జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ని సోమవారం ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ (IJU) జాతీయ అధ్యక్షులు కె శ్రీనివాస్ రెడ్డి దర్శించుకున్నారు. స్వామివారి శేషవస్త్ర ప్రసాదాన్ని ఆలయ చైర్మెన్ ఇందారపు రామన్న అందజేయగా వేద పండితులు మహదాశీర్వచనం చేసారు. ఈసందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధర్మపురి ని సందర్శించడం ఇది రెండవసారి అని అన్నారు.

స్వయంభువుగా వెలసిన స్వామి అనుగ్రహంతో లోక కళ్యాణం జరగాలని అందుకు స్వామి వారి ఆశీస్సులు సమస్త ప్రజానీకానికి అందాలని కోరకుంటున్నట్లు తెలిపారు. .దేవస్థాన అభివృద్ధి లోక కళ్యాణానికి మరింత దోహదపడాలని ఆశించారు.

తదనంతరం
స్ధానిక జర్నలిస్ట్ ల సమస్యలు, జర్నలిస్ట్ లకు ఇండ్ల స్థలాలు, ప్రెస్ క్లబ్ గురించి అడిగి తెల్సుకున్న ఆయన వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వారి వెంట ఐ జేయు జాతీయ కార్యవర్గ సభ్యులు ఏ సురేష్ కుమార్, తెలంగాణ జర్నలిస్ట్ అధ్యక్షులు నాగునూరి శేఖర్ , ప్రధాన కార్యదర్శి విరహత్ అలీ , జగిత్యాల జిల్లా నాయకులు జెస్ కిరణ్ సురెందర్ కుమార్ ,జిల్లా అధ్యక్ష -కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, మోరాపెల్లి ప్రదీప్ కుమార్, ఉపాధ్యక్షులు హరికృష్ణ

ఈ సీ మెంబర్లు బొంగురాల రాజేష్ పటేల్ ,కర్నె సంతోష్ ,వన్నామల అనిల్ కుమార్, ధర్మపురి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు మధు మహదేవ్ శర్మ ధర్మపురి పాత్రికేయులు
ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఈ సి.మెంబర్ వడ్లురి రవి,ధర్మపురి నియోజకవర్గ ఎలెక్ట్రానిక్ మీడియా అధ్యక్షుడు ఉత్తెమ్ పెద్దన్న తదితరులు పాల్గొన్నారు. అనంతరం మహారాష్ట్ర జర్నలిస్ట్ యూనియన్ ఐజేయూ నాయకుడు గుండారపు శ్రీనివాస్ మేనకోడలు పెళ్ళికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ప్రగతి పనులను పరిశీలించిన కలెక్టర్ !

ధర్మపురి మున్సిపాలిటీ లోని నాలుగవ విడుత పట్టణ ప్రగతి పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి రవి పరిశీలించారు.

వెల్గటూర్ మండలం లోని రాజారాం గ్రామంలో, మినీ థియేటరు ,మరియు ప్రాథమిక పాఠశాల పనులను పరిశీలించిన మండలంలోని ఎండపల్లి గ్రామం లో క్రీడ స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.
అంగన్వాడి బడిబాట !

బడి బాటలో భాగంగా మహిళాభివృద్ధి మరియు శిశు సంక్షేమ శాఖ వారు ఈ రోజు నిర్వహించిన ర్యాలీలో మున్సిపల్ చైర్ పర్సన్ సంగీ సత్యమ్మ, ము న్సిపల్ కమిషనర్ రమేష్, కౌన్సిలర్లు కార్తీక్ , సుధాకర్ ,సి డి పి ఓ సంపద కుమారి, అంగన్వాడీ టీచర్లు, మరియు ఆయాలు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గారు మాట్లాడుతూ అందరు తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు బడులకు పంపకుండా అంగన్వాడి బడి కి అదేవిధంగా ప్రభుత్వ బడులకు పంపాలని అక్కడ అన్ని సౌకర్యాలు ఉన్నాయని ఈ సంవత్సరం ఇంగ్లీష్ మీడియం కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపినారు.

