J. Surender Kumar,
కరీంనగర్ పార్లమెంటు సభ్యుడు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వచ్చే నెల 9, 10 తేదీల్లో ధర్మపురి పట్టణానికి రానున్నారు. శుక్రవారం హైదరాబాదులో ఎంపీ బండి సంజయ్ ని ఆయన నివాసంలో బిజెపి రాష్ట్ర నాయకుడు దామెర రామ సుధాకర్ రావు, సంతోష్ రావు ప్రజ్ఞ భారతి ప్రధాన కార్యదర్శి రఘు కలసి ఆహ్వానించారు. ఈ మేరకు సంజయ్ సానుకూలంగా స్పందించి తప్పకుండా వస్తాను అంటూ హామీ ఇచ్చారని వారు వివరించారు. గోదావరి హారతి కార్యక్రమం 10వ వార్షికోత్సవం సందర్భంగా ధర్మపురిలో చింతన్ సమ్మేళన కార్యక్రమాలు రెండు రోజులపాటు జరుగనున్నాయి .తల్లి గోదావరి, తెలంగాణ జీవనరేఖ గోదావరి పిలుస్తుంది రా, తదితర కార్యక్రమాలు గోదావరి నది హారతి మరియు ప్రజ్ఞ భారతి సంస్థ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నారు.

రెండు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమానికి నలుగురు కేంద్ర మంత్రులు, విశ్వహిందూ పరిషత్, ఆర్ఎస్ఎస్ ,బిజెపి శ్రేణులు, ఉత్తర తెలంగాణ జిల్లాలోంచి రానున్నట్టు నిర్వాహకులు రామ్ సుధాకర్ రావు తెలిపారు. అధికారికంగా ఎంపీ బండి సంజయ్ పర్యటన ఖరారు కావాల్సి ఉంది అని రామ్ సుధాకర్ వివరించారు.

అక్రమ ఇసుక రవాణా నిరోధానికి పటిష్ఠ చర్యలు
ఇసుక రవాణా, టీఎస్ బీపాస్, కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్
జగిత్యాల జూన్ 24:- మన ఊరు మన బడి కింద అభివృద్ధి పనుల కోసం అవసరమైన ఇసుకను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇసుక రవాణా, టీఎస్ బీపాస్, కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకాల అమలు పై సంబంధిత అధికారులతో శుక్రవారం కలెక్టర్ జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో ఇసుక రవాణా నిబంధనల మేరకు మాత్రమే జరగాలని, అక్రమ రవాణాపై నిఘా ఉంచి కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో గత 7 రోజుల్లో 23 ఇసుక రవాణా వాహనాలు సీజ్ చేయడం జరిగిందని అధికారులు తెలిపారు. ఇసుక రవాణా పై మండలాల వారీగా కలెక్టర్ చర్చించారు.
మన ఊరు మన బడి కింద మొదటి దశలో ఎంపికైన 274 పాఠశాలలో అభివృద్ధి పనులు పూర్తి చేయడానికి మనకు 22,243 క్యుబిక్ మీటర్ల ఇసుక అవసరమవుతుందని, జిల్లాలో అందుబాటులో ఉన్న ఇసుక నిల్వలు నుంచి సరఫరా చేసేందుకు ప్రణాళిక తయారు చేయాలని కలెక్టర్ తహసిల్దార్ లను ఆదేశించారు. పాఠశాలలో అభివృద్ధి పనుల పురోగతి ప్రకారం ఇసుక సరఫరా జరగాలని, మన ఊరు మన బడి పనులకు ఇసుక కొరత రాకుండా జాగ్రత్త వహించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో అర్హులైన వారికి కళ్యాణలక్ష్మీ షాదీముబారక్ పథకాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని, కథలాపూర్ తహసిల్దార్ వద్ద 12, మేడిపల్లి తహసిల్దార్ వద్ద 10, గొల్లపల్లి తహసిల్దార్ వద్ద 9 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, వీటిని త్వరితగతిన పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలో ఎమ్మెల్యేల వద్ద 244 దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని, కోరుట్ల 27,గోల్లపల్లి లో 27, జగిత్యాల రూరల్ లో 21 పెండింగ్ లో ఉన్నాయని ,తహసిల్దార్లు సంబంధిత శాసనసభ్యులతో సమన్వయం చేసుకొని పూర్తిచేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వం నుండి నిధులు విడుదలైన కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను స్థానిక శాసనసభ్యుల సమయం తీసుకొని ఎప్పటికప్పుడు పంపిణీ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

