ధర్మపురి క్షేత్రంలో బుధవారం సాయంత్రం అంగరంగ వైభవంగా పెద్దమ్మతల్లి బోనాలు జరిగాయి. స్థానిక ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో . ముదిరాజ్ వాడ నుండి పెద్దమ్మ గుడి కి బోనాలతో మహిళలు నెత్తిన పెట్టుకొని వాటిపై దీపాలు వెలిగించుకుని మేళ తాళాలు మంగళ వాద్యాలు ఊరేగింపు మధ్య భక్తిభావంతో అమ్మవారి గుడికి తరలివెళ్లారు.

ముదిరాజ్ సంఘం కుల పెద్దలు యువకులు బోనాల పండుగ ఊరేగింపు ప్రశాంతంగా ఘనంగా నిర్వహించారు .

“గిరి వికాస్” ను సద్వినియోగం చేసుకోవాలి కలెక్టర్ రవి!
జిల్లాలో ని గిరిజనులు, ఆదివాసీలు గిరివికాస్ పథకాన్ని పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ జి.రవి సూచించారు. బుధవారం రాయికల్ మండలంలోని ధావన్ పల్లి, జగన్నాథపూర్ గ్రామాల్లో గిరి వికాస్ పథకం ద్వారా 17మంది లబ్ధిదారులకు 5బ్లాక్ లో మంజూరైన 5 బోర్ వెల్ ,20 విద్యుత్ సౌకర్యం పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

గ్రామాల్లో వేసిన బోరు బావుల్లో నీరు వచ్చాయా లేవా అంటూ లబ్ధిదారులైన రైతులతో కలెక్టర్ చర్చించారు. ఈ పథకం కింద బోరు,మోటారు, విద్యుత్ సౌకర్యం కల్పించనున్నట్లు వివరించారు.
వ్యవసాయం పై ఆధారపడి నీటి సౌకర్యం లేని గిరిజన రైతులకు బోరు బావుల మంజూరు చేసి అమలు చేస్తున్నామని తెలిపారు. రైతులు ప్రభుత్వం కల్పిస్తున్న సదుపాయాలను సద్వినియోగం చేసుకోని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు.

ప్రభుత్వం అందిస్తున్న పలు సంక్షేమ పథకాలను ఆదివాసులు గిరి పుత్రుల సద్వినియోగం చేసుకోవాలని వివరించారు.
అనంతరం దామనపల్లి గ్రామంలో నాటిన జామ పండు మొక్కలను కలెక్టర్ పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో డీఆర్డీవో పీడీ వినోద్ కుమార్, ,ఏపీడి బాలెే శివాజీ, తహసీల్దార్ దిలీప్ నాయక్, ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్, సర్పంచులు భూక్యా యమున రవిందర్, ఆత్రం విజయ బీర్సావ్, పాదం లత రాజు,ఎంపీటీసీ కవిత శ్రీనివాస్, లబ్ధిదారుల తదితరులు పాల్గొన్నారు.
అధికార దుర్వినియోగం చేసే వారిపై కఠిన చర్యలు కలెక్టర్
గ్రామాలలో ప్రభుత్వం కేటాయించిన అధికారాలను, నిధులను దుర్వినియోగం చేసే ప్రజా ప్రతినిధులు, అధికారుల పై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ జి.రవి స్పష్టం చేశారు.
బుధవారం గోల్లపల్లి మండలం అబ్బాపూర్ గ్రామపంచాయతీ సర్పంచ్ పురం శెట్టి పద్మ, ఉప సర్పంచ్ ఎం. నర్సయ్య, పంచాయతీ కార్యదర్శి మారుతి లను 6 నెలల పాటు తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు.
గ్రామ సర్పంచ్, ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి తమ అధికారాలను , ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేస్తున్నారని గమనించనైనది. గ్రామ సర్పంచ్
రూ.1,60,115/- లకు సంబంధించి అవకతవకలకు పాల్పడినందున వారిని సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ పేర్కొన్నారు.

సెంట్రల్ లైటింగ్ తో రాయికల్ పట్టణానికి సరికొత్ శోభ! .
ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్
రాయికల్ పట్టణంలో TUFIDC నిధులు 22 లక్షలతో డివైడర్ మరియు సెంట్రల్ లైటింగ్ ను ప్రారంబించిన జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.
ఎమ్మేల్యే మాట్లాడుతూ

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత రాయికల్ గ్రామాన్ని మున్సిపల్ గా మార్చడం జరిగింది అని,దానికి తగినట్లు గానే నిధులు మంజూరు చేసి పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామని అన్నారు.రాయికల్ పట్టణంలో రోడ్లు,మినీ టాంక్ బండ్,సీసీ కెమెరాలు,కుల సంఘాల భవనాలకు నిధులు కేటాయంచామని,రాయికల్ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దుతామని అన్నారు.కాంట్రాక్ట్ నిర్లక్ష్యం వల్ల కొంత అభివృద్ది ఆలస్యం అయిందని,కొత్త వారిని టెండర్ కు పిలవాలని అధికారులను ఆదేశించారు.

గత పాలకుల నిర్లక్ష్యం వల్ల పట్టణాలు మురికి కుపంలా ఉండేవని,నేడు పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల రూపు రేఖలు మారాయి అని అన్నారు.పట్టణ అభివృద్ధికి ప్రజల సహకారం కూడా తప్పనిసరీ అని,తడి పొడి చెత్త వేరు చేసి ఇవ్వాలని,ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మెన్ మోర హనుమండ్లు, వైస్ చైర్మన్ గండ్ర రమాదేవి,AMC రాజిరెడ్డి,PACS మల్లారెడ్డి, కమిషనర్ సంతోష్, కౌన్సిలర్ లు,కో ఆప్షన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.