ప గుచ్చాం అందజేసి శుభా కాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీచైతన్య   విద్యాసంస్థల చైర్మన్  ముసిపట్ల రాజేందర్  ,కళాశాల డైరెక్టర్ మల్లేశం గౌడ్, అధ్యాపక బృందం,తదితరులు పాల్గొన్నారు.


మైనారిటీ కాలేజీలో..
తెలంగాణ మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు బైపిసి మొదటి సంవత్సరం లో స్టేట్ 2వ ర్యాంక్(436/440),నీదా ఫర్హీం 5వ ర్యాంక్(431),ఎంపీసీ లో ఎస్ హారిక స్టేట్ 3వ ర్యాంక్(465/470),సాధించిన సందర్భంగా వారిని  జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, అభినందించి, శాలువా తో సన్మానించారు.
ఈ కార్యక్రమం లో RLC సయ్యద్ హమీద్, ప్రిన్సిపల్ సుచిత్ర, అధ్యాపకులు  సంధ్య, స్వాతి తదితరులు పాల్గొన్నారు.


కన్నయ్యకు నివాళి!
రాజస్థాన్ లో  ఉగ్రవాద చేతిలో హత్య కి గురుయిన హిందూ బిడ్డ కన్నాయ లాల్ కి ధర్మపురి హిందూ యువత ఆధ్వర్యం లో  స్థానిక నంది చౌక్ వద్ద  కొవ్వొత్తులతో నివాళులు  అర్పించారు

.