గ్రామాల అభివృద్ధికి పకడ్బందీ చర్యలు – మంత్రి ఈశ్వర్!

పెద్దపెల్లి జిల్లా అంతర్గాం మండలం లోని పెద్దంపేట గ్రామంలో 5.వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ తో కలిసి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ తెలంగాణలోని గ్రామాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పిస్తూ అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారని మంత్రి అన్నారు. రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డ్, వైకుంఠధామం నర్సరీ, కాంపోస్ట్ షెడ్డు, ట్రాక్టర్ ఏర్పాటు చేశామని అన్నారు


👉ప్రతి గ్రామ పంచాయతీకి నిధులను ప్రతి మాసం ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. పల్లె ప్రగతి కార్యక్రమం కింద చేపట్టిన పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించి లోటుపాట్లను సవరించాలని అధికారులకు మంత్రి సూచించారు.
👉నూతన తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన 8 సంవత్సరాల సమయంలోనే అనేక రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలిచిందని, ప్రస్తుతం గుజరాత్ సహా దేశంలోని అనేక రాష్ట్రాల్లో విద్యుత్ సంక్షోభం ఉన్నప్పటికీ, మన రాష్ట్రంలో లో కోతులు లేని కరెంట్ సరఫరా చేస్తున్నామని మంత్రి తెలిపారు* గ్రామాల్లో ప్రతి ఇంటికి నల్ల ద్వారా సురక్షిత మంచినీటి సరఫరా జరుగుతుందని, కుల వృత్తుల పునరుద్ధరణ కోసం గొర్రెల పంపిణీ చేపల పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టామని అన్నారు.
👉రైతు సంక్షేమం దిశగా సీఎం కేసీఆర్ రైతు బంధు, రైతు బీమా రుణమాఫీ,24 గంటల ఉచిత విద్యుత్తు వంటి పథకాలను అమలు చేస్తున్నారని, కేంద్ర ప్రభుత్వం నిరాకరించినప్పటికీ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధరకు కొనుగోలు చేయడం జరిగిందని మంత్రి అన్నారు.
👉వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లు బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్రలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచినప్పటికీ సీఎం కేసీఆర్ అంగీకరించలేదని మంత్రి అన్నారు.


👉 17 లక్షల యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా మంత్రి కేటీఆర్ రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకుని వచ్చారని, ఐటీ రంగంలో 300% ప్రగతి సాధించామని అన్నారు
👉తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలను సంరక్షిస్తూ వాటిలో యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ ఉంటే, కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు చౌక ధరకు అమ్ముతుంది అని మండిపడ్డారు. సిలిండర్ పై పూర్తిస్థాయిలో సబ్సిడీ తీసి వేసిందని మంత్రి తెలిపారు.
👉పెద్దంపేట గ్రామంలో ఉన్న భూ సమస్యను సైతం పరిష్కరించేందుకు కృషి చేస్తామని, గోదావరి రోడ్డు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు.
అనంతరం అంతర్గాం మండలంలోని కుందన పల్లి గ్రామంలో నిర్మించిన గ్రామీణ క్రీడా ప్రాంగణాన్ని మంత్రి ప్రారంభించారు
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్థానిక సంస్థలు అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ సంబంధిత అధికారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


జగిత్యాల డిఎస్పి ప్రకాష్ కు పురస్కారం!


తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పోలీస్‌ శాఖలో విశేషమైన సేవలందించినందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం 2021 సంవత్సరంలో ప్రకటించిన ప్రతిషాత్మకమైన పోలీస్‌ ఉత్తమ సేవా పథకానికి ఎంపిక అయిన జగిత్యాల డిఎస్పీ రత్నాపురం ప్రకాష్ కు హైదరాబాదులోని రవీంద్ర భారతిలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర హోం శాఖ మాత్యులు మహమ్మద్ అలీ చేతులమీదుగా ఉత్తమ సేవ పథకాన్ని అందుకొన్నారు.

జగిత్యాల ముస్లిం మైనార్టీ నూతన అధ్యక్షుడిగా..

మొహమ్మద్ అబ్దుల్ బారి 724 భారీ మెజారిటీ ఓట్లతో ఘన విజయం సాధించారు.

