జర్నలిస్టులందరికీ నివేశన స్థలాలు ఇవ్వడానికి కృషి చేస్తా !మంత్రి కొప్పుల ఈశ్వర్ !

పట్టణములో జిల్లాలో అర్హులైన జర్నలిస్టు అందరికీ లభ్యత మేరకు నివేశన స్థలాలు గాని, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కాని, ఇవ్వడం కోసం నేను నాతో పాటు జిల్లాలోని శాసనసభ్యులు తప్పకుండా కృషి చేస్తానని , జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ భవనము స్థల కేటాయింపుతో, పాటు నిధుల మంజూరు నిర్మాణ అంశంపై ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి ఈశ్వర్ స్పష్టం చేశారు.


తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్, (ఐజెయు అనుబంధ) (TUWJ (IJU) జగిత్యాల జిల్లా శాఖ నూతన కార్యవర్గ కమిటీ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం మంగళవారం స్థానిక పద్మనాయక కల్యాణ మండపంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ జిల్లా అధ్యక్షుడు జె. సురేందర్ కుమార్ అధ్యక్షత వహించారు. నూతనంగా ఎన్నికైన జిల్లా శాఖ అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాస్ రావు, ఎ. ప్రదీప్ కుమార్ తో ఉపాధ్యక్షులు గడ్డల హరికృష్ణ, గాజుల నాగరాజు, కోటగిరి దశరథం తో పాటు సంయుక్త కార్యదర్శులు అల్లె రాము, ,దానము కిషన్ ,కోశాధికారి మంద శ్రవణ్ కుమార్ గౌడ్, ఆర్గనైజింగ్ కార్యదర్శి పూడూరి శోభన్, నూతన కార్యవర్గం మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బాధ్యతలుచేపట్టారు.


ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి ఈశ్వర్ తో పాటుగా, జగిత్యాల , కోరుట్ల ఎమ్మెల్యే లు డా.సంజయ్ కుమార్, కె.విద్యాసాగర్ రావు, జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, వైస్ చైర్మెన్ వి.హరిచరణ్ రావు, మున్సిపల్ చైర్పర్సన్ డా. భోగ శ్రావణి ప్రవీణ్ , డిసిఎంఎస్ చైర్మెన్ డా.ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి, జిల్లా గ్రంథాలయసంస్థ చైర్మెన్ డా.చంద్ర శేఖర్ గౌడ్, టీ యూ డబ్ల్యూజె ( ఐ జె యూ ) రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్,, సింగిల్ విండో అధ్యక్షులు పి.మహిపాల్ రెడ్డి, , బుగ్గారం జడ్పీటిసి బాదినేని రాజేందర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్ మాట్లాడుతూ…జర్నలిస్టుల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.తమవంతుగా గౌరవ ఎమ్మెల్యేలు డాక్టర్ సంజయ్, విద్యాసాగర్, సుంకే రవిశంకర్ ల తో సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని, పట్టణంలో జిల్లాలోని దృష్టి లోపం నివేశన స్థలాలు లేదా డబుల్ బెడ్ రూమ్ ఇవ్వడానికి కృషి చేస్తామన్నారు.

కొన్ని రోజుల వ్యవధిలోనే జిల్లా కేంద్రాల్లో ప్రెస్ భవన్ కోసం స్థలాన్ని కేటాయించడంతో పాటు నిర్మాణానికి నిధుల మంజూరుకు కృషి చేస్తా అన్నారు. ఉర్దూ దిన పత్రికలో నుంచి అక్రిడేషన్ కమిటీలో నామినేట్ చేయడం కోసం ప్రభుత్వానికి లేఖ రాస్తాను అని మంత్రి అన్నారు. జర్నలిస్టులకు ప్రజాప్రతినిధులకు వీడని బంధం ఉందని ఏ సమస్య పరిష్కారం కైనా తనను నేరుగా కలవాలని మంత్రి ఈ సందర్భంగా కోరారు.


డబుల్ బెడ్ రూమ్ లు ఇవ్వడానికి నేను సిద్ధం !
ఎమ్మెల్యే సంజయ్ కుమార్!

జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న అర్హులైన జర్నలిస్టులందరికీ డబుల్ బెడ్ రూములు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని అవసరమైతే ముఖ్యమంత్రిని ఎమ్మెల్సీ కవితకు పరిస్థితి వివరించి ప్రత్యేక బ్లాగ్ ను కేటాయిస్తానని మీరు బెడ్ రూమ్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారా ? పట్టణ విస్తీర్ణం పెరిగింది, ప్రభుత్వ స్థలాలు అందుబాటులో లేవు, ఒకవేళ ఉండి ఉంటే నేను స్థలం లభ్యత మేరకు మీకు ఫ్లాట్ ఇవ్వడానికి నాకు గాని మా ప్రభుత్వానికి గాని జిల్లా మంత్రి గాని ఎలాంటి అభ్యంతరం లేదని త్వరలో జిల్లా కేంద్రంలో
ప్రెస్ భవన్ కోసం స్థలాన్ని కేటాయిస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


జర్నలిస్టు హెల్త్ స్కీం కార్డు కలిగి ఉన్న అందరికీ జగిత్యాల పట్టణంలోని కార్పొరేట్ హాస్పిటల్ లో వైద్య సేవలు అందించడానికి నా వంతుగా కృషి చేయడంతో పాటు ఖచ్చితంగా వారికి వైద్య సేవలు అందేలా ప్రయత్నం చేస్తానని ఆరోగ్యశ్రీ పరిధిలో ఎంపానెల్ కలిగివున్న ఆసుపత్రులలో ఈ సౌకర్యాన్ని తాను డాక్టర్లతో వ్యక్తిగతంగా మాట్లాడి సమస్యను పరిష్కరిస్తానని ఎమ్మెల్యే సభాముఖంగా వివరించారు

నా సెగ్మెంట్లో 30 శాతమే ఇవ్వాల్సి ఉంది.!
కోరుట్ల ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు !

స్థలాల లభ్యత మేరకు మెట్టుపల్లి, కోరుట్లలో ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ మండలంలో పరువైన జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేశానని మరో 20 30 శాతం పెండింగ్లో ఉన్నాయని త్వరలో వారికి కూడా ఇస్తానని, స్థలాలు ఇవ్వడంతోపాటు

నిర్మాణానికి ప్రభుత్వం నిబంధన మేరకు 3లక్షల నిధులు కూడా వారికి అందిస్తున్నామన్నారు. కొద్ది కాలంలోనే స్థలాల లభ్యత ప్రభుత్వ నిబంధనల మేరకు నియోజకవర్గంలో మిగతా 30 శాతం మంది జర్నలిస్టులకు నివేశన స్థలాలు మంజూరు చేస్తానని కోరుట్ల, మెట్పల్లి ప్రెస్ క్లబ్ ఆధునీకరణ కోసం నిధులు మంజూరు చేస్తానని ఎమ్మెల్యే ఈ సందర్భంగా వివరించారు.


జర్నలిస్టులు కృషి, సమాచార సేకరణ ,ప్రభుత్వ రంగానికి ప్రజలకు మధ్య వారధిగా పని చేస్తున్న అంశంతో పాటు జర్నలిస్టుల సాధకబాధకాలను ,జెడ్పి చైర్ పర్సన్ దావా వసంత, మున్సిపల్ చైర్ పర్సన్ బోగ శ్రావణి,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ ,డీసీఎంఎస్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి ,బుగ్గారం జడ్పిటిసి బాదినేని రాజేందర్ తదితరులు తమ తమ ప్రసంగాల్లో జర్నలిస్టులకు సంఘీభావం వ్యక్తం చేశారు.


ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా బాధ్యుడు టీవీ సూర్యం, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు సిరిసిల్ల శ్రీనివాస్, నూతన అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు, ఉర్దూ దిన పత్రికల ప్రతినిధి అబిద్, తదితరులు జర్నలిస్టుల సమస్యలు అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డుల గురించి ,సాధకబాధకాలను, మంత్రికి ఎమ్మెల్యేలకు వివరించారు.


.ఈ కార్యక్రమం లో జిల్లా నూతన కార్యవర్గం సభ్యులు జగదీశ్వర్, రమేష్ , రాజ్ కుమార్, రమణారెడ్డి రంజిత్ ,రాజేష్, నంబులాద్రి ,లక్ష్మణ్ శ్యామ్ సుందర్, అనిల్ కుమార్ ,శ్రీనివాస్, శ్రీశైలం, కర్నే సంతోష్, జిల్లాలోని వివిధ మండలాల పాత్రికేయులు పాల్గొన్నారు. సీనియర్ జర్నలిస్ట్ సిరిసిల్ల రాజేందర్ శర్మ స్వాగతం తో ప్రారంభమైన సమావేశం కార్యదర్శి ప్రదీప్ కుమార్ కృతజ్ఞత తో సమావేశం ముగిసింది.