మహిళలు అన్ని రంగాల్లో ముందు ఉండి స్వయంకృషితో ఆర్థిక స్వావలంబన దిశగా ఎదగాలని అని మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు

మంగళవారం వెల్గటూర్ మండలం రాజారాం పల్లి గ్రామం SR గార్డెన్ లో ధర్మపురి నియోజకవర్గం మహిళా సంఘ సభ్యులకు ఎంటర్ ప్రైజెస్ ల ఏర్పాటు మరియు సహజ ఉత్పత్తుల మార్కెటింగ్ పై శిక్షణ మరియు అవగాహన సదస్సు పాల్గొన్న మంత్రి పాల్గొన్నారు.

ముగింపు కార్యక్రమం!
జగిత్యాల జిల్లా కేంద్రంలో వివేకానంద క్రీడా మైదానంలో బాస్కెట్బాల్ వేసవికాల ఉచిత శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరై బాస్కెట్బాల్ క్రీడా పోటీలలో విజేతగా నిలిచిన క్రీడాకారులకు బహుమతులు ప్రధానం చేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ అనంతరం ఆసక్తి గల పిల్లలకు వేసవిలో ఉచిత శిక్షణ అందజేసిన కోచ్ శ్రీరామ్ ను సన్మానించారు.

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ చుక్క నవీన్, జిల్లా ఎస్సీ ఎస్టీ మానిటరింగ్ సభ్యులు టీవీ సూర్యం, వైష్ణవి డిగ్రీ కాలేజీ కరస్పాండెంట్ సుధాకర్, DCB,YES బ్యాంక్ మేనేజర్ లు రాజేశం, సుధీర్,నాయకులు ప్రభాకర్ రావు, ,సాయి,
మెంటర్లు విజ్ఞాన్, సామంత్,.శశి,సర్పంచులు నారాయణ, ప్రకాష్, మండల రైతు బంధు సమితి కన్వీనర్ నక్కల రవీందర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

పల్లె ప్రగతి పరిశీలన !
ఐదవ విడత పల్లె ప్రగతిలో భాగంగా దొంతాపూర్, మగ్గిడి ఎడపల్లి,జైన గ్రామాలలో జరుగుతున్న అభివృద్ధి పనులను ధరం పూరి మండల పరిషత్ అధ్యక్షులు ఎడ్ల చిట్టిబాబు పరిశీలించారు. వారికి తగు సూచనలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమములో ,DCMS చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి ,మండల ప్రత్యేకాధికారి (జిల్లా పంచాయితి అధికారి) ఇ.హరికిషన్ ,MPDO ప్రవీణ్ కుమార్ ,MPO నరేష్ కుమార్ ,గ్రామాల సర్పంచ్ లు, స్పెషల్ ఆఫీసర్ పంచాయితి కార్యదర్శులు పాల్గొన్నారు.

పరామర్శ !
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కోయపోష గూడెం పోడుభూముల కేసులో అరెస్టు కాబడి జైలు కు వెళ్లిన పన్నెండు మంది ఆదివాసి మహిళల కుటుంబాల మంగళవారం మాజీ ఎంపీ బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు డాక్టర్ వివేక్ వెంకటస్వామి పరామర్శించారు.

ఈ సందర్భంగా వివేక్ మాట్లాడుతూ కెసిఆర్ పాలన రజాకర్ల పాలనలోనే నడిపిస్తుందని బడుగు బలహీన వర్గాలను వేధించడం అరెస్టు చేయడం పరిపాటిగా మారిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధ్యక్షుడు రఘునాథ్ పలువురు బిజెపి నాయకులు కార్యకర్తలు వివేక్ వెంట ఉన్నారు.

ఆలయ జీర్ణోద్ధరణ …
నందిపేట్ మండలం చౌడమ్మ కొండూరులో ఎమ్మెల్సీ గౌ.శ్రీమతి కల్వకుంట్ల కవితక్క దంపతులు వారి కుటుంబ సభ్యులు నిర్మించిన శ్రీ రాజ్యలక్ష్మీ సమేత నృసింహస్వామి ఆలయ జీర్ణోద్ధరణ,ప్రతిష్ఠాపన కార్యక్రమంలో

