క్రైస్తవుల సంక్షేమం కోసమే ప్రభుత్వం కృషి – మంత్రి ఈశ్వర్ !

హైదరాబాద్: క్రైస్తవుల సంక్షేమం, సముద్ధరణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని,అందుకు చిత్తశుద్ధితో ముందుకు సాగుతున్నమని మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.దళిత క్రైస్తవ ఐక్య వేదిక బ్రోచర్ ను మంత్రి ఆవిష్కరించారు.హైదరాబాద్ లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం పలువురు క్రైస్తవ ప్రముఖులు కలిసిన సందర్భంగా మంత్రి వారితో ఇష్టాగోష్టి జరిపారు. .క్రైస్తవ సమాజం గతంలో ఎప్పుడూ కూడా లేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సుపరిపాలనలో ప్రశాంతంగా జీవిస్తున్నారన్నారు.

మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చిదిద్దేందుకు 204 గురుకులాలను నెలకొల్పిన విషయాన్ని, విదేశాలలో ఉన్నత విద్యనభ్యసించేందుకు వెళ్లే ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలను ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. .క్రిస్మస్ వేడుకలను ప్రభుత్వపరంగా ప్రతి ఏటా ఘనంగా నిర్వహిస్తున్నామని. ,పేదలకు దుస్తులు పంపిణీ చేస్తున్నామని మంత్రి కొప్పుల పేర్కొన్నారు. .ఈ కార్యక్రమంలో పోలీసు గృహ నిర్మాణ సంస్థ ఛైర్మన్ కోలేటి దామోదర్ గుప్తా, ,బిషప్ స్వామిదాసు, దళిత క్రైస్తవ ఐక్య వేదిక ప్రముఖులు మోజెస్, అగ్రిప్ప, ఐజాక్ అరవిందం తదితరులు ఉన్నారు.


20న జరిగే వేడుకలకు హాజరు కండి: మంత్రి నీ ఆహ్వానించిన బిషప్


హైదరాబాద్:మహబూబాబాద్ జిల్లా డోర్నకల్ లోని ప్రముఖ చర్చిలో ఈ నెల 20వ తేదీన జరిగే వేడుకలకు హాజరు కావలసిందిగా బిషప్ రెవరెండ్ కె.పద్మారావు మంత్రి కొప్పుల ఈశ్వర్ ను ఆహ్వానించారు. హైదరాబాద్ లోని క్యాంపు కార్యాలయంలో శనివారం మంత్రిని కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. డోర్నకల్ డయాసిస్ బిషప్ గా తాను బాధ్యతలు చేపట్టి ఏడాది అవుతున్న సందర్భంగా చర్చి ఆవరణలో జరిగే ఉత్సవాలకు. కేరళ, ఆంధ్రప్రదేశ్, రాష్ట్రాలు, తెలంగాణలోని పలు జిల్లాల నుంచి పలువురు ప్రముఖులతో, పాటు క్రైస్తవులు పెద్ద సంఖ్యలో హాజరవుతారని పద్మారావు మంత్రికి వివరించారు…బిషప్ వెంట క్రిస్టియన్ ప్రముఖులు తోకల ప్రవీణ్, ఏర్పుల కిశోర్, ,పల్లా కిశోర్, మెట్టల మోహన్, ,దార ప్రదీప్ తదితరులు ఉన్నారు.


ధర్మపురి లో పట్టణ ప్రగతి !

పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా శనివారం ధర్మపురి మున్సిపాలిటీలో 09 వ వార్డు సందర్శించడం జరిగింది. మరియు మురికి కాలువలు శుభ్రం చేయడం జరిగింది. పిచ్చి మొక్కలు తొలగించడం జరిగింది పైప్ లైన్ లీకేజ గుర్తించి చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో గౌరవ చైర్ పర్సన్ , వైస్ చైర్మన్ మరియు గౌరవ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు.