ధర్మపురి లక్ష్మీ నరసింహస్వామి ఆదాయం 55 లక్షలు !

90 రోజుల కేవలం ఉండి ద్వారా !

ప్రముఖ పుణ్యక్షేత్రమైన ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం హుండీ ఆదాయం కేవలం 90 రోజులలో     25/03/2022 నుంచి.23/06/2022 వరకు. .₹ 55 లక్షల 28,572/-  వచ్చాయి.  మిశ్రమ బంగారము 105 గ్రామములో, మిశ్రమ వెండి దాదాపు 8 కిలోలు 250 గ్రాములు, ఆలయ ప్రాంగణంలో కట్టుదిట్టమైన భద్రత మధ్య దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ పర్యవేక్షణలో  లెక్కింపు కార్యక్రమం జరిగింది.

ఆలయ కార్యనిర్వహణాధికారి సంకటాల శ్రీనివాస్ ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు రామయ్య ఆయన బృందం అర్చకులు వేద పండితులు తదితరులు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. ఆలయ చరిత్ర లో 90 రోజుల్లో హుండీ ద్వారా ఇంత ఆదాయం రావడం ఇదే మొదటిసారి.


శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో..
జగిత్యాల పట్టణం లోని శ్రీ సుబ్రహ్మణ్యస్వామి త్రికుటాలయం సప్తమ వార్షికోత్సవం గురువారం ఘనంగా జరిగిన వల్లీ దేవసేన సమేత సుబ్రమణ్య స్వామి వారి కళ్యాణ మహోత్సవం, దీంతో తో పాటు సుబ్రహ్మణ్య స్వామి వారికి మూల మంత్ర, సహిత గణపతి, రుద్ర హోమం నిర్వహించారు, 

కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆద్యంతం కళ్యాణము చూడముచ్చటగా జరిగినది. కళ్యాణ అనంతరం భక్తులకు ప్రసాదంగా అన్నప్రసాదం అందజేయడం జరిగినది.


సీఎం సహాయనిధి చెక్కు!
బుగ్గారం మండలంలోని  మద్దునూర్ గ్రామానికి చెందిన గొల్లపెల్లి. భూమయ్య కు రు.27500/- ల CMRF చెక్కు ను మండల పరిషత్ అధ్యక్షురాలు భాదినేని రాజమణి – రాజేందర్  అందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తెరాస పార్టీ మండల అధ్యక్షులు, ఎంపీటీసి గాలిపెల్లి.మహేష్ తదితరులు పాల్గొన్నారు.


డాక్టర్ అంబేద్కర్ విగ్రహావిష్కరణ!
జగిత్యాల రూరల్ మండల తాటిపల్లి గ్రామంలో గురువారం భారతరత్న,డా. బి.ఆర్ అంబేద్కర్  విగ్రహాన్ని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ఆవిష్కరించారు. ఈ  కార్యక్రమంలో జెడ్పీ చైర్ పర్సన్ దావా వసంత
ఎంపీపీ రాజేంద్ర ప్రసాద్, సర్పంచులు నడెం రత్నమాల శంకర్, తిరుపతి, సత్తమ్మ గంగారాం, గంగనర్సు రాజన్న, ఎంపీటీసీ శ్రీనివాస్ ,ఉప సర్పంచ్ గణేష్, ,మాజీ కౌన్సిలర్ బాలే శంకర్, పట్టణ ఉపాధ్యక్షులు దుమాల రాజ్ కుమార్, తదితర నాయకులు పాల్గొన్నారు.


నూతన దంపతులకు ఆశీస్సులు!
కరీంనగర్ లో జరిగిన పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామక్రిష్ణారెడ్డి  తమ్ముడి కుమారుడి వివాహం కు మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.   మంత్రి  వెంట నంది మేడారం పిఎసిఎస్ చైర్మన్ ముత్యాల బలరాం రెడ్డి ఉన్నారు.