మున్సిపల్ కమిషనర్ గారు మాట్లాడుతూ ధర్మపురిలో అంగన్వాడి సెంటర్ లు చాలా బాగా పనిచేస్తున్నాయని అందరు తల్లిదండ్రులు ఈ అవకాశాన్ని వినియోగించుకుని పిల్లలను అంగన్వాడి బడి కి పంపాలని కోరినారు. సిడిపిఓ మాట్లాడుతూ అంగన్వాడి బడిలో ప్రీ స్కూల్ , కార్యక్రమాలు టైం టేబుల్ ప్రకారం గా ఉదయం 9 గంటల నుండి నాలుగు గంటల వరకు జరుగుతాయని ఇందులో రెండున్నర సంవత్సరాలు నిండిన పిల్లల దగ్గర నుండి ఆరు సంవత్సరాల వరకు పిల్లలను చేర్చుకుంటామని తెలిపి ఉన్నారు. ప్రీస్కూల్ కార్యక్రమాలలో భాగంగా పిల్లలకు ఆట పాటలతో కూడిన చదువు నేర్పిస్తా మనీ చదువు ముగిసిన పిల్లలని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు సంసిద్ధులు గా తయారు చేస్తామని తద్వారా పిల్లలకు సాంఘిక అభివృద్ధి మనో వికాస అభివృద్ధి శారీరక అభివృద్ధి మొదలగు నైపుణ్యాలు అభివృద్ధి చెంది వారిలో సంపూర్ణ అభివృద్ధి( ఆల్ రౌండ్ డెవలప్మెంట్) జరుగుతుందని తెలిపినారు. ఉపాధ్యాయులు బండి మహేష్, రాజేశ్వర్, గుండి రమాదేవి తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి భార్య కు కన్నీటి వీడ్కోలు !

మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సతీమణి సుద్దాల లత అనారోగ్యంతో మరణించగా సోమవారం బంధు మిత్రులారా స్వగ్రామం లో కన్నీటి వీడ్కోలు పలికారు. జగిత్యాల జిల్లా అంతర్గం గ్రామంలో లత అంతిమ యాత్ర, దహన సంస్కారాల జరిగాయి. కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ ఛైర్మెన్ రాజేశం గౌడ్ పలువురు ప్రజా ప్రతినిధులు బంధుమిత్రులు పాల్గొన్నారు.

క్రీడా ప్రాంగణాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్
క్రీడలతో మానసిక ఉల్లాసం, ఉత్సాహంతో పాటు శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండటానికి ఎంతో దోహదపడుతుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని 18వ వార్డులో మినీ స్టేడియంలో క్రీడా ప్రాంగణాన్ని, రైతు బజార్ లో పట్టణ ప్రగతి నిధులతో రూ. 15 లక్షలతో నిర్మించిన చేపల మార్కెట్ ను ప్రారంబించారు. అనంతరం రైతు బజార్ లో రూ.10 లక్షల తో సీసీ ఫ్లోర్ నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు.
ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేసిందని, గ్రామీణ క్రీడాకారులను మరింత ప్రోత్సహించడానికి ప్రతి గ్రామంలో క్రీడా ప్రాంగణాలను నిర్మిస్తున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. క్రీడల వల్ల నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవచ్చని అన్నారు. క్రీడల్లో గెలుపు, ఓటములు సహజమని, నేటి ఓటమి, రేపటి విజయానికి నాంది అని అన్నారు. అందుకే చిన్నప్పుడే స్కూల్‌లో ఆటలు ఆడిపించేవారని అన్నారు. ప్రభుత్వం క్రీడాభివృద్ధికి అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు.

ఈకార్యక్రమంలో మున్సిపల్ స్పెషల్ ఆఫీసర్ ఆర్డీవో మాధురి, వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, కౌన్సిలర్ లు చుక్క నవీన్, పద్మసింగ రావు, సమిండ్ల వాణి శ్రీనివాస్,
కోరే గంగమల్లూ, బండారి రజనీ నరేందర్, కూతురు రాజేష్, బద్దం లత జగన్, పిట్ట ధర్మరాజు, కుసరి అనిల్, ముస్కు నారాయణ రెడ్డి, బోడ్ల జగదీష్, అధికారులు ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
పల్లె, ప్రగతితో గ్రామాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి
జెడ్పి చైర్ పర్సన్.!

