మండుటెండలో – మంత్రముగ్ధుల్ని చేస్తున్న పని తీరు!

J.Surender Kumar,
వారు ఉపాధిహామీ కూలీలు, వారికి నిర్దేశించిన కూలిపని ని, బద్ధతతో క్రమశిక్షణతో, ఎండా , వాన  లెక్కచేయక, కలిసికట్టుగా, గొలుసు పద్ధతిలో, త్వరితగతిన చేస్తున్న
పనులు, చూపరులకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని, అద్భుత దృశ్య కావ్యాన్ని చూపించాయి.

  వీరు ఫోటో షూట్ ల కోసం ఫోటోల కోసం నిలబడిన దృశ్యం కాదు,  కష్టపడుతూ తమ రక్తాన్ని, చెమటగా మారుస్తూ , కాల్వ పూడికతీత పనులు చేస్తున్న దృశ్యం ఇది. 

వారికి ఏ శిక్షకుడు ఇలాంటి శిక్షణ ఇవ్వలేదు, వారిలో వారే ఒక క్రమ పద్ధతిలో క్రమశిక్షణగా నిలిచి మట్టిని ఎత్తి పోస్తున్న దృశ్యం మాలికలు ఇవి.


జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం  శనివారం గుమ్లాపూర్ గ్రామంలో కాలువలో పూడిక తీత పనుల్లో భాగంగా తవ్విన మట్టిని కిందినుండి పైకి ఎత్తి . పోయడం కోసం ఒకరినొకరు రెండు వరుస క్రమంలో నిలుచుండి మట్టిని పైకి తరలిస్తున్న  దృశ్య మాలిక ఇది. ఈ ఛాయా చిత్రాలను వారు తీసింది కాదు, ఎవరో ఫోటోగ్రాఫర్  తీసింది కాదు.  అటువైపు వెళ్తున్నా కొందరు ఈ దృశ్యాలను తన కెమెరాలో బంధించి  మీడియాకు అందించారు.