‘గాయత్రి జయంతి’ని ఘనంగా జరుపుకోవాలి!


వినోద్ కుమార్ మహా వాది,
గాయత్రి ఉపాసన సంస్థ అధ్యక్షుడు

             జూన్ 11వ తేది, శనివారము (నిర్జల ఏకాదశి) నాడు దేశమంతటా వేడుకగా “గాయత్రి జయంతి”పర్వదినాన్ని . పవిత్రంగా ప్రశాంతంగా జరుపుకోవాలని అని తెలంగాణ రాష్ట్ర గాయత్రి ఉపాసన సంస్థ అధ్యక్షుడు వినోద్ కుమార్ మహా వాది తెలిపారు.
రాజర్షి విశ్వామిత్రుడు గాయత్రి మంత్రాన్ని లోకానికి పరిచయం చేసిన రోజు మరియు గాయత్రి మాత ప్రాదుర్భావమైన రోజును “గాయత్రి జయంతి”.గా  వ్యవహరిస్తారని ఆయన ప్రకటనలో పేర్కొన్నారు.


   విశ్వశాంతికి మూలం ధర్మమైతే, ఆ ధర్మాన్ని బోధించినది వేదం, వేదమాతయే గాయత్రి. బుద్ధి ప్రచొదనాన్ని కలుగచేసేది గాయత్రి తేజః ప్రదానమైన దేవత. పరమాత్మ  వేద వేద్యుడైతే వేదమాత యైన గాయత్రి తీర్చలేని దేమున్నది?
    ” నాదబ్రహ్మమయీ , చరాచరమయీ, జ్యోతిర్మయీ వాంగ్మయీ , అని ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారే గాయత్రిని స్మరించారు. రాజర్షులు, బ్రహ్మర్షులు ఇతర దేవతా మూర్తులే గాయత్రిని ఆరాధించి లోక వంద్యులైనారు.
        గాయత్రి ని మించిన మంత్రము లేదు తల్లిని మించిన దైవము లేదు అని ఆర్యోక్తి. ద్విజులు నిత్యకర్మ గా సంధ్యోపాసన లో గాయత్రి మాతను విశ్వ శాంతి కై ప్రతిసంధ్యలో ఉపాసించుచున్నారనుట నిర్వివాదాంశం.
       నవగ్రహాలలో అతి పెద్ద గ్రహం గా భావించే గురుడు సుమారు 12 సంవత్సరాల తరువాత తన సొంత రాశి అయిన మీనరాశిలో  సంచరించడం వలన ఈ సారి ద్విజులందరికి వేల సంఖ్య లో ఉపనయనము లు అయి గాయత్రి మంత్రోపదేశం జరిగినది.


       కావున అపురూపమైన “గాయత్రి జయంతి” జూన్ 11 శనివారం నాడు ద్విజోత్తము లందరూ సృష్టి కారకురాలైన ఆదిదేవత గాయత్రి మాతను యధాశక్తి స్తుతించి, ధ్యానించి, జపించి సంపూర్ణ ఫలాల నంది విశ్వశాంతిని పెంపొందించి సకల శుభాలు పొందాలని కాంక్షిస్తు న్నాము.
జపం ఎవరి ఇంటివద్ద వారు జపం చేసి తోటివారిని ఉత్తేజపరచటానికొరకు  ఒక ఫోటో మరియు గోత్రనామాలు watsapp no.9493108885 కు పంపగలరు. వివరాల కోసం అం 9000013755. సంప్రదించవలసినదిగా ప్రకటనలో పేర్కొన్నారు.