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం లోని ధట్నూర్ మరియు చిల్వ కోడూరు గ్రామాలలో ఐదో విడత పల్లె ప్రగతి మరియు మన ఊరు మనబడి కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా జడ్పీ చైర్పర్సన్ శ్రీమతి దావ వసంత సురేష్ పాల్గొన్నారు
ఈసందర్భంగా జడ్పీ చైర్పర్సన్ మాట్లాడుతూ:
తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి. అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పేద విద్యార్థుల బంగారు భవిష్యత్తు కోసమే కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని అమలు చేస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ బడుల్లో అన్ని రకాల సదుపాయాలు అందుబాటులోకి వచ్చి మరింత బలోపేతం అవుతాయి. దీంతో మెరుగైన విద్యాబోధన అందుతుంది. తెలంగాణ విద్యార్థులు ప్రపంచంతో పోటీపడాలి అన్నదే ప్రభుత్వ ఆకాంక్ష.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారు. సోమవారం గొల్లపల్లి మండలం చిల్వ కోడూరు గ్రామంలో ప్రారంభించారు. ఓట్ల కోసమో, రాజకీయ లబ్ది కోసమో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టలేదని, పేద విద్యార్థులకు అన్ని వసతులతో కూడిన నాణ్యమైన విద్య అందించాలనే సంకల్పంతో మన ఊరు మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని స్పష్టం చేశారు. ప్రభుత్వం సమకూరుస్తున్న వసతులు, బోధనా వనరులను సద్వినియోగం చేసుకొని విద్యార్థులు చక్కగా చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని హితవు పలికారు. మన ఊరు – మన బడి ఎంతో ప్రాధాన్యతతో కూడుకున్న కార్యక్రమం అని అన్నారు. సమాజ ప్రగతితో పాటు వ్యక్తిగతంగా కూడా ప్రతి ఒక్కరి అభివృద్ధిలో పాఠశాల విద్యనే మూలమని గుర్తు చేశారు. దీనిని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు-మనబడి కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. దాతలు కూడా తోడ్పాటు అందించాలని పిలుపునిచ్చారు. విద్యా వ్యవస్థను సమూలంగా ప్రక్షాళన చేస్తూ, నాణ్యమైన బోధన అందించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు – మన బడి కార్యక్రమం ద్వారా ముందుకెళ్తోందని అన్నారు. ఇప్పటికే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల వారి కోసం ప్రభుత్వం రెసిడెన్షియల్ పాఠశాలలు నెలకొల్పి నాణ్యమైన విద్యను అందిస్తోందన్నారు. ఇదే కోవలో పేద విద్యార్థులు చదువుకునే ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన బోధన అందించి వారి ఉన్నత భవిష్యత్ కు బాటలు వేయాలనే సంకల్పంతో ప్రభుత్వం మన ఊరు-మన బడి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని చెప్పారు.

ఈకార్యక్రమంలో జడ్పీటీసీ గోస్కుల జలందర్ గారు,ఎంపీపీ శంకరయ్య గారు, ప్యాక్స్ జిల్లా ఛైర్మన్ ల ఫోరమ్ అధ్యక్షులు డా.రాజసుమన్ రావ్ గారు,మండల పార్టీ అధ్యక్షుడు బోల్లెం రమేష్ గారు,ప్యాక్స్ ఛైర్మన్ ఛందోలి మాధవ్ రావ్ గారు, వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయపోతు గంగాధర్ గారు,జిల్లా కో ఆప్షన్ అంజాద్ గారు, జిల్లా గ్రంథాలయ డైరెక్టర్ మరాంపెళ్లి బాబు గారు, డైరెక్టర్ లు, సర్పంచ్ లు, ఆకుల పావని నగేష్, కందుకూరి పద్మ రవీందర్, ఎంపీటీసీలు, మహబూబ్, అశోక్, ఉపసర్పంచ్ లు, స్పెషల్ ఆపిసర్ సాయిబాబా గారు, ఎంపీడీఓ జనార్దన్ గారు, meo జమునదేవి గారు, ఉపాధ్యాయులు, sms చైర్మన్ లు, డైరెక్టర్ లు మరియు నాయకులు పాల్గొన్నారు..
ప్రతిష్ట కార్యక్రమంలో…

రాయికల్ మం. రామోజీపేట గ్రామం లో జరుగుతున్న గంగమ్మ ఆలయ విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం.,
పాల్గొన్న జిల్లా బిజేపి అధ్యక్షులు పైడిపల్లి (మోరపల్లి) సత్యనారాయణ రావు, మరియు బిజేపి ఓబీసీ మొర్చా జిల్లా అధ్యక్షుడు కొక్కు గంగాధర్ లు.,
ఈ సందర్భంగా నాయకులు గంగమ్మ ఆలయ ప్రతిష్టలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయ కమిటీ సభ్యులు వారిని శాలువాతో సత్కరించారు.,
ఈ కార్యక్రమంలో రాయికల్ బిజేపి మండల ప్రెసిడెంట్, వేణు రామాజీపేట్ ఎంపీటీసీ ఆకుల మహేష్, గ్రామ అధ్యక్షుడు నాగరాజు మరియు గంగపుత్ర సంఘం కుల సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు
సంతాపం
మాజీ మంత్రి సుద్దాల దేవయ్య సతీమణి లత ఆకస్మిక మృతి వార్త తెలిసిన రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కోప్పుల ఈశ్వర్ వారి మృతి పట్ల తమ ప్రగాఢ సంతాపం తెలిపారు