కర్ణాటకలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం.,

హైదరాబాద్‌కు చెందిన ఏడుగురు సజీవ దహనం..

కర్ణాటక కలబురిగి జిల్లా కమలాపురలో మినీ లారీని ఆరెంజ్ ట్రావెల్స్ ప్రైవేట్‌ బస్ ఢీ కొట్టిన ఘటనలో వీరంతా సజీవ దహనమయ్యారు. గోవాలో జరిగిన పుట్టిన రోజు వేడుకలకు హాజరైన రెండు కుటుంబాలకు చెందిన 32 మంది సభ్యులు తిరుగు ప్రయాణంలో ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా.. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

గ్రామీణ ప్రాంతాల అభివృద్దే పల్లె ప్రగతి కార్యక్రమం
మంత్రి గంగుల కమలాకర్

గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిందని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
శుక్రవారం కరీంనగర్ మండలం లోని చామనపల్లి గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జై తెలంగాణ నినాదంతో రాష్ట్రం రావాలని ఇదే గ్రామంలో కోరుకున్నాం అని తెలిపారు.ప్రజల సంపద పెరగాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారన్నారు.
రాష్ట్రం రాకముందు కూడా మనం ఉన్నాం అప్పుడు ఎలా ఉండే ఇప్పుడు ఎలా ఉన్నామని అందరం ఆలోచించుకోవాలి అన్నారు.నీళ్లు లేక కిలోమీటర్ల దూరం వెళ్లి తెచ్చుకొని అపరిశుభ్రంగా ఉన్న నీటిని తాగే వాళ్ళమని దాని వల్ల కలరా వంటి రోగాల బారిన పడే వాళ్ళం అన్నారు. గతంలో
గ్రామాలు అన్నీ అస్తవ్యస్తంగా ఉండేరోడ్లు, పరిశుభ్రత లేక అనారోగ్యం పాలయ్యాం అన్నారు. సమైక్యా పాలనలో ఆనాటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి నేను కొత్తగా ఎమ్మెల్యే అయ్యానని నిధులు కావాలని కోరుకుంటే వెకిలిగా నవ్వాడని తెలిపారు.
కానీ నేడు రాష్ట్రం సాధించుకున్నాక గ్రామలన్ని పరిశుభ్రంగా మారాలని ముఖ్యమంత్రి కోరుకున్నారన్నారు.రాష్ట్రం వచ్చి 8 ఏళ్ళలో అనేక నిధులు తెచుకున్నామని,ఈ గ్రామానికి ఆనాడు ఎవరు కూడా అభివృద్ధి చేయలని ఆలోచన కూడా చేయలేదన్నారు.


ఆడబిడ్డ పెళ్లి కోసం అష్ట కష్టాలు పడి ఇబ్బందులు పడ్డ పరిస్థితి చూసి కేసీఆర్ మేనమామగా లక్ష 116/-రూపాయల సాయం కల్యాణ లక్ష్మీ రూపంలో అందిస్తున్నారని తెలిపారు. కరెంటు కోసం అర్ధరాత్రి వెళ్లి మోటార్లు వేస్తే కాలిపోయే పరిస్థితి ఉండేదని చామనపల్లి లో కరెంట్ కోసం ఆనాడు నేనె ధర్నా చేసానని అన్నారు
నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన ఏకైక రాష్ట్రం మన తెలంగాణ మాత్రమేననిఅన్నారు.
మీ గ్రామ అభివృద్ధి కోసం నేను ఎల్లవేళలు అందుబాటులో ఉంటా..చెరువులు త్వరలోనే నింపుతాం అన్నారు.చెట్లు నరికివేయడం వల్ల వర్షాలు మాయమయ్యాయని తిరిగి వర్షాలు రావాలని హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించమన్నారు.గ్రామాల్లో ఆటలు కనుమరుగయ్యాయి..మళ్ళీ వాటికి పునర్జీవనం రావాలని కేసీఆర్ ఆలోచన చేసి గ్రామీణ క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసామని అన్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్, , అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, జిల్లా పరిషత్ సీఈవో ప్రియాంక, ఎంపీపీ లక్ష్మయ్య గ్రామ సర్పంచ్ లక్ష్మి, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.