హోంమంత్రి అమిత్ షా తో చర్చలు- ఈటెల కు కీలక బాధ్యతలు.?

హుజురాబాద్ ఎమ్మెల్యే మాజీ మంత్రి, ఈటే ల రాజేందర్ కు భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం కీలక బాధ్యతలు . అప్పగించనున్నట్లు చర్చ. జూలై మాసంలో హైదరాబాద్ లో జరుగనున్న. ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాల లో వివిధ పార్టీ లో, ప్రజలలో ప్రజాబలం ఉన్న నాయకులను, క్యాడర్ ను చేర్పించడం, రాష్ట్ర వ్యాప్తంగా ప్రచార కమిటీ బాధ్యతలను అప్పగించనున్నట్లు చర్చ.
హోం శాఖ మంత్రి అమిత్ షా పిలుపుమేరకు ఆదివారం ఢిల్లీ కి వెళ్లిన ఈటల రాజేందర్, ఏనుగు రవీందర్ రెడ్డి ల తో అమిత్ షా సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ప్రారంభం నుంచి రాజేందర్, వెన్నంటి ఉన్న నాయకులు, రాష్ట్రంలో వివిధ మండల కేంద్రాల్లో గ్రామాల్లో ఉన్న నాటి క్యాడర్ ను సమాయత్తం చేసి పార్టీలో చేర్పించే ప్రక్రియకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. జూలై 2 ,నాటికి అధికార పార్టీ నుంచి ఇద్దరు లేదా ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యే లను, మాజీ మంత్రులు చేర్పించే యత్నాలకు కేంద్రం బిజెపి అధిష్టానం శ్రీకారం చుట్టినట్లు చర్చ. ఆరు నూరైనా తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం బిజెపి బహుముఖ రాజకీయ పన్నాగం పన్నినట్టు సమాచారం. ఈ మేరకు మరి కొందరు కీలక నేతలకు బాధ్యతలను అప్పగించనున్నట్లు చర్చ.