పెద్దమ్మతల్లి బోనాలు !
జగిత్యాల అర్బన్ మండల మోతే గ్రామంలో పెద్దమ్మ తల్లి బోనాల జాతర కార్యక్రమానికి, జగిత్యాల ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ మహేష్,,మండల పార్టీ అధ్యక్షులు సురేందర్ రావు, రైతు బందు మండల కన్వీనర్ శంకర్,  ఇతరులు పాల్గొన్నారు


ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటన!
జగిత్యాల పట్టణంలోని మంచి నీళ్ళ బావి చౌరస్తా వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి దేవాలయం లో వీరామాత దేవి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం లో పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.


ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి, వ్యక్తిగత సహాయకుడు  ( PA) అమిత్ కుమార్ , నూతన గృహ ప్రవేశ కార్యక్రమంలో  ఎమ్మెల్సీ  పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.  మంచిర్యాల జిల్లా జన్నారం మండలం మందపల్లి గ్రామం లో గత పది రోజుల క్రితం సీనియర్ కాంగ్రెస్ నాయకుడు సుభాష్ రెడ్డి  తల్లి అనారొగ్యంతో మరణించింది.

వారి కుటింబాన్ని MLC .T జీవన్ రెడ్డి   పరామర్శించారు.  ఆయన వెంట. సీనియర్  కాంగ్రెస్  నాయకుడు  గుడిసె జితేందర్ యాదవ్  రేండ్లగూడ MP TC కరుణాకర్ , నాయకులు నరేందర్ తదితరులు పాల్గొన్నారు


ప్లాస్టిక్ వాడకూడదు!.
జగిత్యాల పట్టణంలోని 23వ వార్డ్ లో ఆదాయ అబివృద్ది కోసం SLF ఆధ్వర్యంలో అవగాహన సదస్సులో పాల్గొన్న మున్సిపల్ చైర్పర్సన్ డా.భోగ. శ్రావణిప్రవీణ్.   మాట్లాడుతూ మన పట్టణాన్ని ప్లాస్టిక్ రహిత పట్టణం గా మార్చే బాధ్యత మన అందరి పై ఉన్నది.ప్లాస్టిక్ నిషేదించిబడినది కాబట్టి ప్లాస్టిక్ ఉపయోగించకూడదు అన్నారు..ఇట్టి కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్  జుంబర్తి రాజు కుమార్, శ్రీనిధి మేనేజర్ మారుతి,SLF OB, CO, RP లు, మహిళ సంఘము సభ్యులు పాల్గొన్నారు.


పంచాయతీకి ఖాళీ బీరు సీసాలు అందజేత!
జగిత్యాల జిల్లా కొడిమ్యాల గ్రామ పంచాయతీకి  యువకులు, గ్రామంలో ఖాళీ బీరు సీసాలు సేకరించి పంచాయతీ కార్యదర్శి మహేష్ కు సీసాలు అందజేశారు. ఇటీవల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ఖాళీ బీరు సీసాలు ఆదాయం సమకూర్చుకోవచ్చు నని కామెంట్స్ చేయగా , దీంతో మంత్రి ఎర్రబెల్లి సూచనల మేరకు ఖాళీ బీరు సీసాలు సేకరించే కార్యక్రమం మొదలు పెట్టామని ఖాళీ సీసాలు అమ్మి ఆదాయం సమకూర్చాలని పంచాయతీ కార్యదర్శి అందజేశామని  స్థానిక యువకులు ప్రచార మాధ్యమాల్లో వివరించారు.

జగిత్యాల జిల్లా కోర్టు అవరణలో మొహమ్మద్ సలీం అనే న్యాయవాది పై గురువారం  క్లయింట్ దాడి చేసిన,. ఉదంతంపై జగిత్యాల బార్ అసోసియేషన్ ఆగ్రహం. వ్యక్తం చేసింది. కిటికీ గాజు అద్దాలు పగలగొట్టి దాడి చేయడంతో న్యాయవాది కి రక్త గాయాలయ్యాయి. న్యాయవాది పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సంఘటన కు నిరసనగా రెండు రోజులు విధులు బహిష్కరిస్తూ జిల్లా కోర్టు బార్ అసోసియేషన్ తీర్మానం. చెసింది.