జగిత్యాల జూన్ 16:- మన ఊరు మన బడి కింద చేపడుతున్న పాఠశాల అభివృద్ధి పనులను త్వరిత గతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జీ రవి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఇబ్రహీంపట్నం మండలంలోని గోదురు ఊరు గ్రామంలో మన ఊరు మన బడి పాఠశాల శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే. విద్యాసాగర్రావు తో కలిసి కలెక్టర్ హాజరయ్యారు.
ఇబ్రహీంపట్నం మండలం గోదుర్ గ్రామంలో మన ఊరు మన బడి కింద ఎంపికైన జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో రూ.29.97 లక్షలతో, మండల ప్రజా పరిషత్ పాఠశాలను రూ.12.91 లక్షలతో చేపట్టే పనులకు కలెక్టర్ శంకుస్థాపన చేశారు. పాఠశాల అభివృద్ధి పనులు నిర్వహణ కమిటీ త్వరితగతిన పూర్తి చేసే విధంగా కృషి చేయాలని కలెక్టర్ సూచించారు.

అనంతరం ఇబ్రహీంపట్నం గ్రామంలోని మండల ప్రజా పరిషత్ పాఠశాలలోరూ.4.36 లక్షలతో పూర్తిచేసిన అభివృద్ధి పనులను ఎమ్మెల్యే తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. అనంతరం అక్కడ నిర్వహించిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన కోసం సీఎం కేసీఆర్ 7200 కోట్లతో మన ఊరు మన బడి కార్యక్రమాన్ని ప్రారంభించారని కలెక్టర్ అన్నారు.
జిల్లాలో పేద ప్రజలు అంగన్వాడి కేంద్రాల అనంతరం ప్రభుత్వ పాఠశాలల్లో పిల్లలు చేర్పించే విధం ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి చేస్తున్నామని కలెక్టర్ అన్నారు.

పాఠశాలలో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేస్తే, పెయింటింగ్ పాఠశాలకు అవసరమైన ఫర్నిచర్ సమకూర్చడం జరుగుతుందని కలెక్టర్ అన్నారు.
గ్రామంలోని ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులు సమన్వయంతో పాఠశాల అభివృద్ధి పనులు పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. ప్రతి పాఠశాలకు అవసరమైన నిధులు విడుదల చేశామని, పనుల పురోగతి ప్రకారం నిధులు విడుదల చేయడం జరుగుతుంది అని కలెక్టర్ పేర్కొన్నారు.

కార్యక్రమంలో పాల్గొన్న కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ పాఠశాల నిర్వహణ కమిటీ సభ్యులు ప్రజా ప్రతినిధులు కలిసి త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తిచేయాలని ఆయన సూచించారు. మండల ప్రజా పరిషత్ పాఠశాల కు మరో 12 లక్షలు మంజూరు చేశామని వాటితో కిచెన్ షెడ్ నిర్మాణం, పాఠశాల మరమ్మతులు పూర్తి చేస్తామని ఎమ్మెల్యే తెలిపారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలతో పాటు విద్యార్థుల మంచి విద్యను అందించేందుకు ఉపాధ్యాయులు సైతం నియమించే ప్రక్రియ ప్రభుత్వం ప్రారంభిస్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఇబ్రహీం పట్నం గ్రామంలో 3 లబ్ధిదారులు, గోదురు గ్రామంలో 4 లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి చెక్కులను ఎమ్మెల్యే పంపిణీ చేశారు. రెవెన్యూ డివిజన్ అధికారి వినోద్ కుమార్ సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆరోగ్య కేంద్రంలో నిద్ర
ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశాల మేరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిద్ర కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ శ్రీధర్ గారు బుధవారం రాత్రి పెగడపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిద్ర చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎంహెచ్ఒ డాక్టర్ ఎన్. శ్రీనివాస్, మరియు ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఎ.శ్రీనివాస్ , మరియు జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమం జిల్లా అధికారి టి.స్వామి, వ్యాధి నిరోధక టీకాల కోఆర్డినేటర్ సత్యనారాయణ, వైద్యాధికారి డాక్టర్ ప్రణవ్ సిబ్బంది ఆరోగ్య కేంద్రంలో పడుకున్నారు.
దీని ముఖ్య ఉద్దేశం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో మౌళిక వసతుల నిర్వహణ కోసం అధ్యయనం చేయడం. ఇందులో భాగంగా త్రాగునీరు, కరెంటు సరఫరా, బాత్రూంల పరిశుభ్రత తో పాటుగా ఆరోగ్య శాఖ కార్యక్రమాల అమలు తీరును సమీక్షించడం జరిగింది. జిల్లా.వైద్యాధికారి శ్రీధర్ ఈ సందర్భంగా వివరించారు.
ఇస్లాం ప్రవక్తను అవమానించిన
..వారిని వెంటనే అరెస్ట్ చేయాలి

