జగిత్యాల, జూన్, 21:- జిల్లాలో 8వ విడత హరితహారం కార్యక్రమం పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. 8వ విడత హరితహారం పై సంబంధిత అధికారులతో కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సమావేశం నిర్వహించారు.
2022-23 సంవత్సరం జిల్లాలో 40.88 లక్షల మొక్కలు నాటాలని, మున్సిపాలిటీలలో, గ్రామాలలో మొక్కలు నాటేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో వర్షాలు ప్రారంభమయ్యాయని , వచ్చే 4 రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ సమయాన్ని గుంతలు తవ్వకానికి వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు.
హరితహారం కింద నాటే మొక్కలు మన నర్సరీల లోనే తయారు చేసుకోవాలని, నర్సరీలో మొక్కల పెంపకం పై అటవీ అధికారులు సాంకేతిక పరిజ్ఞానం,మార్గదర్శకాలు అందజేయాలని కలెక్టర్ సూచించారు.
8వ విడత హరితహారం కార్యక్రమం కింద మొదటి ప్రాధాన్యతగా నీటిపారుదల శాఖ కింద కేనాళ్ళ వద్ద పెద్ద ఎత్తున మొక్కలు నాటాలని కలెక్టర్ ఆదేశించారు. నీటిపారుదల శాఖ కింద బ్లాక్ ప్లాంటేషన్ టీఆర్ నగర్, రాయికల్ వద్ద ఏర్పాటు చేసిన విధానం యాదాద్రి మోడల్ లో బ్లాక్ ప్లాంటేషన్ చేయాలని కలెక్టర్ సూచించారు.
నీటిపారుదల శాఖ కింద ప్రభుత్వం సేకరించిన భూముల్లో సైతం రైతులు అవగాహన లేక వ్యవసాయం చేస్తున్నారని, సదరు భూములకు సంబంధించి అవార్డులను ధరణిలో నీటిపారుదల శాఖ కింద నమోదు చేశామని, వాటిని స్వాధీనం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యాప్తంగా నీటి పారుదల శాఖ భూములు స్వాధీనం చేసుకుంటున్నామని, దీనిపై రైతులకు వివరించాలని, అవసరమైన చోట పోలీసు భద్రత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
హరితహారం కార్యక్రమం నిర్వహణ పై ప్రతి మండలం తమ పరిధిలో నర్సరీలు వారీగా ప్రణాళికతో, మ్యాచింగ్, బ్యాచింగ్ ప్రకారం మొక్కలు రూపొందించుకోవాలని ఆదేశించారు.నర్సరీలో జరుగుతున్న ప్లాంటేషన్ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కలెక్టర్ ఆదేశించారు.
బృహత్ పల్లె ప్రకృతి వనాల ఏర్పాటు కోసం జిల్లాలోని 18 మండలంలో 10 ఎకరాల చొప్పున భూమి గుర్తించాలని, ఇప్పటి వరకు దాదాపు 71 ఎకరాలు గుర్తించామని, వీటిలో మొక్కల పెంపకానికి ప్రణాళిక సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు.పల్లె ప్రకృతి వనాల్లో ప్రతి ఎకరాకు స్థలానికి 4వేల మొక్కలు నాటాలని, తక్కువ ప్రాంతంలో ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో చేపట్టిన మల్టీలెవల్ అవెన్యూ ప్లాంటేషన్ ప్రస్తుత పరిస్థితిపై నివేదిక సమర్పించాలని కలెక్టర్ సూచించారు.

జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ఏర్పాటు చేసిన ట్రీ గార్డులను అవసరం లేనిచోట తీసివేయాలని, ప్రస్తుత సంవత్సరం మొక్కలు నాటి సమయంలో వారిని వినియోగించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో హరితహారం కింద నాటిన మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ప్రస్తుతం ఉన్న మొక్కలకు ప్రతివారం 3 సార్లు వాటరింగ్ చేసే విధంగా తయారు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
గ్రామీణ ప్రాంతాల్లో పారిశుధ్య నిర్వహణ పై అవసరమైన చర్యలు తీసుకోవాలని, ప్రతి ఇంటి వద్ద పైప్ లైన్ వద్ద జాలీ ఏర్పాటు చేయాలని, దోమల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో డ్రైనేజీ ల పూడికతీత పనులు ఎప్పటికప్పుడు నిర్వహించాలని, నీటి ప్రవాహం కి ఎలాంటి ఆటంకం కలగకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
ఈ విడియో కాన్ఫరెన్స్ సమావేశంలో ఇంచార్జి అదనపు కలెక్టర్,ఆర్.డి.ఓ. జగిత్యాల, డి.ఆర్.డి.ఓ., డి.ఎఫ్.ఓ. , మున్సిపల్ కమిషనర్లు, ఎం.పి.డి.ఓ.లు, తహసీల్దార్లు, ఎం.పి.ఓ.లు, మండల ప్రత్యేక అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పరామర్శలు.
జగిత్యాల పట్టణంలో కొలగాని సుభాష్ అనే న్యాయవాది ., బీర్పూర్ మం. నర్సింహులపల్లె గ్రామంలో చిక్కుల మల్లేశం విద్యుత్ షాక్ తో మరణించగా వారి కుటుంబ సభ్యులని పరామర్శించి తన ప్రగాఢ సానభూతి తెలిపిన పట్టభద్రుల ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి

బిజేపి అధ్యక్షుడు బండి సంజయ్ కు భద్రత పెంపు
మొన్న కరీంనగర్ లో బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలపై ఆయనకు ముప్పు ఉందని ఇంటెలిజెన్స్ నివేదిక., దీంతో ఆయనకు ఒక ఎస్కార్ట్ వాహనం, 1+5 రోప్ పార్టీ భద్రత ఇవనున్న పోలీసులు.

పనుల పరిశీలన
జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేట్ మార్కెట్ నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ జి రవి . మరియు ఆర్డిఓ మాధవి మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి,వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు
రేపు బిజెపి ఎంపీ ఎమ్మెల్యే పర్యటన !
జిల్లా లో రేపు నిజామాబాద్ ఎంపి ధర్మపురి అరవింద్, హుజూరాబాద్ ఎమ్మేల్యే ఈటెల రాజేందర్ పర్యటన.,
కోరుట్ల, జగిత్యాల నియోజవర్గ లలో, పలు కార్యక్రమాలలో పాల్గొననున్న ఎంపి అరవింద్, ఎమ్మేల్యే ఈటెల రాజేందర్.

కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మేల్యే !
జగిత్యాల పట్టణ టీఆరెఎస్ పార్టీ కార్యవర్గ సభ్యులు ముద్దమల్ల సందీప్ నిన్న మోర్తాడ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదం లో మరణించగా వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలిపి,సందీప్ పార్టీ చేసిన సేవలను గుర్తు చేసుకున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ .పార్టీ పరంగా ఆదుకుంటామని భరోసా ఇచ్చిన ఎమ్మేల్యే. వెంట స్థానిక కౌన్సిలర్ కూతురు రాజేష్,నాయకులు రాజు, సునంద, దయానంద్, సాల్మన్, అరుణ్,తదితరులు ఉన్నారు.
పరామర్శ !
జగిత్యాల పట్టణ టీఆరెఎస్ యూత్ నాయకులు ఏనుగుల రాజు ఇటీవల రోడ్డు ప్రమాదం లో గాయపడి,కాలుకు శస్త్ర చికిత్స కాగా జగిత్యాల ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా వారిని పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ గారు.వెంట కౌన్సిలర్ తోట మల్లికార్జున్,నాయకులు తదితరులు ఉన్నారు.
విద్యాప్రదాత జగదీష్ !
ధర్మపురి వాసి అమెరికా లో నివసిస్తున్న NRI అసం జగదీశ్వర్ పేద విద్యార్థిని ఆమె ఎంచుకున్న ఉన్నత కోర్స్ చదువులు ,చదువుకునే వరకు మొత్తం ఆర్థిక భారాన్ని భరిస్తాను అంటూ ఆ విద్యార్థికి మనోధైర్యం కల్పించారు. వివరాల్లోకి వెళితే వెల్గటూర్ మండలంలోని zphs ఎండపల్లి పాఠశాలలో 8 వ తరగతి చదువుతున్న రాయిళ్ళ లిఖిత అనే విద్యార్థిని ,పేదరికం చదువుకు అడ్డంకి అని తెలుసుకున్నారు. ఆ అమ్మాయిని 8 వ తరగతి నుండి, చదువుకునేంత అంటే, గ్రాడ్యుయేషన్ వరకు పై చదువులు చదివించడానికి జగదీశ్ లిఖిత ను విద్యా దత్తత తీసుకొని, తన చదువు మరియు ఇతర అవసరాల బాధ్యత నాదే అంటూ ఆయన ప్రకటించారు. గతంలో కూడా జగదీశ్ ఎండపల్లి పాఠశాల విద్యార్థులకు ఎన్నో రకాలుగా సహాయం అందించారు.
ఈ కార్యక్రమం లో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, ఉపాధ్యాయులు రాజేశ్వర్, జినాథ్,.గణేష్, సంతోష్, రాజేందర్ మరియు శ్రావణి, జ్యోతి పాల్గొన్నారు