గ్రామాల అభివృద్ధికి పల్లె ప్రగతి కార్యక్రమం – మంత్రి కొప్పుల

గ్రామాల అభివృద్ధి కోసమే సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.
పెద్దపెల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో శనివారం  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా 55 లక్షల అభివృద్ధి పనులను ప్రారంభించి, పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొని గొల్ల,కురుమల ఇలవేల్పు బీరప్ప స్వామి, కమరాతి కళ్యాణోత్సవానికి హాజరైన ‌సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్
.
ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతు గ్రామాలలో నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా దేశానికి ఆదర్శవంతంగా  మన గ్రామాలు మారాయని, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 20 జాతీయ అవార్డులలో 19 అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి రావడమే నిదర్శనమని మంత్రి తెలిపారు
పల్లె ప్రగతి కార్యక్రమం ద్వారా గ్రామాల్లో పచ్చదనం పరిశుభ్రత పెరిగాయని, ప్రతి గ్రామంలో నర్సరీ,వైకుంఠధామం, డంపింగ్ యార్డ్, ట్రాక్టర్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం కేసీఆర్ దేనని మంత్రి అన్నారు.


ప్రతి నెల గ్రామ పంచాయతీలకు సీఎం కేసీఆర్ నిధులను విడుదల చేస్తారని, అబ్బాపూర్ గ్రామానికి సైతం పారిశుద్ధ్యం, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి నెల రూ. 2.18 లక్షలు విడుదల అవుతాయని మంత్రి అన్నారు. గత పాలకులు గ్రామ పంచాయతీలకు నిధుల విడుదలలో జాప్యం చేయడం వల్ల దాదాపు 6 వేల కోట్ల విద్యుత్ బకాయిలు పెండింగ్లో ఉన్నాయని, సీఎం కేసీఆర్ వాటిని మాఫీ చేశారని మంత్రి పేర్కొన్నారు.
ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ దృష్టి సారించారని, 12,700 గ్రామాలకు మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి సురక్షిత త్రాగునీటి సరఫరా చేస్తున్నామని, అక్కడ అక్కడ పెండింగ్ లో ఉన్న చిన్న చిన్న పనులు త్వరిత గతిన పూర్తి చేస్తామని మంత్రి తెలిపారు.
అబ్బాపూర్ గ్రామంలో 2,345 కుటుంబాలకు మిషన్ భగీరథ కింద త్రాగునీటి సరఫరా చేస్తున్నామని, ప్రజల ఆరోగ్యాన్ని మేలు చేసే మినరల్స్ మిషన్ భగీరథ లో పుష్కలంగా ఉంటాయని వీటిని వినియోగించాలని మంత్రి కోరారు.
రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు దేశ ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్ లో సైతం అమలు చేయడం లేదని మంత్రి తెలిపారు
బిజెపి పరిపాలిస్తున్న 18 రాష్ట్రాలలో మిషన్ భగీరథ, రైతుబంధు రైతు జీవిత బీమా, 24 గంటల ఉచిత విద్యుత్ , ఆసరా పింఛన్లు ,కేసీఆర్ కిట్స్, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాలను అమలు చేస్తుందా  ? అని మంత్రి  ప్రశ్నించారు.
వైద్య రంగంలో ప్రతి జిల్లాలో సీఎం కేసీఆర్ వైద్య కళాశాల ఏర్పాటు చేస్తున్నారని, నూతనంగా మాతాశిశు కేంద్రాలను ప్రారంభించనున్నామని, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో మౌలిక వసతులు మెరుగుపరుచుకున్నామని అన్నారు.  5 లక్షల విద్యార్థులకు ప్రభుత్వ రెసిడెన్షియల్ పాఠశాలలో పౌష్టికాహారం అందజేసి నాణ్యమైన విద్యను అందిస్తున్నామని అన్నారు.
రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న కేంద్ర ప్రభుత్వం దాన్యం కొనుగోలు నిరాకరించినప్పటికీ సీఎం కేసీఆర్  పూర్తి స్థాయిలో ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేశారని మంత్రి అన్నారు.
పెద్దపల్లి జిల్లాలో దాదాపు 2.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం యాసంగి సీజన్లో కొనుగోలు చేశామని, రైతుల వద్ద నుండి పూర్తి స్థాయిలో ధాన్యం మద్దతు ధర పై కొనుగోలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని మంత్రి తెలిపారు.


బిజెపి పాలిత రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోలు చేయడం లేదని, చత్తీస్గడ్ రాష్ట్రంలో రైతులు పండించిన పంటలో 50% మాత్రమే కొనుగోలు చేస్తున్నారని మంత్రి పేర్కొన్నారు.
ధర్మపురి నియోజకవర్గ పరిధిలో 3 సంవత్సరాల కాలంలో 25,000 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ కింద సహాయం అందజేసామని అన్నారు.
అబ్బాపూర్ లోని రైతు వేదిక నుంచి పెర్కపల్లి వరకు రోడ్డు నిర్మాణ పనులను మంజూరు చేయడానికి కృషి చేస్తానని మంత్రి హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో పెద్దపల్లి శాసన సభ్యులు దాసరి మనోహర్ రెడ్డి , గ్రంథాలయ చైర్మన్ రఘువీర్ సింగ్ ,జూలపల్లి జడ్పిటిసి బొద్దుల లక్ష్మణ్ , ఎంపీపీ ముస్కు రమాదేవి , యంపిటిసి వెంకటేశ్వర్లు, సర్పంచ్ ఈర్ల మల్లేశం గారు, ఉప సర్పంచ్ రాజవ్వ గారు, సంబంధించిన అధికారులు, ప్రజాప్రతినిధులు, మరియు తదితరులు పాల్గొన్నారు

పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలి:  కలెక్టర్ జి.రవి


జగిత్యాల జూన్ 4:-   జిల్లాలో 5వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని కట్టుదిట్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాల నిర్వహణ పై శనివారం సంబంధిత అధికారులతో కలెక్టర్ జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
పారిశుద్ధ్య నిర్వహణ, పచ్చదనం అంశాల్లో గ్రామాలు, మున్సిపాలిటీలో వార్డుల పనితీరు ఆధారంగా ర్యాంకు లను మండల, మున్సిపాలిటీ ప్రత్యేక అధికారులు బుధవారం నాటికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మండలం, మున్సిపాలిటీ లో  బాగా వెనుకబడిన గ్రామాలు, వార్డులు పల్లె ప్రగతి , పట్టణ ప్రగతి కార్యక్రమాల ద్వారా మెరుగు పరుచుకుని పక్షంలో సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.
గ్రామాల్లో ఉన్న రోడ్ల శుభ్రం, పిచ్చి మొక్కలు తొలగింపు, శిథిలాల తొలగింపు, మురికి కాలవలో చెత్త తొలగింపు, ప్రభుత్వ  కార్యాలయాల శుభ్రత పారిశుద్ధ్యం కింద పరిగణించాలని, మొక్కల సంరక్షణ, నర్సరీ, హరితహారం ప్రణాళిక పచ్చదనం కింద కలెక్టర్ తెలిపారు.


ప్రతి మండల ప్రత్యేక అధికారి ప్రతి రోజు వారి మండలంలోని 2 గ్రామాలలో పర్యటించి క్షేత్రస్థాయిలో పల్లె ప్రగతి అమలును పర్యవేక్షించాలని, ప్రతి గ్రామానికి కేటాయించిన మండల అధికారి ప్రతిరోజు పాల్గొనే విధంగా ఆదేశాలు జారీ చేయాలని కలెక్టర్ సూచించారు.
గ్రామాలలో నిర్మించిన డంపింగ్ యార్డ్, సెగ్రిగేషన్ షెడ్, వైకుంఠధామం ప్రస్తుత పనితీరుపై మండల ప్రత్యేక అధికారి క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక తయారు  చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
వైకుంఠధామం నీటి సరఫరా, విద్యుత్ సరఫరా   వంటి మౌలిక సదుపాయాల కల్పన పనులు పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. వైకుంఠ దామాలలో ఉన్న సౌకర్యాల పై మండలాల వారీగా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు.
క్రీడల పట్ల యువతకు ఆసక్తిని పెంపొందించేందుకు ప్రభుత్వం ప్రతి గ్రామంలో 1, మున్సిపాలిటీల్లో నే ప్రతి వార్డు లో 2 క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు నిర్ణయించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లాలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు సంబంధించి భూ లభ్యత, తీసుకున్న చర్యలపై వివరాలతో కూడిన నివేదిక సమర్పించాలని మండల ప్రత్యేక అధికారులను, మున్సిపల్ కమిషనర్లను కలెక్టర్ ఆదేశించారు.
8వ విడత హరితహారం కార్యక్రమానికి ప్రణాళికను పల్లె ప్రగతి లో భాగంగా సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో నీటిపారుదల శాఖకు సంబంధించి 376 కీలో మీటర్ల మేర ఉన్న కాల్వల వెంట ప్లాంటేషన్ ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.


నీటిపారుదల కాలువల వద్ద అందుబాటులో ఉన్న భూమి ఆధారంగా మల్టీ లేయర్ అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని, నీటిపారుదల శాఖ భూములలో యాదాద్రి మోడల్ ఆధారంగా బ్లాక్ ప్లాంటేషన్ పనులు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామాలలో, మున్సిపాలిటీలలో  ఉన్న విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని, అవసరమైన చోట అదనపు లైన్ వేయాలని కలెక్టర్ ఆదేశించారు. పల్లె ప్రగతి కార్యక్రమం అమలు పురోగతి పై ప్రతి రోజూ నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్  బి.ఎస్.లత , ఆర్.డి.ఓ.లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి వినోద్ కుమార్, మండల ప్రత్యేక అధికారులు, డి.పి.ఓ , ఎం.పి.ఓ.లు, సంబంధించిన అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు

పట్టణ ప్రగతి !


ధర్మపురి పురపాలక సంఘం పరిధిలో నాలుగో పట్టణ  ప్రగతి లో భాగంగా 01 వార్డుల్లో  ప్రత్యేక పారిశుధ్య సిబ్బందితో   పారిశుద్ధ్య పనులు చేపట్టారు.  అందులో భాగంగా  చైర్ పర్సన్ , మరియు మున్సిపల్ కమిషనర్  కౌన్సిలర్లు  పాల్గొన్నారు.


పల్లె ప్రగతి !


పల్లెప్రగతి 5 వ విడత కార్యక్రమంలో భాగంగా జైన గ్రామంలో వీధులను పరిశీలిస్తూ అక్కడ ఉన్న సమస్యలను  నమోదు చేసుకున్నారు ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు,. జెడ్పిటిసి సభ్యురాలు బత్తిని అరుణ,  dcms చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి , వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  రాజేష్ , జిల్లా పంచాయతీ అధికారి హరికృష్ణ, ఎంపీడీఓ  ప్రవీణ్,  mpo నరేష్ , గ్రామ సర్పంచ ఉపసర్పంచ్ ,వార్డ్ సభ్యులు, మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.