ఇస్లాం ప్రవక్తను అవమానించిన బీజేపీ , మాజీ నేతలు నోపుర్ శర్మ, నవీన్ కుమార్ జిందాల్ లను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల్ పట్టణంలోని జామా మస్జిద్ (కిల గడ్డ) వద్ద మిల్లత్-ఏ-ఇస్లామియా సెంట్రల్ కమిటీ ఆధ్వర్యంలో గురువారం భారీ నిరసన ప్రదర్శన జరిగింది.
జామియా మసీదు జగిత్యాల ఎదుట జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో జగిత్యాల మిల్లత్ ఇస్లామియా సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు, ముహమ్మద్ అబ్దుల్ బారీ, జగిత్యాల మజ్లిస్ అధ్యక్షుడు యూనిస్ నదీమ్ లతో, పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు, పెద్ద సంఖ్యలో ముస్లింలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.అనంతరం
మిల్లత్-ఎ-ఇస్లామియా జగిత్యాల సెంట్రల్ కమిటీ అధ్యక్షుడు అబ్దుల్ బారీ నేతృత్వంలోని ప్రతినిధి బృందం జాయింట్ కలెక్టర్ లతను కలిసి లిఖిత పూర్వకంగా వినతి పత్రం అందించింది.
ఈ నిరసన కార్యక్రమంలో యూనిస్ నదీమ్, ముఫ్తీ సిద్ధిక్,కాంగ్రెస్ నుంచి సిరాజుద్దీన్ మన్సూర్, టీఆర్ ఎస్ నుంచి అమీనుల్ హసన్, ఖలీద్ ఖాన్, మజ్లిస్ ప్రతినిధి షకీల్ పట్వారీ ఇస్లాంపుర మసీదు అధ్యక్షుడు జుల్ఫికర్ తదితరులు పాల్గొన్నారు.

NDAలో మెరిసిన జగిత్యాల యువకుడు…
యూపీఎస్సీ ద్వారా నిర్వహించిన నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్డీఏ) పరీక్షలో జగిత్యాలలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన బోయినపల్లి ప్రసాదావు – మనోజ దంపతుల కుమారుడు స్వరూప్ రావు సత్తా చాటాడు. ఎన్డీఏ – 2021 పోటీ పరీక్షకు హాజరయ్యాడు. 5లక్షల మందికిపైగా హాజరైన పరీక్షలో 8 వేల మంది ఇంటర్వ్యూ నిర్వహించగా స్వరూప్ రావు 213వ ర్యాంకు సాధించాడు. దీంతో తల్లిదండ్రులు, కాలనీవాసులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.

పట్టణ ప్రగతి
జగిత్యాల పట్టణములో 4వ విడత పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా 34,33 వార్డులలో పర్యటిస్తూ,వార్డు
ప్రజలకు పారిశుధ్యం పట్ల అవగాహన కల్పిస్తూ,పట్టణ అభివృద్ధి పనులను ప్రజలకు తెలియజేస్తూ, పట్టణ ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ మున్సిపల్ చైర్ పర్సన్ భోగ శ్రావణి ప్రవీణ్ .
ఎమ్మేల్యే మాట్లాడుతూ మార్పు ప్రతి ఒకరి నుండి మొదలు కావాలని, నా నుండే మార్పు మొదలు పెడుతున్నాను అని సందర్భంగా ప్లాస్టిక్ నివారణ లో భాగంగా డ్రైవర్, గన్ మెన్ లకు, అసిస్టెంట్ లకు టిఫిన్ ,బొజనం నిమిత్తం స్టీల్ బాక్స్ లు ప్రజల సమక్షంలో అందజేశారు,.ప్రతి ఒక్కరూ ప్లాస్టిక్ నివారణ కోసం పని చేయాలని,మన భూమాత ను కాపాడు కోవల్సిన భాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని ఈసందర్భంగా అన్నారు.

ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, స్థానిక కౌన్సిలర్ లు బండారి రజనీ నరేందర్, పిట్ట ధర్మరాజు, పద్మావతిపవన్, ,DEరాజేశ్వర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి ఆనంద్ రావు,ఉపాధ్యక్షులు ఓల్లెం మల్లేశం,ధూమాల రాజ్ కుమార్,యూత్ అధ్యక్షుడు కత్రోజ్ గిరి,కౌన్సిలర్ లు కూతురు రాజేష్,కోరే గంగ మల్లు, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్:లో
పరామర్శ !!
మేడిపల్లి మండల గోవిందారమ్ గ్రామానికి చెందిన డా. బేజ్జంకి ప్రసాద్ రావు ఇటీవల మరణించగా గురువారం పెద్దకర్మ కార్యక్రమానికి జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ హాజరై చిత్ర పటానికి పూలమాలలు సమర్పించి నివాళులు అర్పించరు. ఎమ్మెల్యేతో పాటు
జగిత్యాల పద్మ నాయక సంక్షేమ మండలి మాజీ అధ్యక్షులు పురుషోత్తం రావు తదితరులు ఉన్నారు

.
సమస్యలను వెంటనే పరిష్కరించాలి:జిల్లా కలెక్టర్ జి.రవి
జగిత్యాల,: -జిల్లాలోని ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జి.రవి సంబంధించిన అధికారులను ఆదేశించారు. కల్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్, ధరణి పెండింగ్ మ్యూటేషన్, అక్రమ ఇసుక రవాణా నియంత్రణ తదితర అంశాల పై సంబంధిత అధికారులతో కలెక్టర్ గురువారం జూమ్ ద్వారా రివ్యూ నిర్వహించారు.
జిల్లాలో గత వారంలో మండలాల వారీగా సీజ్ చేసిన అక్రమ ఇసుక రవాణా వివరాలు కలెక్టర్ తహసిల్దార్ లను అడిగి తెలుసుకున్నారు. అక్రమ ఇసుక రవాణా క్షేత్రస్థాయిలో నిలిపివేసేందుకు నిరంతరం తనిఖీలు నిర్వహించాలని, అధికారులు క్షేత్ర స్థాయిలో నిఘా పెంచాలని కలెక్టర్ సూచించారు.
జిల్లాలోని పాఠశాలలో ప్రారంభానికి సిద్ధంగా ఉన్నా, మన ఊరు మన బడి పనులు వీటికి అవసరమైన ఇసుకను కేటాయించాలనే, దీనిపై సంపూర్ణ నివేదిక తయారు చేయాలని కలెక్టర్ ఆర్డీవోలకు ఆదేశించారు.
జగిత్యాల రూరల్, ధర్మపురి, మల్లాపూర్, కోరుట్ల మండలాలలో అధికంగా కల్యాణ లక్ష్మి షాదీ ముబారక్ దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయని, తాసిల్దారు సంబంధిత ఎమ్మెల్యేలతో సమన్వయం చేసుకుని వెంటనే క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు.
అనంతరం ధరణి దరఖాస్తులు, పెండింగ్ మ్యూటేషన్, ప్రజావాణి దరఖాస్తుల పరిష్కారం మండలాల వారీగా వివరాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.
జిల్లాలో చేపట్టిన మన ఊరు మన బడి కార్యక్రమంలో ఎంపికైన పాఠశాలల అభివృద్ధి నిర్మాణ పనులు జాప్యం లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలని ఆర్.డి.ఓ.లను కలెక్టర్ ఆదేశించారు.
అదనపు కలెక్టర్ బి.ఎస్. లత , జగిత్యాల,కొరుట్ల, రెవెన్యూ డివిజన్ అధికార్లు, తాసిల్దారు సంబంధిత అధికారులు, సిబ్బంది, తదితరులు ఈ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.