మద్దునూరు గ్రామ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలి: కలెక్టర్ జి.రవి

సీఎం కేసీఆర్ ఆదేశాలతో జిల్లా కలెక్టర్ గ్రామ సందర్శన


జగిత్యాల జూన్ 22:-  మద్దనూరు  గ్రామపంచాయతీ సమగ్రాభివృద్ధికి ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్ జి రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో బుధవారం బుగ్గరం మండలం లోని మద్దునూరు గ్రామపంచాయతీని సందర్శించిన కలెక్టర్ గ్రామాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించారు.


గ్రామంలో ఏర్పాటు చేసిన పల్లె ప్రకృతి వనం, నిర్మాణం పూర్తి చేసిన స్మశాన వాటిక సందర్శించిన కలెక్టర్ వాటి నిర్వహణ పై అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామంలోని అంగన్ వాడి కేంద్రం, ప్రభుత్వ పాఠశాలలో కలెక్టర్ పరిశీలించారు.

అనంతరం అక్కడి నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ఈ గ్రామానికి చెందిన దామోదరరావు ఇటీవల రాజ్యసభ ఎంపీగా ఎంపికయ్యారని, వారి విజ్ఞాపన మేరకు సీఎం కేసీఆర్ ఈ గ్రామంలో పట్టాల్సిన అభివృద్ధి పనుల పై నివేదిక తయారు చేయాలని ఆదేశించారని కలెక్టర్ తెలిపారు.


మండల హెడ్క్వార్టర్ కు దూరంగా ఉండటం వల్ల ఈ కొంతమేర వెనుకబడి ఉందని, గ్రామంలో 3.5 కిలో మీటర్ల సీసీ రోడ్లు, 1 కిలోమీటర్ మురికి కాలువ ఉన్నాయని, మిగిలిన గ్రామం వ్యాప్తంగా దశలల వారిగా సిసి రోడ్లు, అవసరమైన డ్రైన్ ల నిర్మాణ ప్రతిపాదనలు తయారు చేస్తామని కలెక్టర్ తెలిపారు.
జిల్లాలో అందుబాటులో ఉన్న ప్రత్యేక అభివృద్ధి నిధులు, నిధులు వినియోగించి గ్రామ అభివృద్ధికి వెంటనే చర్యలు చేపడతామని కలెక్టర్ అన్నారు. గ్రామంలో చేపట్టే అభివృద్ధి పనులు నిర్వహణ బాధ్యత ను గ్రామ ప్రజలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు


ఈ నెల 26న లోక్ అదాలత్ !


జిల్లా కోర్టు లో ఈ నెల 26 న జరిగే లోక్ అదాలత్ ను విజయవంతం చేయండి – జిల్లా అదనపు సెషన్స్ జడ్జి వీరయ్య ., ఈ సందర్భంగా జడ్జి వీరయ్య మాట్లాడుతూ కోర్టులలో చాలా రోజులుగా  పెండింగ్ లో ఉన్న కేసులు, రాజీ కాబడే కేసు లు ఈ లోక్ ఆధాలాత్ ద్యారా పరిష్కరించుకోవాలని, తెలియజేసారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జి ప్రసాద్, మొదటి అదనపు జడ్జి జితేందర్, జూనియర్ సివిల్ జడ్జి నీహారిక, బార్ అధ్యక్షులు ముద్దం ప్రభాకర్, న్యాయవాదులు ఓం ప్రకాష్, బండ భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


వాహనాల దొంగ అరెస్ట్..
జగిత్యాల మండలం. తాటిపల్లి కి చెందిన వడ్లురి నాగరాజు వాహనాల దొంగను బుధవారం జగిత్యాల పోలీస్ కు అరెస్టు చేశారు.  నాగరాజు ద్విచక్రవాహనంపై వెళ్తుండగా వాహనాలు తనిఖీ చేసిన పట్టణ పోలీసులు. అతనిపై అనుమానం వచ్చి విచారించగా అతని వద్ద నుండి 11 ద్విచక్ర వాహనాలు, ఒక్క ఆటో ను స్వాధీన పర్చుకొని నేరస్తుడిని రిమాండ్ కు తరలించినట్లు డిఎస్పి ప్రకాష్ తెలిపారు…