సోమవారం జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఉన్నత పాఠశాలలో మన ఊరు..మన బడి కార్యక్రమంలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..
గ్రామాలు, పట్టణాల అభివృద్ధికి పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలు అమలుతో ఆదర్శంగా నిలిచిందన్నారు. అలాగే పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించడానికే ‘మన ఊరు – మన బడి’ కార్యక్రమం ప్రారంభించినట్లు చెప్పారు.

సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కోరంగంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధి చేస్తుందన్నారు.
వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రాజెక్టుల నిర్మాణం, చెరువులు పునరుద్ధరణ, రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువచ్చిందన్నారు.
మన ఊరు-మన బడి కార్యక్రమం దేశానికే ఆదర్శం నిలుస్తుంది,ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ పాఠశాలల కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు.

2 లక్షల ఎల్వోసి ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ !
రాయికల్ పట్టణ క్లబ్ రోడ్డు లో నివసించే కే.భావన D/o బాలయ్య, క్యాన్సర్ వ్యాధి తో బాధపడుతూ శస్త్ర చికిత్స నిమిత్తం ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న విషయం తెలుసుకొని స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయనిధి నుండి మంజూరైన రెండు లక్షల రూపాయల ఎల్వోసి నీ నిమ్స్ హాస్పిటల్ లో భావన కుటుంబ సభ్యులకు అందించారు.

నిధులు కేటాయించండి!
D 61 కెనాల్ ఆధునీకరణ నిధులు మంజూరు కై మంత్రి వేములకు ఎమ్మెల్యే డా.సంజయ్ వినతి.
రోడ్డు భవనాల శాక మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ని హైదరాబాదులో లో ఆయన నివాసం లో కలిసి జగిత్యాల పట్టణంలో రామాలయం నుండి, బైపాస్ రోడ్డు వరకు,D61 కెనాల్ ఆధునీకరణ పనులు కోసం కోటి పదిహేను లక్షలు నిధులు మంజూరు చేయాలని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ వినతి పత్రాన్ని అందజేశారు.

కళ్యాణోత్సవంలో మంత్రి!
పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం బంజేరుపల్లి గ్రామంలో గొల్ల,కురుమల ఇలవేల్పు బీరప్ప స్వామి, కమరాతి దేవి కళ్యాణోత్సవానికి హాజరైన సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు.

నిధుల కోసం వినతి పత్రం!
మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ శ్రీదర్ హైదరబాద్ లో వారి కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి జగిత్యాల, రాయికల్ ,మున్సిపల్ అభివృద్ధి పనులు, నిధుల మంజూరు మరియు పలు అంశాలపై జగిత్యాల ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ వినతి పత్రం అందించారు.

ప్రజావాణిలో 38 దరఖాస్తులు!
జగిత్యాల పట్టణంలోని స్థానిక IMA హాల్ లో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో వివిధ సమస్యలపై 38 మంది దరఖాస్తుదారులు కలెక్టర్ రవికి అందించారు ఈ సందర్భంగా సంబంధిత అధికారులను త్వరితగతిన ఫిర్యాదులను పరిష్కరించే వలసిందిగా కలెక్టర్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సీఎం ఆర్థిక సహాయం!
జగిత్యాల జిల్లా బీరుపూర్ మండలం తుంగూర్ గ్రామానికి చెందిన కందుకూరి లచ్చన్న గతకొన్ని నేలల క్రితం కరొన వ్యాధి తో మరణించాడు అతని భార్య కందుకూరి పొసవ్వ కు CM RF చేక్కు ₹15.000 చెక్.ను తుంగూర్ గ్రామ సర్పంచ్ గుడిసె శ్రీమతి జితేందర్ యాదవ్ అందించారు.ఈ కార్యక్రమంలో మండల కొఅపుషన్ మేంబర్ MD బీబా ,మరియు ,MP TC అడేపు మల్లేశ్వరి తిరుపతి ,మరియు ఉపసర్పంచ్ ,పూడురి రమేష్ పాల్గొన్నారు

తెలంగాణ యువజన కాంగ్రెస్, రాష్ట్రఅధ్యకుడు కొత్తకాపు శివసేన రెడ్డి ఆదేశానుసారం బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఏఐసీసీ నేత రాహుల్ గాంధీ పై పెట్టిన తప్పుడు ఈడి కేసును వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ ధర్మపురి- జగిత్యాల జాతీయ రహదారి కాంగ్రెస్ దిగ్బంధం చేశారు. అగ్నిపథ్ అనే పధకాన్ని తీసుకువచ్చి లక్షల మంది ప్రవేశ పరిక్ష కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులను దృష్టిలో పెట్టుకోకుండా అగ్నిపథ్ అనే పథకం ద్వారా వారి జీవితాలను నాశనం చేసిన బీజేపీ కేంద్ర ప్రభుత్వం వెంటనే అగ్నిపథ్ పధకాన్ని బేషరతుగావెన్నకి తీసుకొని పాత పద్దతి ద్వారానే రిక్రూట్మెంట్ చేసుకొని వారికి మళ్ళీ ఆర్మీలో చేర్చుకొని అవకాశం కల్పించాలనీ, పాత పెన్షన్లు కూడా పాత పద్దతి ద్వారానే ఇవ్వాలని డిమాండ్ చేశారు.
పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. ఉపాధ్యాయులు ఉద్యోగులు బదిలీలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 2558 మందికి ఉపాధ్యాయులు ,ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుంది. విద్యాశాఖకు సంబంధించిన ఉత్తర్వులు ఇవ్వాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు

రోడ్డు ప్రమాదంలో టిఆర్ఎస్ నాయకుడు మృతి
ముద్దమల్ల సందీప్ మిషన్ కౌపౌండ్- జగిత్యాల పట్టణ నివాసి. సోమవారం మోర్తాడ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో జగిత్యాల పట్టణానికి చెందిన టిఆర్ఎస్ నాయకుడు ముద్ద మల్ల సందీప్ మృతిచెందాడు. సందీప్ మృతి పట్ల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సంతాపం వ్యక్తం చేశారు.

కాళేశ్వరం పరిసర ప్రాంతాల్లో చేపల వాన
సోమవారం తెల్లవారు జామున కాళేశ్వరం లో భారీ వర్షం కురవడంతో కాళేశ్వరం ,పల్గుల, బైపాస్ రోడ్డు కాలనీలో విచిత్రం చోటుచేసుకుంది.
అక్కడే వున్న కొందరి ఇళ్ళ పరిసరాలలో, అటవీ ప్రాంతంలోని, పడిదం చెరువు, గుంతలలో చేపలు ప్రత్యక్షం కాగా, పడిదం చెరువు సమీపంలో ఉపాధి హామీ పనులు జరుగుతుండడంతో కూలీలు గుంతలలో ఉన్న చేపలను గమనించి వాటిని పట్టుకున్నారు. ఇంటి పరిసరాలలోకి చేపలు ఎలా వచ్చాయని స్థానికులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. ఈ చేపలను ఎప్పుడూ చూడలేదని స్థానికులు తెలిపారు. పలుచోట్ల కనిపించిన చేపలను చూడడానికి స్థానికులు తరలివెళ్తున్నారు. దీంతో అక్కడ పండగ వాతావరణం కనిపించింది. మృగశిరకార్తెలో చేపలు తినాలని అంటారు. చేపల వాన పడడంతో చేపలు కొనకుండానే ఇంటికి తీసికెళ్ళారు స్థానికులు,