పోక్సో కోర్టులను పారంభించిన హైకోర్టు జడ్జ్

         
మైనర్లపై జరిగే అత్యాచార ఘటనలకు సంబంధించిన కేసులను త్వరగా పరిష్కరించేందుకు జిల్లా కోర్టు ఆవరణలో శనివారం ఉదయం రెండు పోక్సో కోర్టులను  తెలంగాణ  హైకోర్టు జడ్జి పి. శ్రీసుధా ప్రారంభించారు. 

పోలీసుల గౌరవ వందనం స్వీకరించిన అనంతరం  కోర్టు ఆవరణలో మొక్కలను నాటారు.  

అనంతరం హిందు, ముస్లీం,  క్రైస్తవ మతపెద్దలతో ఆశీర్వచనం పొందిన తరువాత  కోర్టు గ్రౌండ్ ఫ్లోర్ లో ఒకటి ,మరియు  మొదటి అంతస్థులో,  మరోక ఫాస్ట్ ట్రాక్ స్పెషల్  (పోక్సో ) కోర్టు ను ప్రారంభించారు.   ఈ సందర్బంగా తొలికేసులను హైకోర్టు జడ్జి సమక్షంలో ప్రారంభించారు. 

ఈ కార్యక్రమంలో  జిల్లా ప్రధాన న్యాయమూర్తి  బి. ప్రతిమ, జిల్లా కలెక్టర్  ఆర్.వి. కర్ణన్,  బార్ అసోసియోషన్  ప్రెసిడెంట్  ఈ. రాజరెడ్డి,  బార్ అసోసియోషన్ జనరల్ సెక్రటరి ఎల్. నాగరాజు, న్యాయవాదులు,తదితరులు పాల్గోన్నారు.


నరసింహ స్వామిని దర్శించుకున్న న్యాయమూర్తి !


శనివారం సాయంత్రం శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి నీ  తెలంగాణ  హైకోర్టు జస్టిస్  P. శ్రీసుద  దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. వీరికి ముందుగా దేవస్థానం సాంప్రదాయం ప్రకారం పూర్ణకుంభంతో, మేళతాళాలతో స్వాగతం పలికి పూజల  అనంతరం అర్చకులు ఆశీర్వచనం ఇవ్వగా దేవస్థానం కార్యనిర్వహణాధికారి ,సంకటాల శ్రీనివాస్ , రెనవేషన్ కమిటి సభ్యులు ఇందారపు రామయ్య, శేషవస్త్ర ప్రసాదం చిత్రపటం అందజేసినారు. ఇట్టి కార్యక్రమంలో దేవస్థానం  రెనవేషన్ కమిటి సభ్యులు అక్కనపల్లి సురేందర్, వేముల నరేష్ ,వేదపండితులు బొజ్జ రమేష్ శర్మ , ముత్యాల శర్మ , ప్రవీణ్ కుమార్, ముఖ్య అర్చకులు రమణయ్య , అర్చకులు నరసింహ మూర్తి, అభిషేకం పురోహితులు, బొజ్జ సంతోష్ కుమార్,  సంపత్ కుమార్, రాజగోపాల్,  జగిత్యాల  D.S.P ప్రకాష్ ,  జగిత్యాల జూనియర్ సివిల్ జడ్జి  తౌటం జితేందర్,  స్థానిక CI కోటేశ్వర్ , న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.


జర్నలిస్టు కుమార్ పై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు చేయాలి


– టీయుడబ్ల్యుజే (ఐజేయు) నేతల డిమాండ్
గోదావరిఖని ఉదయనగర్లో
శుక్రవారం రాత్రి  CVR TV రిపోర్టర్ పైడిపల్లి కుమార్ పై దాడి చేసిన   అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్, నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేసి వెంటనే అరెస్టు చేయాలని టీయూడబ్ల్యూజే ( IJU) జిల్లా అధ్యక్షులు బి సంపత్ కుమార్,  ప్రధాన కార్యదర్శి నాగపూరి సత్యం, దాడుల వ్యతిరేక నిరోధక కమిటీ జిల్లా అధ్యక్షులు సీపెల్లి రాజేశం,  జిల్లా ఉపాధ్యక్షులు పాలకుర్తి విజయ్ కుమార్,  జిల్లా బాధ్యులు  కె ఎస్ వాసు, గోదావరిఖని ప్రెస్ క్లబ్ అధ్యక్షులు వంశీ,  కార్యదర్శి కుమార్,  ఎలెక్ట్రానిక్ మీడియా నియోజకవర్గ అధ్యక్షుడు శేఖర్  డిమాండ్ చేశారు. .శనివారం వాళ్లు కుమార్ ఇంటికి వెళ్లి ఆయనను పరామర్శించి సంఘటన జరిగిన తీరు తెన్నుల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తప్పతాగిన మైకంలో అధికార మదం తో, తమను ఎవ్వరు ఏమి చేయలేరన్న అహంకారంతో అధికార టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్, అడ్డాల గట్టయ్య, నాయకులు, జలపతి, దేవన్న, పోలాడి శ్రీనివాసరావు విచక్షణ రహితంగా దాడి చేయడం ప్రజాస్వామ్యాన్ని అవమానపరచడమేనని అన్నారు.  టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు MLA   కోరు కంటి చందర్, వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ అధికార అహంకారంతో, భయబ్రాంతులకు గురి చేసిన వారందరిపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని, చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసు యంత్రాంగాన్ని డిమాండ్ చేశారు.  లేదంటే జర్నలిస్టుల పక్షాన ఉద్యమించక తప్పదని వారు హెచ్చరించారు.

విద్యా శాఖలో తర్జనభర్జనలు !

తెలంగాణ లో కరోనా పాజిటివ్‌ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వైద‍్య ఆరోగ్యశాఖ అధికారిక లెక్కల ప్రకారం శుక్రవారం ఒక్కరోజే 155 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది.
ఈ నేపథ్యంలో తెలంగాణలో విద్యా సంస్థలు తెరుచుకోవడంతో ప్రభుత్వం తర్జన భర్జనలు పడుతోంది.
పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోమవారం నుంచి విద్యాసంస్థలు ఓపెన్‌ కానుండటంతో పాఠశాలలకు సెలవులు పొడిగింపు ఉంటుందా..? అనే చర్చ నడుస్తోంది.
అయితే, కరోనా కేసులు పెరిగే ప్రమాదం ఉందని ఇప్పటికే వైద్యశాఖ నివేదిక ఇవ‍్వడం, హెచ్చరించడంతో విద్యా సంస్థలు తెరుచుకోవడంపై ఆందోళన నెలకొంది. ఈ క్రమంలో పాఠశాలల ప్రారంభంపై ఆదివారం సాయంత్రానికి ప్రభుత్వం నుంచి ప్రకటన వెలువడే అవకాశం ఉంది..