ఫ్యాక్టరీ ఎందుకు మూసేశారు? ఎప్పుడు తెరుస్తారు? మంత్రి గారు!

కాంగ్రెస్ నాయకుడు జువ్వాడి కృష్ణారావు !

కోరుట్ల నియోజకవర్గం ముత్యంపేట లో మీరు మూసి వేసిన చక్కర ఫ్యాక్టరీ ఎప్పుడు తెరుస్తారని ? తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ నాయకులు జువ్వాడి కృష్ణారావు మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ను సూటిగా ప్రశ్నించారు. కేటీఆర్ మెట్టుపల్లి పర్యటన సందర్బంగా ఈరోజు జువ్వాడి కృష్ణారావు స్థానిక పత్రిక విలేకరుల తో మాట్లాడారు. టీఆరెస్ పార్టీ అధికారం లోకి వచ్చిన వంద రోజుల్లో పు ముత్యంపేట చక్కర ఫ్యాక్టరీ ని పూర్తిగా స్వాధీనం చేసుకొని ప్రభుత్వరంగంలో నడిపిస్తమని హామీలు ఇచ్చిఅప్పటి వరకు నడుస్తున్న ఫ్యాక్టరీ ని పూర్తిగా మూసి వేశారని అన్నారు గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఏర్పాటు చేసిన ఈ ఫ్యాక్టరీ ని ఎప్పుడు తిరిగి తెరుస్తారని ప్రశ్నించిన రైతులు, రైతు సంఘాల నాయకులు, కాంగ్రెస్ స్థానిక నాయకుల ను

, అర్దరాత్రి అరెస్ట్ చేసి జిల్లాలో ని వివిధ పోలీస్ స్టేషన్ లలో నిర్బందిoచి హింసించారని ఆరోపించారు. ఒక పోలీస్ స్టేషన్ నుండి ఇంకో పోలీస్ స్టేషన్ కు తిప్పి హింసించడానికి ప్రజలు ఏమైనా సంఘ వ్యతిరేకశక్తులు గా కనపడ్డ రా ? అని కృష్ణారావు మండిపడ్డారు. కనీసం పడుకో వ డానికి కూడా వీలు లేకుండా పోలీస్ లు చేయడం దారుణం అన్నారు. వర్ష కాలం ఆరంభం కావడం తో రైతులు వ్యవసాయపనులు ప్రారంభం చేశారు అని ఇలాంటి సమయం లో రైతులను అక్రమంగా అరెస్ట్ లు చేయడం తో వ్యవసాయపనులు అస్త వ్యస్టo అయ్యాయని అన్నారు కేటీఆర్ గారు మీరు కొత్త పరిశ్రమలు ఏర్పాటు చేసే విషయం ఏమో కానీ మారైతుల కు ఉన్న ఏ కైక వ్యవసాయఆధారిత పరిశ్రమ ఈ చక్కెర పరిశ్రమ అని దీన్ని ఎప్పుడు తెరుస్తారోచెప్పి మెట్టుపల్లి పర్యటన కు రావాలని అడిగిన వారిని అక్రమంగా అరెస్ట్ చేసి ఓటేసి గెలిపించిన ప్రజల కు మీరెలాo టి వారో నిరూపించు కున్నారని కృష్ణారావు అన్నారు రైతులజీవనాన్ని అస్త వ్యస్టo చేసిన మంత్రి కేటీఆర్ పర్యటన అని కోరుట్ల నియోజకవర్గచరిత్ర లో ఈరోజు ఓకదు ర్థి నంగా నిలిచి పోతుంది అని అన్నారు కోరుట్ల లో ఇల్లు లేని నిరుపేదలు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకుంటే ఇప్పటిదాకా మంజూరు ఇవ్వకపోగా ప్రశ్నిస్తారు అనే భయం స్థానిక కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలను కూడా అక్రమంగా అరెస్ట్ చేసి స్థానిక పోలీస్ స్టేషన్ లో నిర్భo దించ రు అని అన్నారు కోరుట్ల పట్టణం లో 100పడకల ఆసుపత్రి ని సంవత్సరo లోపు నిర్మాణం చేస్తాం అని 2018లో హామీఇచ్చిన కేటీఆర్ ఇప్పటి వరకు ఎందుకు నిర్మాణం చేయలేదో నియోజకవర్గం ప్రజలకుఈరోజు పర్యటన లో చెప్పి ప్రజలను క్షమాపణ లు కోరాలి అని కృష్ణారావు అన్నారు రైస్ మిల్లర్లు రైతులవద్ద ధాన్యం కొనుగోలు సమయం లో క్విటాలు కు 8నుండి 10కిలోలు తరుగు పేరుతో మోసం చేస్తున్నారని దీని పైఇప్పటికి ఎందుకు చర్యలు తీసుకో వడం లేదని జువ్వాడి కృష్ణారావు నిలదీశారు టీఆరెస్ పాలకులకు ప్రజలే శిక్ష వేసే రోజులు త్వరలో నే వస్తాయని జువ్వాడి కృష్ణారావు అన్నారు


రాముడు విగ్రహావిష్కరణ !


జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గంలోని మెట్‌పల్లి మండలం బండలింగాపూర్ గండి హనుమాన్ ఆలయ ఆవరణలో స్థానిక ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు ఏర్పాటు చేసిన 56 అడుగుల కోదండరాముడి భారీ విగ్రహాన్ని ఐటీ&పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ ,సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,జెడ్పీ చైర్మన్ శ్రీమతి దావ వసంత సురేష్ లతో కలిసి కేటీఆర్ ఆవిష్కరించారు.

మోడీ ప్రభుత్వం రైతు సంక్షేమానికి భరోసా!

జగిత్యాల మండలం పొలాస గ్రామం లో పోలింగ్ బూత్ నెంబర్ 117 &119 లలో బిజెపి జిల్లా అధ్యక్షులు మోరపల్లి సత్యనారాయణ రావు ఆద్వర్యం లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ 8 సంవత్సరాల పాలనలో ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, చేసిన సంస్కరణల గురించి సేవా, సుపరిపాలన,గరీబ్ కళ్యాణ్, కరపత్రం గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజలకు తెలియజేసి కరపత్రాలు అందజేశారు.,
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు నలువాల తిరుపతి, చేనేత సెల్ జిల్లా కన్వీనర్ కోక్కల గణేష్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి కుర్మా రమేష్ ,మండల కార్యదర్శి మెల్ల దామోదర్, బీజేవైఎం మండల ఉపాధ్యక్షులు కుర్మా రాజు, శక్తి కేంద్రం ఇంచార్జి ఓలాల రాజశేఖర్ ,మండల నాయకులు గడ్డి మల్లయ్య, గూడూరి రాజేశం ,రాజశేఖర్, గడ్డి తిరుపతి మనోహర్ , పోలింగ్ బూత్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

ఎంత అణచివేస్తే అంతకు గట్టిగా పోరాటం చేస్తాం !

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పతనం అంచున ఉన్నది అని అభ్యుదయ యువ రైతు, రైతు సంఘాల రాష్ట్ర నాయకులు &.డిఫిట్MLA జర్నలిస్ట్ విక్రమ్ రెడ్డి వేముల అన్నారు.
శుక్రవారం ఆయన మాట్లాడుతూ అన్ని వర్గాల విశ్వాసం కోల్పోయి పతనం అంచున ఉన్నదని అది గుర్తు ఎరుగక తిరుగు లేదని మేకపోతు గాంబిర్యం ప్రదర్శితుండటం మరోవయిపు ప్రభుత్వo ప్రశ్నిoచే వారిని చూస్తూ నిద్రలో కూడా వణుకుతున్నది అని అన్నారు. అందుకు నిదర్శనం అర్థరాత్రి అన్నదాత గోసల గోడు విపుతున్న నాయకులను అక్రమ అరెస్ట్ చేయడం అని చెప్పకనే చెప్పవచ్చు. ,ప్రభుత్వంలోపాలు సరిచేసుకోకుండా ఎత్తిచూపుతున్న వారిని అణచివేయడం దారుణం అని ఆరోపించారు. ఆనాడు నక్సాలెట్ల కోసం పోలీసులు అర్ధరాత్రి తిరిగే వారని , ఈనాడు అన్నదాత నాయకులను అక్రమ అరెస్టు చేయడానికి అర్ధరాత్రి తిరుగవలసివస్తుందని , ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు ఇలాంటి బెదిరింపులకు బెదిరేది లేదని మరింత గట్టిగా ప్రభుత్వం పై పోరాటం చేస్తామని హెచ్చరించారు ఇప్పటికయినా ప్రభుత్వం వైఖరి మార్చుకోవాలని హితువుపలికారు.
గురువారం రాత్రి అర్ధ రాత్రి12లకు ధర్మపురి పోలీసులు తనను అరెస్టు చేయడం దారుణం అన్నారు.