J. Surender Kumar,
పుణ్యక్షేత్రమైన ధర్మపురి కి కేంద్ర మంత్రులు రాక జాతర మొదలు కానున్నది. జులై 9, 10 వ, తేదీలలో రెండు రోజులపాటు, సమావేశాలు , చర్చాగోష్టి, చివరి రోజున భారీ బహిరంగ సభ ఏర్పాటుకు బీజేపీ శ్రేణులు రంగం సిద్ధం చేస్తున్నారు.
కేంద్ర మంత్రులు ప్రహ్లాద్ సింగ్ పటేల్, గజేంద్ర సింగ్ షెకావత్, అర్జున్ రానా మేఘ వాల్, కిషన్ రెడ్డి , జాతీయ, రాష్ట్ర నాయకులు ధర్మపురి క్షేత్రానికి రానున్నారు.

తెలంగాణ రాష్ట్రంపై కాషాయ జెండా ఎగరవేయడానికి బిజెపి పార్టీ కేంద్ర అధిష్టానం, పకడ్బందీ ప్రణాళికను సిద్ధం చేసి అమలుకు శ్రీకారం చుడుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగ’ గోదావరి హారతి కి ‘ పది సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో, రెండు రోజుల పాట ఉత్సవాల నిర్వహణ కై గోదావరి హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు, జాతీయ నాయకులు, మురళీధర్ రావు ఈ మేరకు కార్యక్రమానికి రూపకల్పన చేశారు. బాసర క్షేత్రం, నుంచి భద్రాచలం వరకు, బిజెపి, ఆర్ఎస్ఎస్, విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్, నాయకులు, కార్యకర్తలు, రానున్నారు.
గోదావరి హారతి ఉత్సవాలు !

2012 సంవత్సరం, కేంద్ర, రాష్ట్ర లలో యూపీఏ ప్రభుత్వంలో బిజెపి జాతీయ నాయకుడు. పొలసాని మురళీధరరావు, ధర్మపురి క్షేత్రంలో గోదావరి నది హారతి ఉత్సవానికి శ్రీకారం చుట్టారు. వ్యవస్థాపక అధ్యక్షుడిగా కొనసాగుతూ, గత పది సంవత్సరాలుగా ‘ గోదావరి నది హారతి’ కార్యక్రమాలు లక్షలాది రూపాయలు ఖర్చు చేస్తూ నిర్వహిస్తున్నారు. మొదటిసారి కేంద్ర మాజీ మంత్రి ఉమా భారతి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ప్రతి సంవత్సరం గోదావరి నది హారతి కి, పీఠాధిపతులు, సాధుపుంగవులను, నిర్వాహకులు ఆహ్వానిస్తున్నారు. 2015-16 లో ప్రస్తుత ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్. గోరక్ పూర్ పార్లమెంటు సభ్యుడి హోదాలో ధర్మపురి క్షేత్రంలో గోదావరి హారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. 2022 నవంబర్ మాసం (కార్తీక మాసం)లో జరగనున్న హారతి కార్యక్రమానికి పది సంవత్సరాలు పూర్తి కానున్నాయి.

ఈ నేపథ్యంలో గోదావరి నది విశిష్టత, నదుల అనుసంధానం ,పవిత్రత, పరిశుభ్రత, తదితర అంశాలపై జూలై 9.10 తేదీల్లో సెమినార్లు, సమావేశాలు నిర్వహించామన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ,ఎంపీ బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు, బండి సంజయ్ రెండు రోజులపాటు ఇక్కడే మకాం వేయడం, వారి మార్గ నిర్దేశకత్వంలో భారీ ఎత్తున బహిరంగ సభ ఏర్పాటు కు కసరత్తు చేస్తున్నట్టు సమాచారం.

గోదావరి హారతి వ్యవస్థాపక అధ్యక్షుడు మురళీధర్ రావు, కన్వీనర్ లింగంపల్లి వీర గోపాల్, కో కన్వీనర్ డి రామ్ సుధాకర్ రావు, తదితర నాయకులు బుధవారం ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ధర్మపురి క్షేత్రానికి రావలసిందిగా ఆహ్వాన లేఖలు అందించారు.

కేంద్ర మంత్రులు సానుకూలంగా స్పందించడంతో పాటు, గోదావరి నది హారతి కార్యక్రమాలపట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, తెలంగాణలో . మన పార్టీ అధికారం హస్తగతం చేసుకోవడం కోసం నాయకులు కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాల్సిన అవసరం గురించి , రాష్ట్ర ప్రభుత్వ పని తీరు, అవినీతి పాలన పై మురళీధర్ రావు కేంద్ర మంత్రులకు వివరించినట్టు సమాచారం.. కేంద్ర మంత్రుల పర్యటన కేంద్ర రాష్ట్ర అధికార యంత్రాంగం అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.
