J. Surender Kumar,
పార్లమెంట్ సభ్యులు కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో , బిజెపి రాష్ట్ర నాయకులు ఆదివారం చర్చలు జరిపారు. హైదరాబాదులో ప్రముఖ హోటల్లో దాదాపు మూడు గంటల పాటు ముగ్గురి మధ్య చర్చలు కొనసాగినట్లు సమాచారం. బిజెపి పార్టీలోకి ఆయన తో పాటు అనుచరవర్గం ఆహ్వానించడానికి వీరి మధ్య చర్చ జరిగినట్లు సమాచారం. వెంకట్ రెడ్డి తన క్లాస్ మెంట్. స్నేహితుడు అని బిజెపి రాష్ట్ర నాయకుడు, దామెర రామ సుధాకర్ రావు. వివరించారు.

కాకతాళీయంగా హోటల్లో కలిసాము వ్యాపారం, రాజకీయాలపై ,చర్చించిన మాట వాస్తవమే ,కానీ బీజేపీ లో చేర్పించడానికి కేంద్ర ,రాష్ట్ర నాయకత్వం చూసుకుంటారు అని రామ్ సుధాకర్ రావు స్పష్టం చేశారు.

సీఎం కేసీఆర్‌తో ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ .,
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల వైపు దృష్టి పెట్టిన నేపథ్యంలో ఉండవల్లితో భేటీ కావడం తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపుతోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ భేటీ అయ్యారు., కొత్త జాతీయ రాజకీయ పార్టీ ఏర్పాటుకు కెసిఆర్ శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. భారత్ రాష్ట్రీయ సమితి పేరు వైపు ఆయన మొగ్గు చూపుతున్నట్లు, త్వరలోనే ఈ పేరును రిజిస్టర్ చేయించనున్నట్లు తెలిసింది. కొత్త పార్టీని ఈనెలాఖరులో కెసిఆర్ ఢిల్లీలో ప్రకటించే వీలుంది. కారు గుర్తును సైతం అడిగే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. కొత్త జాతీయ ప్రత్యామ్నాయం, రాష్ట్రపతి ఎన్నికలు, శాసనసభ వర్షాకాల సమావేశాలు, తాజా రాజకీయ పరిణామాలపై ముఖ్యమంత్రి శుక్రవారం అత్యవసర సమావేశాన్ని నిర్వహించారు. ఈ భేటీలో చూచాయగా టిఆర్ఎస్ గురించి కెసిఆర్ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ నెల 19న జరిగే టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని ఆయన పేర్కొన్నట్లు సమాచారం. మంత్రులు సైతం కేసీఆర్ అభిప్రాయంతో ఏకీభవించినట్లు తెలిసింది. కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు తర్వాత తాను ముఖ్యమంత్రిగానే ఉంటూ దేశం కోసం పని చేస్తానని సీఎం చెప్పినట్లు సమాచారం. ఢిల్లీ మాదిరి హైదరాబాద్ ఇకపై జాతీయ రాజకీయాలను అడ్డాగా మారుతుందని ఆయన అన్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. టిఆర్ఎస్ జాతీయ పార్టీగా ప్రకటించే ప్రతిపాదన వచ్చినా.. అలా కాకుండా కొత్త పార్టీని స్థాపించాల్సిన అవసరం ఉందని కేసీఆర్ పేర్కొన్నట్లు సమాచారం. ఈ సందర్భంగా కొత్త పార్టీకి జై భారత్, నయా భారత్, భారత రాష్ట్రీయ తనిఖీ తదితర పేర్లు ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది., పేరు, జెండా తదితర అంశాలపై మంత్రుల అభిప్రాయాలను సిఎం కోరినట్లు సమాచారం. మరో పక్క తమిళనాడు, బెంగాల్లో తరహాలో తెలంగాణలోనూ గవర్నర్ను విశ్వవిద్యాలయాల కులపతి పదవి నుంచి తొలగించి ఆ స్థానంలో ముఖ్యమంత్రికి అధికారాలు అప్పగించేందుకు అవసరమైన కార్యాచరణపై మాట్లాడినట్లు తెలుస్తోంది.

ఆసుపత్రి లో చేరిన సోనియా గాంధీ|
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆదివారం ఆసుపత్రిలో చేరారు.
కోవిడ్ సంబంధిత సమస్యల కారణంగా ఢిల్లీలోని గంగరామ్ ఆసుపత్రిలో చేరారు
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యలు ప్రకటించారు, డాక్టర్లు పర్యవేక్షణలో వైద్య సహాయం అందిస్తున్నారు.
సోనియా గాంధీ ఇటీవల కరోనా బారిన పడిన విషయం తెలిసిందే .