ధరణి కేసులకు సంబంధించి జిల్లాలో 22 మ్యూటేషన్లు పెండింగ్లో ఉన్నాయని వీటిని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లాలో 210 ప్రదేశాలలో గ్రామీణ క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు స్థల ఎంపిక చేసినప్పటికీ ఇప్పటి వరకు 40 గ్రామీణ క్రీడా ప్రాంగణాల పనులు మాత్రమే గ్రౌండ్ కావడం పట్ల కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రతి గ్రామంలో గ్రామీణ క్రీడా ప్రాంగణం ఏర్పాటు కోసం స్థలాల ఎంపిక చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రభుత్వ స్థలాలైన పాఠశాలలు,ఐకేపీ కేంద్రాలను సైతం ఎంపిక చేయవచ్చని కలెక్టర్ తెలిపారు. క్రీడా ప్రాంగణాల వల్ల నష్టం వచ్చే అవకాశాలు లేవని, దీని పై ప్రజా ప్రతినిధులకు అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్ .లత , ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వినోద్ కుమార్, జగిత్యాల రెవెన్యూ డివిజన్ అధికారి మాదూరి, తహసిల్దార్, సంబంధించిన అధికారులు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

మహిళలు ఆర్థికంగా ఎదగడానికి బ్యాంకు రుణాలు అడిషనల్ కలెక్టర్ బి. లత
ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ శ్రీలత ముఖ్య అతిధి గా హాజరయ్యారు.
ఆమె మాట్లాడుతూ జిల్లాలో మహిళా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకుల వారు ఒక లక్ష నుండి 20 లక్షల రూపాయల వరకు బ్యాంకు లింకేజీ ఇవ్వడం జరుగుతుందని అట్టి తీసుకున్న రుణాలు ఆదయాభివృద్ధి కార్యక్రమాల కొరకు వినియోగించి ఆర్థికంగా ఎదగాలని, మంచి సహజ ఉత్పత్తులు చేసి అమ్మకాలు చేయాలని అన్నారు.
మహిళలకు పెద్ద ఎత్తున రుణాలు అందిస్తున్న SBI బ్యాంక్ మేనేజర్లకు, అధికారులను వారు అభినందించారు., డిప్యూటీ జనరల్ మేనేజర్ నటరాజన్ మాట్లాడుతూ మహిళలకు ఎప్పుడైనా రుణాలు ఇవ్వడానికి బ్యాంకుకు రేడిగా ఉంటాయని, తీసుకున్న రుణాలు సకాలంలో రిపేమెంట్ చేసి అందరికి ఆదర్శంగా నిలవాలని అన్నారు
రీజినల్ మేనేజర్ పాలితంగా. శ్రీనివాస్ మాట్లాడుతూ sbi బ్యాంకు లు ఇస్తున్న రుణాలు సద్వినియోగం
చెసుకొని అభివృద్ధి చెందాలని అన్నారు.జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ వెంకట్ రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో మహిళలు చేస్తున్న వివిధ యూనిట్ల రుణాలు ఇవ్వడం జరుగుతుందని, సంఘాల సభ్యురాళ్లకు వ్యక్తి గత ఋణాలు ఆసక్తి ఉన్నవారికి అందివ్వడం జరుగుతుందని అన్నారు. , జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ అదనపు సంచాలకులు సుదీర్ మాట్లాడుతూ జిల్లాలో సహజ బ్రాoడ్ పేరుతొ ఆయా నాణ్యమైన ఉత్పత్తులను మహిళలుఉత్పత్తులు చేస్తు అభివృద్ధి చెందుతున్నారని, అందుకోసం సెర్ప్ సిబ్బంది కూడా వారికి సహాయ సహకారాలు అందిస్తున్నారని అన్నారు.
ఈ సందర్భంగా 20 కోట్ల లింకేజీ రుణాలు మహిళ సంఘాలకు అందజేశారు, బ్యాంక్ లింకేజీలో ఉత్తమ ప్రగతి కనబర్చిన Apms,Tmc, Ccs, Cos, Voas, RP లకు ప్రశంసపత్రాలను ఇవ్వడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో SBI చీఫ్ మేనేజర్ M. కాశిరాం, తేజేశ్వర్ రావు, జిల్లా సమాఖ్య అధ్యక్షురాలు రమ్య, వెల్గటూరు, పెగడపల్లి, ధర్మపురి, గొల్లపల్లి, కోరుట్ల, మెటపల్లి,రాయికల్, జగిత్యాల లకు చెందిన 14 SBI బ్రాంచి మేనేజర్లు,ఫీల్డ్ ఆఫీసరాలు, Dpm లు,అన్ని మండలాల సెర్ప్ apm లు,mempa సిబ్బంది,voa లు,Rp లు,ఆయా మండలాల శ్వసక్తి సంఘాల లీడర్లు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.